అస్ట్రేలియాలో మన జట్టు ఎదుర్కొంటున్న అపజయాలని, అవమానాలనీ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. 99 సెంవరీలు చేసిన టెండూల్కర్, కోటాను కోట్ల వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్న ధోని ఇలాంటి అద్వితీయమైన ఆటగాళ్ళు ఉండీ అలా అపజయాల బారిన పడ్డం ఏమైనా న్యాయమా? అందులోనూ మన BCCI వీరి వెనక ఉంది అన్న విషయం తెలిసి కూడా ఈ మీడియా ఇలా విజృంభించి వీరిని ఇలా చీల్చి చెండాడుతుంది అంటే మరి బాధేయదూ? ఈ వరుస పరాజయాలు మన ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బ తీస్తాయి మరి. ఇంకొన్నాళ్ళు ఈ పరాజయ పరంపర కొనసాగితే అభిమానులు క్రికెట్‌ని వదిలి పారేస్తే వందల కోట్ల పెట్టుబడితో నడుస్తున్న ఐపీఎల్ ఏం కావాలి? వేల కోట్లతో నడుస్తున్న వ్యాపార సామ్రాజ్యాలు ఏం కావాలి?
కాబట్టి BCCI రంగంలోకి దిగి కొన్ని చర్యలు చేపడితే ఈ అపజయాలకు అడ్డు కట్ట వేసి మన జట్టుని విజయాల వైపు మళ్ళించవచ్చు. ఇలా చేయడం అయ్యే పనేనా అన్న అనుమానం వద్దు. ఈ BCCI కి ఉన్న ఆర్ధిక బలంతో ఏమైనా చేయొచ్చు. ICC కూడా మనవాళ్ళు చెప్పినట్లు ఆడుతోంది కదా? అంపైర్ నిర్ణయాలని పునఃపరిశీలించే DRS మాకొద్దు అని మనవాళ్లంటే సరే అలాక్కానివ్వండి అని సర్దుకుపోలేదూ?
మనం మన దేశంలోనే, కాదంటే భారత ఉపఖండంలోనే అన్ని మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడప్పుడూ విదేశీ టూర్స్ లేకపోతే మరీ బావుండదు అనుకొంటే అక్కడ మన వాళ్ళు ఆడే పిచ్‌లన్నీ మన వాళ్ళు నియమించిన క్యూరేటర్స్ మాత్రమే డిజైన్ చేయాలి. మన ప్రత్యర్ధి జట్లు వాళ్ల జట్లలో ఇద్దరికి మించి ఫాస్ట్ బౌలర్లకి చోటివ్వకూడదు. మన వాళ్ళు అయిదు వికెట్లు కోల్పోతే ఆ తరువాత మన ప్రత్యర్ధి జట్లు ఎప్పుడు ఎవరు బౌలింగ్ చేయాలి అన్నది నిర్ణయించే అధికారం మన కెప్టెన్‌కి ఉండాలి.
మన బ్యాట్స్‌మెన్‌లో కనీసం ఒకరికయినా సెంచరీ పూర్తయిందాక అవుట్ కాకుండా అడే సౌలభ్యం ఉండాలి. ఎన్ని సార్లు అవుటయినా వంద పరుగులు అయ్యేదాకా క్రీజ్‌లోనే ఉంటాడన్నమాట. ఇక బౌలింగ్ విషయానికొస్తే పిచ్ ఎక్కడయినా ఫాస్ట్ బౌలింగ్‌కి అనుకూలిస్తుంది అన్న అనుమానం వస్తే మన జట్టు ప్రపంచంలో ఏ దేశానికి చెందిన బౌలర్లనయినా కొనుక్కోవచ్చన్న అధికారం కూడా మనకి ఉండాలి. మన వాళ్ళిచ్చే డబ్బుకి ఎవరయినా వాళ్ళ జట్టు అప్పుడు మరెవరితోనయినా సిరీస్ ఆడుతున్నా ఆ జట్టుని వదిలేసి వచ్చి ఆడిపోరూ?
ఇలాంటి నిబంధనలు అంగీకరించం అని ICC మొండికేస్తే మేం ICC నుంచి తప్పుకుంటాం అని బెదిరిస్తే వాళ్ళు చచ్చినట్లు దిగి వస్తారు. మన BCCI తడాఖా అలాంటిది.
3 comments:
like.
1. implement the system of 'daily wages. So, the cricketers will try to play all the 5 days of a test match.
2. Permission should be given to 'act' in advertisements only to the batsman/men who make atleast one 'hundred' in a series. 5 wickets for bowler.
kaneesam 5 matches lo kaneesam 2 matches manam gelipinchalani, munde oppandam chesukovaali. oneday lalo, okati vaalu, okati manm gelichettugaa munde oppandam chesukovaali
Post a Comment