నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, July 10, 2011

ప్రభుత్వాసుపత్రుల గురించి జగన్ అవగాహనా రాహిత్యం. జగన్ చెప్పినట్లు జరిగితే ఈ ఆసుపత్రుల భవితవ్యం

ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ ఫార్టీ ప్లీనరీ అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. జగన్ తన ఉపన్యాసంలో ఆకాశాన్ని దించి ప్రజల అరచేతిలో పట్టే ప్రయత్నం చేశాడు. అందులో ఎటువంటి తప్పు లేదు. కొత్త పార్టీ, అధికారంలోకి రావాలనుకొనే పార్టీ, ఆమాత్రం వాగ్ధానాలు సహజమే. తెలంగాణా పైన అటూఇటూ కాకుండా తన విధానాన్ని చెప్పాడు. ఇది కూడా అర్ధం చేసుకోవచ్చు. వంద సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్, మూడు దశబ్ధాల తెలుగుదేశమే ఈ అంశమ్మీద రెండు నాల్కల ధోరణిలో ఉన్నాయి. పొత్తిళ్ళలో ఉన్న ఈ కొత్త పార్టీ నుంచి స్పష్టమైన వైఖరి ఆశించడం తప్పే అవుతుంది.


 
అయితే తన ఉపన్యాసంలో జగన్ ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావించినప్పుడు రెండు వ్యాఖ్యలు చేశాడు. ఆరోగ్యశ్రీలో ఉన్న కొన్ని ఆపరేషన్లని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిదనీ, వీటిని చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రులలో మౌళిక సదుపాయాలు లేవని, తాను అధికారంలోకి వస్తే అన్ని వ్యాధులని ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్ హాస్పిటల్స్‌లోనే వైద్యం జరిగేలా చూస్తామని అన్నారు. తన తండ్రికి ఎన్నికల సమరంలో పాశుపతాస్త్రంలా ఉపయోగపడిన ఆరోగ్యశ్రీని మరింత పదును పెట్టి వాడుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ, ఈ పథకాన్ని ఎలా ఎన్నికల్లో వాడుకోవాలి అన్న విషయంలో తప్ప ప్రభుత్వాసుపత్రుల గురించి కాని, ఆరోగ్యశ్రీ పని తీరు గురించికానీ జగన్‌కి అవగాహన లేదని తెలిసిపోతుంది.


   
ప్రభుత్వాసుపత్రులలో ఉన్న సదుపాయాలు చాలా ప్రైవేటు ఆసుపత్రులలో ఉండవు.ట్రైన్‌డ్ నర్సులూ, ట్రైన్‌డ్ వార్డ్ బాయ్‌లూ చాలా ప్రైవాటు హాస్పిటల్స్‌లో ఉండరు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి పని చేయించుకుంటారు. క్రమేపీ వాళ్ళు అనుభవం గడించి పని నేర్చుకుంటారు. ఇక డాక్టర్ల విషాయానికొస్తే హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్లూ, అసిస్టెంట్ ప్రొఫెసర్లూ ఉంటారు. ఎటొచ్చీ వారితో పని చేయించడమే కష్టం. ఇక ఉన్న లోపమల్లా ఖరీదైన ఎక్విప్‌మెంట్ అన్ని చోట్లా ఉండకపోవచ్చు.


ధన మూలం ఇదం జగత్ అన్నారు. ప్రభుత్వాసుపత్రులలో చేయదగ్గ ఆపరేషన్లు అక్కడ మాత్రమే చేయించుకోవాల్ని నిబంధన పెట్టి వాటికి ఆరోగ్యశ్రీ నుంచి ఇచ్చే డబ్బుని హాస్పిటల్‌కీ డాక్టర్‌కీ ఇస్తే ఆపరేషన్‌లు చేయించుకోవడానికి పేషంట్లు వస్తారు, డాక్టర్లకీ మోటివేషన్ ఉంటుంది. హాస్పిటల్ కూడా డబ్బు సంపాదించి ఆధునిక పరికరాలు సమకూర్చుకో గలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా వాళ్ళు న్యాయంగా చేయాల్సిన పని వారి చ్వేత చేయించాలని చూసిన చంద్రబాబు ఏమయ్యాడో చూశాం కాబట్టి ఇలా డబ్బు ఇన్సెంటివ్ చూపి పని చేయించడమే మంచిది.


