నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, March 25, 2011

ఇప్పుడిక చిరంజీవి కుటుంబంలో విలీనం కార్యక్రమం


కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మంచి ఊపుమీద ఉన్న చిరంజీవి ఇప్పుడు తన కుటుంబంలో మరొక విలీనం ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ప్రేమ వివాహం చేసుకుని తనకు దూరమైన కూతురు శ్రీజను తిరిగి కుటుంబంలో కలుపుకొనే దిశగా అడుగులు వేస్తున్నాడు. తన భర్త శిరీష్ పైన, అతడి తల్లి తండ్రుల పైన శ్రీజ కేసు పెట్టడం ఇందులో భాగమే. భర్తను వదిలి వస్తే తిరిగి కుటుంబంలో కలుపుకోవడానికి సిద్ధమే అని చిరు శ్రీజకు చెప్పినట్లు, అందుకు ఆమె సిద్ధమైనట్టు చిరు సన్నిహితులు చెబుతున్నారు. తండ్రి దగ్గర సాగిన హైక్లాస్ జీవితం దూరం కావడంతో, అల్ట్రా రిచ్ లైఫ్‌కి అలవాటు పడ్డ శ్రీజ మళ్ళీ ఆ జీవితం కోరుకొని చిరుకి దగ్గరయ్యేందుకు సిద్దమయిందని సమాచారం.



  
తన సినిమాలలో కుల మతాలకీ, పేద ధనిక తేడాలకీ అతీతంగా ఎన్నో పాత్రలు పోషించిన మెగా స్టార్ నిజానికి ఈ తేడాలకి అతీతుడు కాదని ఆయనని ఎరిగిన వారంటారు. కుల మతాలకీ, పేద ధనిక తారతమ్యాలు ఉండకూడదనీ సినిమాలలో, సామాజిక న్యాయం అని రాజకీయాలలో నానా యాగీ చేయడమే కానీ చిరంజీవి ఇవి పాటించడని, తన మొదటి కూతురు సుస్మితని హీరో ఉదయ కిరణ్‌తో నిశ్చితార్ధం జరిపి, తరువాత కొన్నాళ్ళకే దాన్ని రద్దు చేసి ఆ అమ్మాయికి మరొక పెళ్ళి చేయడం ఇందుకు నిదర్శనమని వారంటారు.


తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుని తనని విడిచి వెళ్ళిన కూతురుని క్షమించి, కూతుర్నీ అల్లుడ్నీ, వారి కూతుర్నీ కుటుంబంలో కలుపుకొంటే చిరు పెద్దమనిషిగా నిలబడగలరేమో ఆయనే ఆలోచించాలి.

13 comments:

మంచు said...

వారంటారా??? ఎవరూ?

చిలమకూరు విజయమోహన్ said...

చిత్రాలలోనే కాదు నిజ జీవితంలో కూడా అసలైన హీరో రజనీకాంతే.
అయినా కూతురి జీవితాన్ని ఇలా విడగొట్టి చిరంజీవి సాధించేదేమిటి?

మంచు said...

విజయమోహన్ గారు మీరు మరీను... ఈయనేదే పనీ పాటాలేక "ఎవరొ " చెప్పారని రాస్తే మీరు దానికి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక రజనీ కాంత్ తొ మన వాళ్ళకి పొలికేంటండీ.... మన పరిశ్రమలొ చిత్తుగా తాగి ఆ మత్తులొ వీధి రౌడీలా ఎకంగా నిర్మాతల్నే కాల్చేసి ఆ తరువాత మతి చెలించింది అన్న నెపం తొ తప్పించుకున్న ఘనులున్నారు :-))

పబ్లిక్ పర్సనాలిటీలు, వారి జీవితాల గురించిన గాసిప్స్ సరిపోక వారి కుటుంబం లొ ఎం జరుగుతుందొ కూడా ఊహించే రాసేస్తే ఎలా... విడగొడుతున్నారనొ, కలిపి ఉంచుతున్నారనొ అలా తెలుసట. సన్నిహితులు చెప్తున్నారు. బాగ దగ్గరి వాళ్ళు చెప్పారు, విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ వాళ్ళ నొటికొచ్చిన అడ్డమయిన కూతలు రాయడం మామూలే... ఎందుకంటే ఎవరూ ఆ విశ్వసనీయమయిన వర్గం, సన్నిహితులు ఎవరు అన్న వివరాలు ఎవరూ అడగరు కదా....

గతం లొ ఈ బ్లాగరు గారు, పులి, ఖలేజా నిర్మాత మీద చాలా అతి జాలి చూపారు. ఈ రెండు సినిమాల వల్ల మొత్తం టాలివుడ్ అర్ధిక స్తితి కూలిపొయేలా ఉంది అని, పాపం నిర్మాత అని చాలా రొజులు కన్నీరు మున్నీరు అయ్యారు. తర్వాత పాపం అదంతా సూరి బినామీ అని తెలిసాక ఆ ధుఖం మరీ ఎక్కువయింది (ఎందుకొ చెప్పనక్కర్లేదు కదా) . ఇప్పుడు కుటుంభం మీద పడ్డారు. ఇలాంటి రాతలు చూస్తే నవ్వొస్తుంది.

Anonymous said...

ఏమయ్యా చెప్పుదండలూ... చిరంజీవి చిన్న కూతురు విషయంలో మీవాళ్ళతోసహా అందరూ చిరంజీవికే మద్దతు పలికారు. నువ్వేంటయ్యా ఆ అమ్మాయి విషయంలో కొత్త భాష్యాలు చెబుతున్నావు.

