నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, January 18, 2012

ఒక్క రోజులో పది వేల రూపాయలు 49 వేల కోట్ల రూపాయలుగా మారిపోయిన వైనం


ఇదేదో ముఖ్యమంత్రి కొడుకుగా జగన్ మోహన్ రెడ్డి చేసిన స్కామో, తన పదవిని అడ్డు పెట్టుకొని 2G రాజా చేసిన కుంభ కోణమో తండ్రి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి అంబానీలు సంపాయించిన అస్థులో కావు. ఒక బడి పంతులు బ్యాంక్ అకౌంట్‌లో జరిగిన విడ్డూరం ఇది.
 


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని బాలుర్‌ఘాట్ అనే ఊరిలో నివసిస్తున్న పారిజాత్ సహా అనే బడి పంతులుకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆదివారం గూబ గుయ్యిమనేలా షాక్ ఇచ్చింది. నెలకి ముప్పయి అయిదు వేలు జీతం అందుకొనే ఈ అయ్యవారికి ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది.  అకౌంట్‌లో బ్యాలన్స్ చూసుకొందామని ఆదివారం ఇంటర్‌నెట్‌లో చెక్ చేశాడు సహా. అతని లెక్క ప్రకారం అందులో పది వేల రూపాయలు ఉండాలి. వడ్డీ కలుపుకొన్నా ఇంకో వందో రెండొందలోఅదనంగా ఉంటుంది అంతే అనుకుని తన ఖాతా వివరాలు ఓపెన్ చేసిన పారిజాత్ సాహాకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయింది. అతని ఖాతాలో ఉన్న బ్యాలన్స్ అక్షరాలా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు. అంకెల్లో అయితే 49,000,00,00,000 రూపాయలు.
Parijat Saha 
ఎప్పుడో ప్రభుత్వ బడ్జెట్ లెఖ్ఖల్లో, అంబానీల ఆస్తి పాస్తుల వివరాల్లోనో, 2G స్కాముల గొడవల్లోనో తప్ప అంత మొత్తం చూసి ఉండని మనలాంటి మామూలు పౌరుడు అయిన పారిజాత్ సాహా షాక్ నుండి తేరుకొని మరుసటి రోజు బ్యాంక్ మానేజర్‌ని కలిసి విషయం చెప్పాడు. ఆ పొఅరబాటు ఎలా జరిగిందో అర్ధం కాక జుట్టు పీక్కుని ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేశారు. 


తనకి రావలసిన పది వేల రూపాయలు డ్రా చేసుకున్న సాహా తన అకౌంట్‌లో ఆ మొత్తం ఇంకా అలాగే ఉంది అంటున్నాడు. అసలే జరిగిందో తెలుసుకొనే ప్రయత్నంలో సదరు బ్యాంక్ సిబ్బంది మునిగి పోయారు. 

4 comments:

♛ ప్రిన్స్ ♛ said...

naa ac vaste mastu undedi

సింహం said...

0 key press chesinapudu Struck ayi uuntundi.. details submit chese logaa veelainanni 0 lu Rs.49 pakkana padiunTaai..

John said...

అమాయకుడు...

Praveen Mandangi said...

అమాయకుడు కాదు. అతని దగ్గర అంత డబ్బుందని తెలిస్తే ఇన్‌కమ్ టాక్స్‌వాళ్ళు అతన్ని పట్టుకుంటారు. సమాధానం చెప్పకపోతే బ్లాక్ మనీ కేస్ కింద అతన్ని అరెస్ట్ చేస్తారు. అందుకే 49 వేల కోట్లు ఫ్రీగా వచ్చినా తీసుకోలేదు. అతను కారాగారానికి వెళ్తే అతని ఉద్యోగం కూడా పోతుంది. కోట్లకి ఆశపడితే ఉన్నది కూడా పోతుంది.