ఈ దిశగా పోయిన వారం ఆరోగ్య శాఖా మంత్రి రవీంద్రా రెడ్డి అపెండెక్టమీ, హిస్టిరెక్టమీ లాంటి ప్రభుత్వాసుపత్రులలో చేయదగ్గ ఆపరేషన్లు అక్కడే జరిగేలా చూస్తామని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. దానిపై జగన్ ఇలా దాడి చేశారు.


జగన్ చెప్పినట్లు అన్ని రకాల ఆపరేషన్లు  కార్పొరేట్ హాస్పిటల్స్‌లో మాత్రమే చేసేలా ప్రభుత్వాసుపత్రి కాకుల్ని కొట్టి కార్పొరేట్ గద్దలకి వేసే పద్ధతిని మరింత తీవ్రం చేస్తే ఏం జరుగుతుంది?


ప్రభుత్వాసుపత్రులలో ఆపరేషన్లు జరగక అక్కడ వైద్య విద్య అభ్యసించే విద్యార్ధులు కేవలం థియరీ తప్ప ప్రాక్టికల్సు లేని డమ్మీ డాక్టర్లుగా బయటికొస్తారు. అసలు పేషంట్లే లేనప్పుడు ఈ హాస్పిటల్స్ మాత్రం ఎందుకని ప్రభుత్వాసుపత్రులని కార్పొరేట్ హాస్పిటల్స్‌కి లీజుకి ఇచ్చి పారేస్తారు. వాళ్ళు అక్కడ మెడికల్ కాలేజీలో, మరిన్ని కార్పొరేట్ హాస్పిటల్సో కట్టుకుంటారు. ఇందుకయ్యే ఖర్చు కూడా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే వాళ్ళకి సమర్పించుకొంటుంది. 

33 comments:

Praveen Mandangi said...

ఆరోగ్యశ్రీ గురించి నేను ముఖ్యమంత్రికి రెండు సార్లు మెయిల్స్ పంపాను. పౌరులు పంపిన మెయిల్స్ ముఖ్యమంత్రి చదువుతాడో, లేదో.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఆయన తన పీఠాన్ని కాపాడుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇక మెయిల్స్ చదివే తీరిక ఎక్కడిది.

Praveen Mandangi said...

అది అతని పర్సనల్ మెయిల్ అడ్రెసే. దానికి అతని బంధువులు కూడా మెయిల్స్ పంపుతారు. బంధువులు పంపే మెయిల్స్ కోసమైనా ఆ ఐడిలోకి లాగిన్ అవుతాడు. కానీ పౌరులు పంపే మెయిల్స్ చదువుతాడో, లేదో తెలియదు. ఎందుకంటే పాలకవర్గంవాళ్ళకి అధికారమే ముఖ్యం కానీ ప్రజలు ముఖ్యం కాదు కదా.

Praveen Mandangi said...

ఇది ముఖ్యమంత్రి పర్సనల్ మెయిల్ అడ్రెస్ nallarikk@yahoo.co.in అధికారిక మెయిల్ అడ్రెస్‌కి పంపకూడదు. దానికైతే నా లాంటివాళ్ళు పంపుతారని తెలిసి అది కావాలని ఓపెన్ చెయ్యకపోవచ్చు.

Indrasena Gangasani said...

ప్రభుత్వ ఆసుపత్రులయినా, ప్రైవేటు ఆసుపత్రుయినా అది జాతి సంపదే. ఆరోగ్య శ్రీ మీద ప్రభుత్వం `సాలీనా 2000 కోట్లు వెచ్చించి 2 లక్షల మందికి ఆపరేషన్లు చేయించి అనుకుందాము. అదే డబ్బుని ప్రభుత్వ ఆసుపత్రు మీద వెచ్చిస్తే వాళ్ళు కనీసం 2 వేల ఆపరేషన్లు కూడా చేయించరు. ఎందుకంటే మన ప్రభుత్వ రంగం అంతగా కుళ్ళి పోయింది. ప్రతి ప్రభుత్వ డాక్టర్ కి ప్రైవేటు ప్రాక్టీస్ ఉంది.

