నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, August 26, 2012

బంగారం ధర చుక్కల్ని తాకిందంటే తాకదూ మరి!

బ్రిటీష్ అధికారులని బురిడీ కొట్టించి మహాత్మా గాంధీకి విడిది కల్పించిన నెల్లూరు జిల్లా కలెక్టర్


1915లో గాంధీ గారు నెల్లూరు జిల్లా పర్యటించారు. అప్పుడు జిల్లా కలెక్టరుగా దివాన్ బహదూర్ రఘునాధరావు రామచంద్ర రావుగారు ఉండే వారు. ఈయన ఆంగ్ల కొలువు చేస్తున్నా స్వదేశీ బట్టలే ధరించేవారు. తన పంతొమ్మిదో యేట ఇండియన్ సివిల్ సర్వీసులో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి మొదట కర్నూలు జిల్లాకి ఆ పిమ్మట నెల్లూరు జిల్లకి కలెక్టరుగా నియమితులయ్యారు. ఈయనకి గాంధీ అంటే వల్లమాలిన అభిమానం. కలెక్టరుగా రిటైరయ్యాక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరి రాజగోపాల చారికి అనుంగు శిష్యుడిగా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. ఈయనకి ఖగోళ శాస్త్రంలోనూ, గణితంలోనూ అమిత ఆసక్తి ఉండేది. ఉద్యోగంలేక అవస్థ పడుతున్న రోజుల్లో ప్రముఖ గణితవేత్త శ్రీనివాస రామానుజన్‌కి ఈయన మద్రాస్ పోర్ట్ ట్రస్ట్‌లో కొలువు ఇప్పించారు.
 
ఇక విషయానికొస్తే, నెల్లూరుకి వచ్చిన గాంధీగారికి రామచంద్ర రావుగారు తన నివాసంలో విడిది కల్పించారు. ఆ సంగతి ఈయన పై అధికారులు అంత తేలిగ్గా తీసుకోలేదు. ఆంగ్లేయుల అధికారాన్ని ధిక్కరిస్తున్న వ్యక్తికి బస కల్పించడం ఎలా సమర్ధనీయమో తెలుపమని ఒక నోటీసు ఇచ్చారు. దానికి సమాధానంగా గాంధీగారిని ఎవరెవరు కలుసుకుంటారో, వారి కార్యకలాపాలు ఏమిటో తెలుసుకోవడానికి, వారి మీద ఒక కన్నేసి పెట్టడానికి అనువుగా ఉంటుందని గాంధీగారికి తన ఇంట్లో విడిది ఏర్పాటు చేసి ఆయన మీద ఒక కన్నేసి నిఘా ఏర్పాటు చేశానని జవాబు రాశారు. ఆ సమాధానంతో తృప్తి చెందిన అధికారులు ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు.
 
1926లో మద్రాసు కలెక్టరుగా రిటైరయ్యి, స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు రావుగారు. అయితే 1930లో స్ట్రోక్ వచ్చిన తరువాత మంచాన పడ్డారు. దానితోనే 1936లో అరవై అయిదేళ్ళ వయసులో మరణించారు.

Saturday, August 25, 2012

ఈ ఆదివారం ఆ అమ్మాయిలు TOPLESSగా రొమ్ములు చూపిస్తూ తమ నిరసన తెలియ చేస్తారట.


వివక్ష అనెది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే. మత పరంగా, కులం, రంగూ, రూపూ, లింగం,అర్ధిక స్థితిగతులూ ఇలా అన్ని రకాల వివక్షలు తప్పే. అయితే కొన్ని సార్లు ప్రకృతే వివక్ష చూపిస్తుంది. ఉష్ణ మండలాల్లో ఉన్న వారు నల్లగా, శీతల ప్రాంతాలలో ఉన్న వారు తెల్లగా ఉంటారు. అలాగే ఆడ, మగా వారికి ప్రకృతి నిర్దేశించిన విధులననుసరించి వారి శరీరాలలో కొన్ని ప్రత్యేక మార్పులు ఉంటాయి. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. కోటీశ్వరాలయినా పిల్లలు కావాలంటే గర్భం ధరించాలి, పుట్టిన పిల్లలకి పాలివ్వాలి. ఆ పనులు భర్త చేత చేయిస్తానంటే కుదరదు. 


