నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, November 30, 2010

ఇందిరమ్మ నాగు పాము అయితే సోనియమ్మ కొండచిలువ

చివరికి సోనియాతో ఆడుతున్న గేమ్ లో జగనే తొలి అడుగేశాడు. సోనియా తనకై తాను పార్టీ నుంచి గెంటేసే దాకా బయటకి పోకూడదని జగన్, తనకై తాను పార్టీని వీడెదాకా వేచిచూడాలని సోనియా ఇద్దరూ వెయిటింగ్ గేమ్ ఆడుతూ ఉంటే చివరికి సోనియా తన చుట్టు బిగించిన చక్రబంధంలో ఊపిరాడక చివరికి తనంతట తానే పార్టీని వీడి బయటపడాల్సి వచ్చింది జగన్.
     
ప్రత్యర్ధిని ఎదుర్కొనే విషయంలో సోనియా అత్తగారైన ఇందిరా గాంధీది కింగ్ కోబ్రా మెథడ్ అంటారు. అదును చూసి కాటేస్తే ఒక్క దెబ్బకి ప్రత్యర్ధి మటాషై పోవాల్సిందే. అయితే సోనియాది అందుకు విరుద్ధమైన పద్ధతి. ఇది కొండచిలువ విధానం. ప్రత్యర్ధిని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసి గిల గిల లాడేలా చేస్తుంది. ఇప్పుడు జగన్ ని ఆ పద్ధతిలోనే డీల్ చేసింది. 


ముందు జగన్ అనుచరులని పార్టీలోంచి పంపేయడమో షోకాజ్ నోటీసులిప్పించడమో చేసింది. తరువాత ముఖ్యమంత్రిని మార్చేసి రోశయ్య తరువాతైనా చాన్స్ దక్కుతుందన్న ఆశ అతనిలో దూరం చేసింది. మరో పక్క చిరంజీవిని దువ్వి జగన్ పార్టీలోంచి ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలను చీల్చినా భయం లేదని చూపించింది. తరువాత జగన్ చిన్నాన్నని మంత్రి పదవి పేరుతో ఢిల్లీకి పిలిచి మచ్చిక చేసుకొంది. ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకి అంబటి రాంబాబు చేతనే జగన్ డౌన్..డౌన్ అనిపిస్తుందేమోనని భయపడి జగన్ రాజీనామా చేసి పార్టీ లోంచి బయటకి రాక తప్పలేదు.

6 comments:

Apparao said...

కిట్టయ్యా
పోస్ట్ బాగుంది కానీ ఆ పాము ని చూస్తుంటే భయం వేస్తోంది
మీ బ్లాగ్ కి ఎవరూ రాకూడదని అలా పెట్టారా ?

Y.S.JaganMohan Reddy said...

Dear Sonia Ji,



మీరు తలుచుకుంటే....రాత్రి రాత్రి కి M.L.A candidates ని పట్టుకురాగలరు......కానీ,కార్యకర్తలని తెచ్చుకోగలరా??....మీ కంటే మహా మేధావి....good bureaucrat.....able administrator.....తన రెండు కళ్లతోనే....2020 వరకు చూడగలిగిన మహా నేత....మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే తప్పు చేశారు....తను అనుభవించే అధికారం కార్యకర్తల కాయ కష్టం అని మరిచిపోయి...పొగురుబట్టి...మట్టి గొట్టుకుపొయారు....మీరు ఏకంగా....Italy కే కొట్టుకుబోయేట్లు ఉన్నారు....



మీకీ సంధర్భం లో ఒక విషయం గుర్తుచేస్తున్నాను......షరద్ పవార్,మొయిళీ..... లాంటి..వాల్ళు...మా నాన్నగారితో..... "ఏంటి...రాజశేఖర్...రాష్ట్రం లో ఇంత popularity ఉండి....సొంత పార్టి ఎందుకు పెట్టుకోవు?... అని అడిగినప్పుడు...."ఎందుకు పెట్టాలి?...కాంగ్రెస్సు నాకు సముచిత స్థానం కల్పిస్తున్నప్పుడు..ఎందుకు పెట్టాలి?... "అని అన్నారు...ఈ విషయం మీకు చెప్పటానికి మా నాన్న గారు....ఈ రోజు లేకపోవచ్చు.. .. వున్నా మీ appointment దొరకకపొవచ్చు...షరద్ పవార్,మొయిళీ...పక్కనే వున్నారు గా అడిగి చూడండి....



తెలంగాణా...విషయం లో మీకంటూ..ఒక వైఖరి స్పష్టంగా లేనప్పుడు... మీరెందుకు డిసెంబర్ ప్రకటన చేయించారు?ఒక తాగుబొతోడికి భయపడా?వాడు తాగితే...ఒక మాట...తాగకుంటే...ఇంకో మాట మాట్లడతాడు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో... తెలంగాణ ఇవ్వలేరని..మీకు తెలుసు...నాకు తెలుసు.....ఇస్తే....మమతా బెనెర్జీ,షరద్ పవార్ మద్దతు ఉపసంహరిస్తారు..... ఇన్ని తెలిసీ మీరెందుకు తెలుగు ప్రజల మనోభావాలతో ఆటలాడుతున్నారు?అన్నదమ్ముల మద్య చిచ్చు పెట్టడానికా??ఇదేం రాజకీయం...



నేనే గనుక లేకుంటే...మా నాన్న గారికి కూడా.... పి.వి గారికి పట్టిన గతే పట్టుండేది. పాపం...రాజధాని లో స్మారకం లేని...ఏకైక ప్రధాని పి.వి.ఆయన హయాం లో చేసిన అవినీతి అంతా ఆయనది...అభివ్రుద్ధి అంతా మీదా?మా నాన్న గారు చనిపోయి..సంవత్సరం కూడా కాకముందే....బొత్స,దివాకర్,రవీంద్రా రెడ్డి లాంటి...ఉత్తమ జనులు వచ్చారండి...Y.S.R అవినీతిపరుడు అని నిరూపించడానికి...అప్పుడు మీరెందుకు వారిని వారించలేదు....చెవులు మూసుకొని పోయాయా??ఇప్పుడు ప్రజలు ballot paper మీద Y.S.R(యువజన శ్రామిక రైతు ) party కి గుద్దుతుంటే ఆ శబ్దం తో మీ చెవులకు పట్టిన తుప్పు వదులుతుంది.



తెలంగాణ అన్నలకి,తమ్ముల్లకి,అక్క చెల్ళెల్లకి నేను ఒకటే చెబుతున్నా.... తెలంగాణ కోసం మీరెందుకు ఆత్మ హత్యలు చేసుకుంటారు.....రెండు లీటర్ల కిరోసిన్ తీసుకొచ్చి కె.సి.ర్ ని,సోనియా ని తగలెయ్యండి... తెలంగాణ రాకుంటె...అప్పుడు అడగండి...నా యావదాస్తి రాసిచ్చెస్తా...



ఇక సెలవు...మీ

Y.S.JaganMohan Reddy.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

జగన్ భయ్యా! మీకు నా ప్రగాఢ సానుభూతి. మీ అవేదన నా కర్ధమయింది. మనలో మన మాట, యావదాస్థి అన్నారు...ఏమాత్రముంటుందేమిటి?

astrojoyd said...

2lakshala kotlu.ika pothae,sonia kondachiluva kaadu "anaconda'

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

astrojoyd గారూ గుండె ఆగి పోయింది ఓ క్షణం. కొండచిలువకీ అనకొండకీ తేడా అనకొండ మింగేస్తుంది అనేనా?

Sree said...

YSR simham ayite jagan pilla koti :)