మన ప్రభుత్వ ఉద్యోగులని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు దిగి వచ్చినా బాగు చేయలేడు. ఇది గాంగ్రెన్ వచ్చిన కుళ్ళిన వ్యవస్థ. దీనికి మందు దానిని సాధ్యమయినంత త్వరగా తొలగించడమే.

అసలు ఆరోగ్య శ్రీ ఎందుకు వచ్చినదంటే ఒక నాడు మంద కృష్ణ మాదిగ గారు గుండె జబ్బులు గల దళిత పిల్లల తో ట్యాంక్ బండ్ మీద ధర్నా చేయించడం. ఆ రోజు జరిపిన సర్వేల్లో దాదాపుగా 2 లక్షల మంది పేద దళిత,గిరిజన పిల్లలు గుండె జబ్బుతో బాధ పడుతున్నారు.

రెక్కాడితే గానీ డొక్కాడని ఈ కుటుంభాల లో లక్షలు వెచ్చించి ఆపరేషన్లు చేయించడం అసంభవం. వారి అందరికి ప్రభుత్వ ఆసుపత్రులల్లో గుండె ఆపరేషన్లు చేయించడం కూడా అసంభవం. ఎందుకంటే మనకు ఆనాడు,ఈనాడు ప్రభుత్వ ఆసుపత్రులలో కావాల్సిన మౌలిక వసతులు లేవు.

మరి ఏమి చేద్దాము వీళ్ళందరినీ. వాళ్ళ చావుకు వాళ్ళని వదిలివేద్దామా? మన ప్రజల్ని మనమే వాళ్ళ చావుకు వదిలేద్దామా? ఒక పరిష్కారం ఆ తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థతి మెరుగుపరచడం. ఉన్న పళంగా మన సమాజం లో పేదరికాన్ని దూరం చేయడం సాధ్యమా?

అందుకే ఒక్క రోజే 250 కోట్ల రూపాయలు YSR పసి పిల్లల గుండె జబ్బులకి కేటాయించాడు,కొంత డబ్బు విరాళాల ద్వారా సేకరించారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో పిల్లలలకి ఆపరేషన్లు చేయించాలని ఆదేశించాడు. ఆ సంఘటన తరువాత ఆయన ఆలోచనలతో వచ్చిందే ఆరోగ్యశ్రీ.

ఈ ఆరోగ్య శ్రీ వలన రెండు ఉపయోగాలు ఉన్నవి. 1 ) తాత్కాలికంగా నయినా మన ప్రజల ప్రాణాలు కాపాడటం 2 ) ప్రజలని మెడికల్ ఇన్సురన్స్ కి అలవాటు చేయడం.

కొన్ని రోజుల్లకి వారి ఆర్ధిక పరిస్థతి మెరుగుపడితే వారే సొంతగా మెడికల్ ఇన్సురన్స్ తీసుకుంటారు. ఇక ఆరోగ్య శ్రీ తో పని ఉండదు.

భారత దేశం లో ఉన్నంతమంది స్థిర ఆదాయం లేని కార్మికులు మరే దేశం లోనూ ఉండరు. నేడు సాఫ్ట్వేర్ ,ఇతర ప్రైవేటు కంపనీలు తమ సంస్థలలో ఉద్యోగులందరికీ మెడికల్ ఇన్సురన్స్ కల్పిస్తాయి. మన భారతీయ కార్మికులందరూ స్థిర ఆదాయం గల రంగం లోకి మారినంతవరకూ మనకు ఈ అర్రోగ్యశ్రీ లు తప్పవు.

భారత దేశం లాంటి సామాజిక వైరుధ్యం గల దేశాల్లో ప్రభుత్వం ద్వారా అన్ని చేయిన్చాలనుకోవడం మూర్ఖత్వం. మన సమాజానికి ప్రైవేటు వ్యవస్థే సరి అయిన మందు. దేశ రక్షణ, శాంతి భద్రతలు,సాధారణ పరిపాలన తప్ప మిగతా అన్ని విభాగాలు ప్రైవేటు పరం చెయ్యాలి.