టెన్నిస్ క్రీడాకారులు ఆట మధ్యలో చెమటతో తడిసిపోయిన చొక్కాని కోర్టులోనే మార్చుకుంటారు. అలాగే గెలిచినప్పుడు మన గంగూలీలాగా చొక్కా విప్పి తిప్పుతారు. ఆదవాళ్ళు ఇలా చేయాలంటే వీలు కాదు. బీచ్‌లలో మగవాళ్ళు ఒక చిన్న చెడ్డీ వేసుకుని తిరుగుతారు. ఆడవారు చాతీ భాగంలో చిన్న గుడ్దపేలిక అయినా వేసుకోవాలి, న్యూడ్ బీచ్ అయితే తప్ప. అలాగే మగ వారికి చొక్క లేకుండా బయట తిరిగే వీలు ఉంది. ఇది ఆడవారికి లేదు. ఇది ఒకరు పెట్టిన నిబంధన కాదు. ప్రకృతిలోనే అలా వచ్చింది.

అయితే ఈ అసమానతని చెరిపి వేయడానికి ఇప్పుడు కొందరు నడుం బిగించారు. ఆడవారు కూడా పబ్లిక్‌లో చాతీమీద గుడ్డలు లేకుండా రొమ్ములు చూపిస్తూ తిరిగే వీలుండాలని ఉద్యమం చేస్తున్నారు. అమెరికాలో పుట్టిన ఈ ఉద్యమం అందుకు వీలుగా చట్టాలు మార్చాలని అంటున్నారు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో ఇలా తిరగడం చట్ట విరుద్ధం కాకపోయినా ఆడవారు చాతి మీద గుడ్డలు లేకుండా బయటకి వస్తే indecent exposure అని కేసులు పెడుతున్నారు పోలీసులు.

ఈ అన్యాయానికి నిరసనగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఆగస్టు చివరి ఆదివారం go topless day ని నిర్వహిస్తున్నారు కొందరు అమ్మాయిలు. ఈ సంవత్సరం కూడా ఈ నెల 26న ఈ డే ఉంది. ప్రపంచవ్యాప్తంగా నలభై నగరాలలో జరిగే ఈ ఉద్యమం go topless అన్న ఒక స్వచ్చంద సంస్థ నిర్వహిస్తుంది. ఆ రోజున ఇందులో పాల్గొనే అమ్మయిలందరూ ఒక చోట చేరి తమ జాకెట్లూ బ్రాలు తీసివేసి నిరసన తెలుపుతారు. అలా చేయలేనివారు పూర్తి దుస్తులు ధరించి కూడా ఇందులో పాల్గొని సంఘీభావం తెలపవచ్చట. అన్నట్టు ఇది కేవలం ఆడవారికి మాత్రమే కాదు. ఈ ఉద్యమం పట్ల సానుకూలంగా ఉన్న మగ వాళ్ళు బ్రాలు, బికినీలు ధరించి ఇందులో పాల్గొని సపోర్టు చేయవచ్చు.
 
ఈ సారి ఆడవాళ్ళు పబ్లిక్‌గా టాప్‌లెస్‌గా తిరిగే వీలుగా చట్టాలను సవరించమని అమెరికా అద్ధ్యక్షుడికి తమ నిరసన తెలియచేయడానికి అధ్యక్ష భవనం ముందు పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు. అలాగే ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ కూడా చేపట్టారు.

అయితే లోగడ slut walk లాంటి కార్యక్రమాలు ఈ విదేశీ వనితలని చూసి మన దేశంలో ఢిల్లీలో, బెంగుళూరులో మన వాళ్ళు కూడా కొంతమంది చేశారు. కానీ ఈ go topless మాత్రం మన దేశంలో లేదు.

Wednesday, August 22, 2012

పోలీసులా? రాక్షసులా?


చావు బతుకుల్లో ఉన్న వాడు ఫామ్ నింపడం అవసరమా అనడుగుతాడు శంకర్ దాదా సినిమాలో చిరంజీవి. అవును, వాడి ప్రాణాలు పోతున్నా సరే, ఫార్మాలిటిస్ ఫాలో అవ్వాల్సిందే అని నిరూపించారు ఇండోర్ పోలీసులు. 

