నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, January 29, 2013

శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్, తిరుపతి ఫోటోలు


తిరుపతిలో అలిపిరికి సమీపంలో ఉంది శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖ పట్టణం తరువాత ఉన్న మూడవ జూ ఇది. వారంలో మంగళవారం సెలవు.  నూట యాభయి రూపాయలు టిక్కెట్‌తో ఇక్క డ కారులో నేరుగా లోపలికి వెళ్ళవచ్చు. ఇందులో పక్షుల విభాగంలో తెల్ల నెమలితో బాటు అనేక రకాల పక్షులు ఉన్నాయి. పులుల విభాగంలో తెల్ల పులి కూడా ఉంది. లయన్ సఫారీ ఉంటుంది. ఇరవై అయిదు రూపాయల టిక్కెట్‌మీద ఇరవై సీట్లున్న వాన్‌లో తీసుకు వెళ్తారు. చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఉన్న విశాలమైన ఎన్‌క్లోజర్‌లో సింహాలు ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వేళ కాబట్టి అన్నీ సింహాలు చెట్ల నీడలో పడుకొని తూగుతూ ఉన్నాయి. మేము పది సింహాలు చూడగలిగాము.










Saturday, January 19, 2013

భయ పడకు. మనం కుక్కలం, మనుషులం కాదు.


ఒక ఆడ కుక్క ఒక రాత్రి వేళ బయటకి వచ్చింది. దానిని కొన్ని మగ కుక్కలు చూశాయి. ఆ మగ కుక్కల గుంపుని చూసిన ఆడ కుక్క మనసులో డిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన మెదిలింది. దానితో అది భయంతో వణికి పోయింది.
 
ఆ కుక్క భయాన్ని గమనించిన ఒక మగ కుక్క దాని దగ్గరికి వచ్చి ఇలా అంది: 

"భయ పడకు. మనం కుక్కలం, మనుషులం కాదు."