యూరప్ లో చాలావరకు మెడికల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది. వారివి చిన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు. మనకు ఆ మోడల్ సరిపోదు.

మూర్ఖ సామ్యవాద భావనలతోనో, అర్ధం పర్ధం లేని అర్ధ తెలివి తేటల తోనో, కొన్ని రాజకీయ కారణాల చేతనో ఈ పధకాన్ని విమర్శించడం అర్ధరహితం.

ఆ ప్రభుత్వ ఆసుపత్రులన్నిటినీ వాటి చావు వాటిని చావనియ్యండి. కొన్ని రోజుల తరువాత వాటంతట అవే నశిస్తాయి.

సామ్యవాద భావనలతో , నెహ్రూ గారి అర్ధం పర్ధం లేని మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ అనే భావనలతో అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగులని ఇన్నాళ్ళు మేపాము కదా. వాళ్ళ లాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రులల్లో ఉద్యోగులు ని కూడా కొన్నాళ్ళు మేపుదాము అని సరిపెట్టుకుందాము.

ప్రభుత్వ ఆసుపత్రుల గురించి సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళని వారికి ఏదన్న రోగం వస్తే గుంటూరు జెనరల్ వార్డ్ లో పెట్టి వైద్యం చేయించాలి. అప్పుడు అసలు బొమ్మ కనపడుతుంది.

ఈ పధకం వలన లబ్దిపొందుతుంది ఎక్కువగా పేద,దళిత,గిరిజన,బలహీన వర్గాలే. దయచేసి వాళ్ళ ఉసురు పోసుకోవద్దు.

కుదిరితే క్రింద లింక్ చూడండి.
http://indrasenagangasani.blogspot.com/2011/05/blog-post.html

Praveen Mandangi said...

ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టేవాళ్ళు లాభాలు చూసుకునే పెడతారు, వైద్యం లాభాలు చూసుకునే చేస్తారు. యాభై వేలు ఖర్చయ్యే ఆపరేషన్‌కి కార్పొరేట్ ఆసుపత్రివాళ్ళు ఐదు లక్షలు చార్జ్ చేసినా చెయ్యగలరు.

Praveen Mandangi said...

నేను ముఖ్యమంత్రికి పంపిన తాజా మెయిల్
>>>>>
నుండి Praveen Sarma praveenmandangi@gmail.com
కి nallarikk@yahoo.co.in
తేది 10 జూలై 2011 9:33 ఉ
సబ్జెక్టు మీకు ప్రజలు ముఖ్యమైతే దీని గురించి ఆలోచించండి
మెయిల్ - చేసినది gmail.com

వివరాలను దాచిపెట్టు 9:33 ఉ (0 నిమిషాల క్రితం)

ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ఏమీ పట్టించుకోకుండా ప్రైవేట్ ఆసుపత్రులకి లాభం కలిగించడం కోసం పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించడం అవసరమా? మీకు ప్రజలు ముఖ్యమైతే ఈ లింక్ చదవండి http://hittingontheface.blogspot.com/2011/07/blog-post_10.html ఎవరో బ్లాగర్ వ్రాసినదని కాదు. పౌరుడిగా తప్పుడు విధానాలని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. రాజశేఖరరెడ్డి గారు బతికి లేరు. ఆయన కోసం ఈ తప్పుడు విధానాలని కొనసాగించడం ప్రజలకే నష్టదాయకం.
>>>>>

Praveen Mandangi said...

ఇంద్రసేనా, కార్పరేట్ ఆసుపత్రులని మేపడానికయ్యే ఖర్చు జగన్ తన జేబు నుంచి తీసి ఇస్తాడా? గాలి జనార్ధనరెడ్డి జేబు నుంచి తీసి ఇస్తాడా?

Indrasena Gangasani said...

ప్రవీణ్ శర్మ గారు,

జగన్ ఏమీ తన జేబుల్లోంచి తీసి ఇవ్వడు. బడ్జెట్ అనేది ప్రజల డబ్బు,అది మరల ప్రజల కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ పధకం పెట్టిన ఆఫీసర్లు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు. మీరు ఒక్కరే ఈ ప్రపంచం లో తెలివిగల వాళ్లు అనుకోవద్దు.

Praveen Mandangi said...