మనిషన్న వాడు ఎవరయినా ఒక పక్క మరొక మనిషి చావుకి దగ్గరవుతూ ఉంటే ముందు అతడి ప్రాణాలు ఎలా కాపాడాలా అని చూస్తారు. కానీ ఇండోర్ పోలీసులు మాత్రం ముందు స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవాలి, ఆ తరువాత మాత్రమే ప్రాణాలు కాపాడే పని అన్నట్లు ప్రవర్తించి, ఒక యువకుడి ప్రాణం పోవడానికి కారణమయ్యారు.

రవి అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి తన సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకులని ఎదిరించడంతో రెచ్చిపోయిన ఆ అల్లరి మూకలు అతడిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అతడిని నేరుగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళకుండా స్టేట్‌మెంట్ కోసం స్టేషనుకి తీసుకెళ్ళి, నింపాదిగా 108కి ఫోన్ చేసి, స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ అంబులెన్స్ వచ్చి అతడిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే లోపు దారిలోనే చనిపోయాడు.

ఈ విషయమై పోలీసులని ప్రశ్నించిన విలేఖరులు వాళ్ళు స్టేట్‌మెంట్ ఇచాకే వైద్యం అని పోలీసులు చెప్పడంతో అవాక్కయ్యారు.

Sunday, August 19, 2012

వైఎస్సార్ మరణం చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టిందా?


రాజ శేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత చంద్రబాబు నాయుడు బలపడతాడని ఎవరైనా అనుకుంటే అది తప్పని తేలిపోయింది. జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అసమ్మతి రాజకీయాలు నడుపుతూ ఉండి ఉంటే ఎలా ఉండేదో గానీ బయటకి వచ్చి స్వంత పార్టీ పెట్టాక తెలుగు దేశం మరింత బలహీనపడి కొన్ని చోట్ల మూడవ స్థానానికి పడి పోయింది. రాజ శేఖర్ రెడ్డి బతికి ఉంటే ఇప్పటికి తెలుగుదేశం బలపడి 2014 ఎన్నికలనాటికి విజయం వైపు అడుగులు వేస్తూ ఉండేదేమో.
 
2009 ఎన్నికలలో వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజరిటీతో గట్టెక్కింది. మరొక అయిదేళ్ళు అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత మరింత బలపడి 2014 ఎన్నికల నాటికి అది కాంగ్రెస్‌ని దెబ్బతీసే స్థాయికి చేరుకొని ఉండేది. 

కానీ అనూహ్యంగా రాజ శేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించడం, ఆ సానుభూతి జగన్‌కి లాభించడం, వెరసి టీడీపీకి నష్టదాయకంగా మారింది. అంచేతనే తెలుగు తమ్ముళ్ళు ఒకరొకరుగా జగన్ బాట పడుతున్నారు. చంద్రబాబుకి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్ధ్యం లేదనుకుంటే, మరెవరికీ అంత సీన్ లేదు. బాలకృష్ణకి గానీ, హరికృష్ణ అండ్ సన్‌కి గానీ రాష్ట్రమంతా తిరిగి ఓట్లని సంపాదించే కెపాసిటీ లేదు.

అంతు లేని పాకిస్తానీయుల అరాచకం


పాక్‌లో మానవత్వానికి చోటు లేకుండా పోతుంది. మొదట హిందువుల దేవాలయాలను చ్వంసం చేశారు. హిందూ అబ్బాయిలని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. హిందూ అమ్మాయిలని ఎత్తుకు పోయి మతమార్పిడి చేసి ముస్లిములకిచ్చి పెళ్ళి చేశారు. ఇప్పుడు ఆ అరాచకం మరింత వెర్రి తలలు వెసింది. డౌన్ సిండ్రోమ్ అన్న వ్యాధితో బాధ పడుతున్న ఒక బుద్ధి మాంద్యం ఉన్న క్రిస్టియన్ అమ్మాయి పైన ఖురాన్‌లోని కొన్ని పేజీలని కాల్చింది అని కేసు పెట్టి జైలులో పెట్టారు. సయ్యద్ మహమ్మద్ ఉమ్మద్ అన్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు అధారంగా ఇస్లామాబాద్‌లోని రింషా మసీహ్ అన్న పదకొండు సంవత్సరాల బాలిక పైన కేసు నమోదు చేసి FIR కూడా ఫైల్ చేశారు. ఈ అమ్మాయి ఒక ఖురాన్ ప్రతిలోని పది పేజీలను కాల్చింది అన్నది ఆ అభియోగం. 
    