ఆ శిరీష్ గాడు పెద్ద వెధవని అందరికీ తెలుసు. వాడు శ్రీజ వెనకున్న ఆస్తికోసమే ఈ పెళ్ళి చేసుకున్నట్లు రాష్ట్రం మొత్తంలో చిన్న పిల్లలతో సహా అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వొచ్చి కొత్త కొత్త భాష్యాలు చెబుతున్నావు. మరీ అంత అన్యాయంగా రాయకయ్యా.

వారంటున్నారు అని రాశావు. ఇంతకీ ఆ 'వారు' నువ్వేగా.

Anonymous said...

మంచుగారూ...బాగా ఇచ్చారు చిలమకూరువారికి.

ఏదో విమర్శించాలనే కసితో విమర్శించడంతప్ప దానిలో ఏమైనా అర్ధముందా. ఇదే ఆయన కూతురికి జరిగితే ఇలాగా అంటారా?

మంచు said...

అనానిమస్ గారు... చిలమకూరు గారు అంటే నాకు చాలా అభిమానం. నా కామెంట్ ఈ పొస్ట్ కి సంభందించినదే విమర్శే కానీ...అయనని , ఆయన కామెంట్ ని విమర్శించాలని కాదు. ఆయన గురించి ఇక వద్దు. please :-)

Ramana said...

మీరు కరెస్ట్‌గానె సెప్పినారు. చిరంజీవిని వాళ్ల సినిమా ఇండస్ట్రీలొనే ఎవ్రూ నమ్మరు, ఈ పిచ్చి అభిమానులకి తల పైత్యమ్ తప్ప ఇంగేమి తెల్దు.
"పరిశ్రమలొ చిత్తుగా తాగి ఆ మత్తులొ వీధి రౌడీలా ఎకంగా నిర్మాతల్నే కాల్చేసి ఆ తరువాత మతి చెలించింది అన్న నెపం తొ తప్పించుకున్న ఘనులున్నారు :-)) "
ఇవేమో అడ్డమైన కూతలు కాదు మరీ " పబ్లిక్ పర్సనాలిటీలు, వారి జీవితాల గురించిన గాసిప్స్ సరిపోక వారి కుటుంబం లొ ఎం జరుగుతుందొ కూడా ఊహించే రాసేస్తే ఎలా... విడగొడుతున్నారనొ, కలిపి ఉంచుతున్నారనొ అలా తెలుసట. సన్నిహితులు చెప్తున్నారు. బాగ దగ్గరి వాళ్ళు చెప్పారు, విశ్వసనీయ వర్గాల సమాచారం " ఇయ్యేమో కరెక్ట్ కూతలా?
ఈయప్ప ఎవరో గాని ఆయనకు తెల్సిందే రాష్ట్రమంతటా అనుకుంటున్నారని భ్రమ సూడు " ఆ శిరీష్ గాడు పెద్ద వెధవని అందరికీ తెలుసు. వాడు శ్రీజ వెనకున్న ఆస్తికోసమే ఈ పెళ్ళి చేసుకున్నట్లు రాష్ట్రం మొత్తంలో చిన్న పిల్లలతో సహా అందరికీ తెలుసు." సిన్న పిల్లోల్లకు గూడ తెల్సిందట, అట్లనే ఉదయ్‌కిరణ్ ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కనపడకుండ పోయినాడో కూడ నిక్కర్లేసుకునే సంటి పిల్లలకు తెల్సబ్బా, అందరూ బో సెప్పకొచ్చినారు గాని చిరు సాన గొప్ప విస్వనీయుడని సినిమా ఇండస్ట్రీకంతా తెల్సులెండి

చిలమకూరు విజయమోహన్ said...

అజ్ఞాతగారూ! మంచుగారు నాకు బాగా ఇవ్వడమేమిటి?తెరపైన హీరోగానే కాదు ఉండవలసింది,నిజ జీవితంలో కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశ్యంలో చెప్పాను.ఉదాహరణగా రజనీకాంత్ గారిని ప్రస్తావించాను. ఏమి జరుగుతోందో అందరికీ తెలుస్తూనే ఉందికదా,నిప్పులేనిది పొగ రాదు అంటారు!
విమర్శించాలని కసా? చిరంజీవిగారిపై మాకెందుకు కసి?
మంచుగారూ! నాపై మీకున్న అభిమానానికి ధన్యవాదాలు.:)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

వారులో ఒకరు చిరంజీవి దగ్గర ఒకప్పుడు పని చేసిన వ్యక్తి.

Anonymous said...

అయ్యా మంచు మీ అభిమానానికి కొద్ది సేపు మాస్క్ వేసి, నిజమేంటే కాస్త చూడు. ఎవ్వరో ఎవ్వర్నో కాల్చితె ఇక్కడ ప్రస్తావించి టపాకు సంభందం లేకుండా వాగకు నాయనా

Sree said...

శ్రీజ గాని చిరంజీవి గాని మీదగ్గరకో నాదగ్గరకో వచ్చి సాయం కోరినపుడు ఆలోచిద్దాం. అంతవరకూ ఈ మాటర్ వదిలివేయటం మంచిదని నా అభిప్రాయం!

Sree said...

శ్రీజ గాని చిరంజీవి గాని మీదగ్గరకో నాదగ్గరకో వచ్చి సాయం కోరినపుడు ఆలోచిద్దాం. అంతవరకూ ఈ మాటర్ వదిలివేయటం మంచిదని నా అభిప్రాయం!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

OK. All of you leave this matter at this point.