నేనొక్కడినే తెలివైనోడినని చెప్పుకోలేదు. రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ పై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రులని air condition చేసినా అది కార్పొరేట్ ఆసుపత్రులని మేపడానికయ్యే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రులని మేపడానికి డబ్బులు సరిపోకపోతే జగన్ దొంగ నోట్లు ప్రింట్ చేసి ఇస్తాడు.

Praveen Mandangi said...

రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడే ప్రపంచ బ్యాంక్ డెబిట్ లక్ష కోట్లు దాటింది. జగన్ ముఖ్యమంత్రైతే ఆ డెబిట్‌ని రెండు లక్షల కోట్లు చేస్తాడా? ఎవరి ఆస్తులు అమ్మి ఆ అప్పు తీరుస్తాడు?

Indrasena Gangasani said...

ప్రవీణ్ శర్మ గారు,

// యాభై వేలు ఖర్చయ్యే ఆపరేషన్‌కి కార్పొరేట్ ఆసుపత్రివాళ్ళు ఐదు లక్షలు చార్జ్ చేసినా చెయ్యగలరు.//

మీకు తెలిసింది అర్ధ సత్యం. ఆరోగ్య శ్రీ పధకం లో ప్రభుత్వం డైరెక్ట్ గా కార్పోరేట్ ఆసుపత్రులకి డబ్బులు చెల్లించదు. స్టార్ ఇన్సురన్స్ అనే కంపనీ కార్పోరేట్ ఆసుపత్రులకి చెల్లిస్తుంది. ప్రైవేటు ఇన్సురన్స్ కంపనీ వాళ్ళు ప్రతి కేసుని తరచి చూస్తారు. ఎమన్నా తేడా అనిపిస్తే ఆ కార్పోరేట్ ఆసుపత్రిని బ్లాకు లిస్ట్ చేస్తారు. మీరు అనుకున్నట్లుగా ఏమీ జరగదు.

Praveen Mandangi said...

ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే కార్పొరేట్ ఆసుపత్రులకి పైసా ఇవ్వాల్సిన పని ఉండదు.

Indrasena Gangasani said...

ఆరోగ్యశ్రీ కయ్యే ఖర్చు ఎంతో మీరు చెప్పగలరా? ఎయిర్ కండిషన్ చేసినా , స్టార్ హోటల్ చేసినా ప్రభుత్వ ఉద్యోగులలో భాద్యత లేనప్పుడు అనవసరమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లు అనేవి ఒక విఫల వ్యవస్థ. మీకు ఏదన్నా జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటార?

Indrasena Gangasani said...

//ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే//

డాక్టర్లు పని చేయకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి నెత్తిన కొట్టుకోవాలి.

Praveen Mandangi said...

ప్రైవేట్ డాక్టర్లు సరిగా పని చేస్తారా? డబ్బులు ఎక్కువొచ్చే కేసులైతే బాగా చూస్తారు, వేరే కేసులు పట్టించుకోరు.

Indrasena Gangasani said...

//ప్రైవేట్ డాక్టర్లు సరిగా పని చేస్తారా? డబ్బులు ఎక్కువొచ్చే కేసులైతే బాగా చూస్తారు, వేరే కేసులు పట్టించుకోరు//

ఎందుకు పని చెయ్యరు. ప్రైవేటు కాన్సెప్టే అది కదా? ఆరోగ్యశ్రీ అయినా,ఇంకొకటి అయినా వారికి సమాన డబ్బులు వస్తాయి. అందరినీ సమానంగా చూస్తారు.

Praveen Mandangi said...

పోలీస్ డిపార్ట్మెంట్‌లోనూ అవినీతి ఉందని పోలీస్ డిపార్ట్మెంట్‌ని ప్రైవేటైజ్ చెయ్యగలమా? ఇక్కడ ఆసుపత్రులనే ప్రైవేటైజ్ చెయ్యాలను ఎందుకంటున్నట్టు? జగన్ కేవలం తన తండ్రి కోసం ఆరోగ్యశ్రీ కొనసాగించాలంటాడు. అంత ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని తెలిసినా అలాగే అంటాడు. ప్రజాస్వామ్యమనేది ప్రజల కోసమే కానీ నాయకుని కోసం కాదని త్రండ్రి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునే యువనేతకి ఎలా తెలుస్తుంది?