ఇందులో తమాషా ఏమిటంటే పాత ఖురాన్ ప్రతులని వదిలించుకోవడానికి వాటిని ఎక్కడనా మనుషులు తిరుగాడని చోట భూమిలో పూడ్చి పెట్టవచ్చు, ప్రవహించే నదుల్లో వదిలేయవచ్చు, లేదా కాల్చవచ్చు అని ఇస్లాం లోని నియమాలే చెబుతున్నాయి.  

Thursday, August 16, 2012

జగన్ గాంధీ అంతటి వాడే మరి!?


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తమ నేత గాంధీ అంతటి వాడు అని చాలా ఆలస్యంగా తెలిసి వచ్చింది. అయితే తాను సాక్షాత్తూ మహాత్మా గాంధీ అంశతో పుట్టిన వాడినని జగన్ రెండు సంవత్సరాల క్రితమే సెలవిచ్చాడు. అయితే డైరెక్ట్‌గా ఆయన ఆ విషయం చెప్పలేదు. తన తండ్రి మహా నేత, దివంగత, ప్రియతమ నాయకుడు రాజ శేఖర్ రెడ్డి గాంధీ లాంటి వాడే అని అప్పట్లో ఒక స్టేట్ మెంట్ ఇచ్చారాయన.
independence day, guntur city, gandhi-jagan flexy, guntur city area leader, behaviour
gandi-jagan photo, yuvaleader different writing, municipal officer removed
ఆ విషయమ్మీద అప్పట్లో నేను రాసిన పోస్ట్ ఇది.

జగన్ మోహన్ రెడ్డి గాంధీ సన్నాఫ్ రాజ శేఖర్ రెడ్డి గాంధీ

జగన్ మోహన్ రెడ్డి ఒదార్పు యాత్ర ఎడతెగకుండా చేసీ చేసీ, పది నెలలుగా ఎందరో గుండెల్లో ట్యాంకులు కత్తి దాచుకున్న కన్నీటిని బయటకు తీసి మరీ తుడిచి వాళ్ళకు ఒదార్పు నిచ్చి తన కంటి నీటిని వాళ్ళ చేత తుడిపించుకొని అలసి పోయి ఒక చోట అలా నడుము వాల్చాడు కాస్సేపు విశ్రాంతి తీసుకొందామని.మాగన్నుగా నిద్ర పట్టింది.అయినా అతడి గుండెల్లో వేదన,ఆవేదన.

నెహ్రూ చనిపోతే ఇందిర,ఆమె చనిపోతే రాజీవ్,అతడు చనిపోతే సోనియా కాళ్ళ దగ్గరికి ప్రాధాని పదవి వచ్చింది.ఆమె కాదన్నాకే అది పక్కకి పోయింది.ఇప్పుడు రాహుల్ మెడ మీద పూలమాలలా ఆ పదవి వేలాడుతూ ఉంది.అతడు చిటికే వేస్తే మెడలో పడిపోదామని.అలాంటిది తన తండ్రి చనిపోతే తను కావాలి మొర్రో అన్నా ముఖ్యమంత్రి పదవి తనకు దక్కలేదు.ఇంత కన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా?