Praveen Mandangi said...

ప్రైవేట్ కాన్సెప్ట్ నువ్వనుకున్నంత గొప్పదేమీ కాదు. అది కేవలం లాభాలు చూసుకునేది కానీ ప్రజల గురించి పట్టించుకునేది కాదు. సాధారణ పౌరుడికి బ్యాంక్‌లో FD వెయ్యాలని ఉంటే 20,000 అడిగే IDBIకి వెళ్తాడు కానీ 50,000 అడిగే HDFCకి వెళ్ళడు.

Indrasena Gangasani said...

నేను ముందే చెప్పాను .'దేశ రక్షణ, శాంతి భద్రతలు,సాధారణ పరిపాలన తప్ప మిగతా అన్ని విభాగాలు ప్రైవేటు పరం చెయ్యాలి." పోలీసు డిపార్టుమెంటు కూడా శాంతి భద్రతల కిందకి వస్తుంది. దీనిని నేను ఏమీ ప్రైవేటు పరం చెయ్యమనడం లేదు.

మీకు రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టడం బాగా అలవాటు అయ్యింది అనుకుంటా!! వేరే వాళ్ళని విమర్శిస్తే మనము మంచి వాళ్లము అయిపోతాము అనుకోవడం మీ అమాయకత్వం.

Praveen Mandangi said...

నీ కాన్స్పెట్ ప్రకారం ప్రైవేటైజేషన్ గొప్పదైతే పోలీస్ డిపార్ట్మెంట్‌ని కూడా ప్రైవేటైజ్ చెయ్యొచ్చు. రేప్ కేస్ నమోదు చెయ్యడానికి పదివేలు, మర్డర్ కేస్ నమోదు చెయ్యడానికి పాతిక వేలు చార్జ్ అడుగుతారు. కస్టమర్ల నుంచి డబ్బులొచ్చాయి కదా అని నేరస్తుల దగ్గర లంచాలు తీసుకోరు అని అంటావు.

Indrasena Gangasani said...

నేను ముందే చెప్పను కదా? పోలీసు డిపార్టుమెంటు ను ప్రైవేటు చెయ్యలేము అని.మీరు మళ్ళీ అదే పట్టుకొని వేలాడతారు ఏమిటీ

Praveen Mandangi said...

ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. సాధారణ పౌరుడికి బ్యాంక్‌లో FD వెయ్యాలని ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకైన IDBIకి వెళ్ళి 20,000 FD వేస్తాడా? ప్రైవేట్ బ్యాంకైన HDFCలో 50,000 FD వేస్తాడా?

Indrasena Gangasani said...

@ప్రవీణ్ శర్మ గారు
మీకు ఎదుటి వారిని గౌరవిస్తూ కూడా మాట్లాడే సంస్కారం లేదు. మీతో మాట్లాడటం అనవసరం.బై.

Indrasena Gangasani said...

//సాధారణ పౌరుడికి బ్యాంక్‌లో FD వెయ్యాలని ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకైన IDBIకి వెళ్ళి 20,000 FD వేస్తాడా? ప్రైవేట్ బ్యాంకైన HDFCలో 50,000 FD వేస్తాడా?//

ఎత్తిపోతల పధకం కాని బ్యాంకు లో ,ఎక్కువ వడ్డీ ఎక్కడ వస్తే అక్కడ వేస్తాడు.

Praveen Mandangi said...

రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టడం బాగా అలవాటు అయ్యింది అంటున్నారు. చచ్చినోడ్ని తిడితే ఏమీ రాదు. రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ డెబిట్‌లలో ముంచే అతని తప్పుడు విధానాలని కొనసాగించడాన్నే వ్యతిరేకిస్తున్నాను కానీ అతన్ని తిట్టడం లేదు.

Praveen Mandangi said...