అప్పుడు"నాయనా జగన్" అన్న పిలుపు వినిపించి లేచి కూర్చున్నాడు.ఎవరూ కనిపించ లేదు.అటూ ఇటూ చూశాడు."నాయనా నేనూ ఆకాశవాణిని" అన్నదా గొంతు."ఆకాశవాణా?శాటిలైట్ చానళ్ళు వఛ్ఛాక కూడా నువ్వింకా ఉన్నావా?" అడిగాడు జగన్.
"నాయనా నేను కథల్లో వినిపించే ఆకాశ వాణిని " అన్నదా గొంతు."సరే ఏమిటో చెప్పు.నేను ఓదార్చాల్సిన లిస్టు ఇంకా చాలా ఉంది" అన్నాడు జగన్ అసహనంగా."నీ సందేహానికి సమాధానం నాకు తెలుసు.చెప్తాను విను."
"ఇందిర్తకు,రాజీవ్ కూ,సొనియాకు,రాహుల్ కూ ప్రధాని పీఠం కాళ్ళ వద్దుకు రావడానికి కారణం వాళ్ళ పేరులో ఉన్న గాంధీ నాయనా"అని చెప్పి ఆకాశవాణి మాయమయ్యింది.

జగన్ కళ్ళు తెరుచుకొన్నాయి.ఇప్పుడు వెంటనే తన పేరులో గాంధీని తగిలించుకోవాలి.అయితే ఎలా?తను గాందీ కుటుంబంలో పుట్టి ఉండాలి లేదా ఎవడైనా గాంధీ తనని దత్తత తీసుకొని వాడి తోక తనకి తగిలించాలి.రెండూ అయ్యే పనులు కావు.ఎలా అని తీవ్రంగా అలోచించాక ఒక ఆలోచన తట్టింది.గాంధీనే తన తండ్రిగా మార్చి పారేస్తే?

అందు వల్లనే రాజ శేఖర్ రెడ్డి గాంధీ లాంటివాడు అన్న స్టేట్ మెంట్ ఇచ్చాడు జగన్. యాత్ర మరో రెండు రోజులు గడిస్తే రాజ శేఖర్ రెడ్డి గాంధీ అయిపోతాడు.మహత్మా గాంధీ చనిపోయాక ఆయన ఆత్మ ఒక 18 నెలలు స్వర్గంలో గడిపి తెలుగు ప్రజలని ఉద్ధరించడానికి పులివెందులలో పుట్టింది అని ఒక స్టోరీ సాక్షి పత్రిక,చానల్ లో ఊదర గొట్టేస్తే సరి.

దీన్ని సమర్దిస్తూ అబటి రాంబాబు లాంటి చెంచా గాళ్ళు మీడియ చానళ్ళలో ప్రచారం చేస్తారు.ఎవడో వర్షాలు కురవాలని రాజశేఖర రెడ్డి గాంధీ యాగాలు చేస్తాడు.పొలాల్లో అధిక దిగుబడి కోసం ఆయన ఫోటోలు పెడతారు.అయితే దిష్టి బొమ్మలకీ వీటికీ తేడా ఉండాలి కాబట్టి ఈ ఫోటోలు పొలమలో ఒక చిన్న మందిరం కట్టి అందులో ఉంచుతారు.ఈలోగా ఇంకెవడో రాజశేఖర మాల అని మొదలు పెడతాడు.ఆయన లాగా పంచె కట్టి మూడు వారాలు ఆయన ఫోటొకి పూజ చేసి కాలి నడకన ఇడుపుల పాయ చేరుకొని మాల తీసేస్తారు.


వెదజల్లడానికి డబ్బు ఉండాలి కానీ వెర్రి వెధవలకి ఏమి తక్కువ?ఇదంతా తిక్క వ్యవహారం అని ఎవరైనా కొచెం ఆలోచించే సన్నాసులకి అనిపిస్తే వాళ్ళు ఎలాగూ బయటకి రారు కాబట్తి అసలు గొడవ ఉండదు.

independence day, guntur city, gandhi-jagan flexy, guntur city area leader, behaviour
gandi-jagan photo, yuvaleader different writing, municipal officer removed
గాంధీ కొడుకు గాంధీ కాక మరేమవుతాడు. ఈ లాజిక్‌తోనే ఒక చోటా నాయకుడు తమ నేత సాక్షాత్తూ మహాత్మా గాంధీతో సమానమైన వాడు అని కనిపెట్టేసి ఫ్లెక్స్ బోర్డ్ పెట్టేశాడు. మెచ్చుకోవాలి మరి.