ఇంద్రసేనా, నువ్వు ప్రభుత్వమే ఒక విఫల వ్యవస్థ అనుకుంటే మీ జగన్ ప్రభుత్వాన్ని నడిపే రాజకీయాల్లోకి రావడమే అనవసరమవుతుంది. ప్రభుత్వ వ్యవస్థ లేకుండా రాజకీయాలు నడవవు. చిల్లర వ్యాపారం చేసుకునే వ్యక్తికి ఫిక్సెడ్ డిపాజిట్ వెయ్యాలని ఉంటే ఆంధ్రా బ్యాంక్‌లో పది వేలు పెట్టి ఫిక్సెడ్ డిపాజిట్ వేసుకుంటాడు కానీ HDFC లాంటి ప్రైవేట్ బ్యాంక్‌లో యాభై వేలు పెట్టి ఫిక్సెడ్ డిపాజిట్ ఓపెన్ చెయ్యడు. వడ్డీ ఎక్కువొచ్చినా సరే యాభై వేలు మదుపు పెట్టడానికి అతని దగ్గర డబ్బులు ఉండవు. ఇందిరా గాంధీ బ్యాంక్‌లని జాతీయం చేసి డిపాజిటర్లకి బాగానే లాభం కలిగించింది. ఇందిరమ్మ పేరు చెప్పుకుని అధికారంలోకొచ్చిన రాజశేఖరరెడ్డి సచివాలయం, అసెంబ్లీ భవనం తప్ప అన్నిటినీ ప్రైవేట్‌వాళ్ళకి అమ్మెయ్యాలనుకున్నాడు.

Anonymous said...

Praveen sharma is 100% correct.Indrasena seems to be blind follower of Jagan.If we close government hospitals, medical expenses will rise exponentially.

Indrasena Gangasani said...

@anon
Your argument is not valid .Competition in private sector will get the rates down. We always get quality services in private sector only. Example telecom. If u increse the doctors count,u will see real use of prvate medical services

Praveen Mandangi said...

ఎంత కాంపెటిషన్ ఉన్నా ప్రైవేట్‌వాళ్ళు డబ్బులు ఎక్కువే వసూలు చేస్తారు. నాకు ఒకప్పుడు HDFC అనే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌లో అకౌంట్ ఉండేది., SB అకౌంట్‌కే పది వేల రూపాయలు బాలెన్స్ మెయింటెయిన్ చెయ్యకపోతే మూడు నెలలకి 500 రూపాయలు చార్జ్ పడేది. అదే ప్రభుత్వ రంగ బ్యాంక్‌లలో అయితే 100 రూపాయలే చార్జ్ పడుతుంది. HDFCలో ఔట్ స్టేషన్ క్యాష్ డిపాజిట్‌కి 100 చార్జ్ పడుతుంది, అదే ప్రభుత్వ రంగ బ్యాంక్‌లలో 10 లేదా 25 రూపాయల కంటే ఎక్కువ చార్జ్ పడదు. ఇందిరా గాంధీ జాతీయీకరణలు చేస్తే ఇందిరా గాంధీ పేరు చెప్పుకుని అధికారంలోకొచ్చిన రాజశేఖరరెడ్డి ప్రైవేటీకరణలు చేశాడు.

Praveen Mandangi said...

ఆరోగ్యశ్రీ పది జిల్లాలలో అట్టర్ ఫ్లాపయ్యింది http://newsat5am.blogspot.com/2011/07/blog-post_4444.html

Praveen Mandangi said...

ఈ అట్టర్ ఫ్లాప్ గురించి ఏమంటావు ఇంద్రా?

sree said...

ఎవడో ప్రభుత్వ ఆసుపత్రులగురించి అడ్డంగా కూసి ప్రైవేటువాటిచేత పనిచేయించాలని రాసాడు. జేబులో చిల్లిగవ్వలేనివాడికి ప్రైవేటువాడు ఏమన్నా చేస్తాడంటరా వెధవా? మన ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ రాజకీయనాయకులవే. వీల్లు తప్పుచేసినపుడల్లా తప్పించుకోటానికి వాటిని వాడుకుంటున్నారు కూడా. ప్రభుత్వం పెడ్తుతున్న ఖర్చు మనది. మనం పన్నులు కట్టినది. దానిని వీలైనంత పొదుపుగా వాడి వృధ్ధి సాధించాలేగాని ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా ఈ నాయకుల నోట్లో పొయ్యడానికి కాదు.