Tuesday, August 14, 2012

తప్పు చేస్తే కేసు పెట్టేయడమేనా, వాడిది ఏ కులమో చూసుకోవాలికదా?


ఈ మధ్య ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక ప్రమాదకరమైన ట్రెండ్ మొదలయింది. కోట్లకి కోట్లు ప్రజల డబ్బు కాజేసిన ఘరానా దొంగ నాయకులయినా, బజారు గూండాల్లా ప్రవర్తించే రౌడీ నేతలయినా పొలీసు కెసులో, విచారణో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు సదరు నాయకులకి చెందిన కుల సంఘాల నాయకులు రంగంలోకి దూకేస్తారు. ఒక బిసీ, నాయకుడో, దళిత లీడరో, మైనారిటీ జనాల ఆశాజ్యోతో కావడం వల్లనే మా నాయకుడిని అన్యాయంగా కేసులో ఇరికించారు, ఈ తీరు మారక పోతే ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం అంటూ బీరాలు పలుకుతారు. అసలు సదరు నాయకుడో లెదా నాయకురాలో చెసిన తప్పేమిటి, అందులో వాస్తవాలేమిటో చూడకుండా ఈ చోటా మోటా పోటుగాళ్ళు ఇలా రంకెలు ఎందుకు వేస్తారో? అయినా ఏ నేరమూ చేయకుండా కేసుల్లో ఇరికించి కుమ్మేసేది ఎప్పుడూ సాధారణ, బడుగు ప్రజలనే. అంతే కానీ ఈ నాయకులమీద సరయిన ఆధారాల్లేకుండా కేసులు పెట్టడమే? ఈ కుల సంఘాల నాయకులు కూడా తమ కులానికే చెందిన అమాయకులనీ, ఏ అండా లేని వారిని అసలు పట్టించుకున్న పాపాన పోరు. ఆ మధ్యన ఆయేషా అన్న అమ్మాయిని హత్య చెసిన కేసులో ఒక అమాయక దళితుడిని ఇరికించి జైలులో పడేస్తే ఈ సోకాల్డ్ దళిత ఉద్ధారకులు నొరెత్తిన పాపాన పోలేదు.

 ayesha meera 
రక్తం మడుగులో ఆయేషా                                              అమాయకుడు సత్యం బాబు

మోపిదేవి వెంకట రమణ, పార్ధసారధిల మీద కేసులు పెట్టినప్పుడు మేము బలహీనవర్గాల వాళ్ళమనే ఈ కేసులు అని వాళ్ళు, వాళ్ళకి మద్ధతుగా గడ్దం కృష్ణయ్య రంకెలేశారు. నిన్నకి నిన్న ఒక గుడికి తాళమేసి, అడ్డొచ్చిన వారిని కుమ్మేసి, పోలీసు ఇన్స్‌పెక్టర్ని జనమందరి మధ్యలో బండ బూతులు తిట్టిన దానం నాగేందర్‌కి కూడా ఇలాగే కుల ప్రాతిపదికన మద్ధతు లభించింది. ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా ధర్మాన ప్రసాదరావు చేరాడు. ఇప్పటికే ముగ్గురు బీసీలపైన కేసులు పెట్టాము, ఇప్పుడు మరొక బీసీనా అని సిఎం కూడా సందేహిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అటూ ఇటూ అయితే దాడి చేయడానికి బీసీ సంఘాలు కూడ సిద్ధం అవుతున్నాయట. వివాదాస్పద జీవోల జారీలో కేబినెట్ అందరికీ సమిష్టి బాధ్యత అని వాదిస్తే అది వేరే విషయం. అంతే కానీ మా కులపోడి మీదా కేసులు పెడతారా అని వాదిస్తే ఎలా?
    
కొన్నాళ్ళకి పోలీసులు ఎవరి పైన అయినా కేసు పెట్టాల్సి వస్తే వాళ్ళ కులమేమిటో, బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో విచారించి మరీ కేసులు పెట్టే పరిస్థితి వస్తుందేమో? దేవుడా నువ్వే కాపాడాలి ఈ దేశాన్ని. సారీ మరీ అసాధ్యమయిన కోర్కెలు కోరుతున్నానా?