చైనాలో ఎత్తైన,పొడవైన అంజైట్ బ్రిడ్జిని నిన్న ట్రఫిక్ కోసం తెరిచారు. ఈ బ్రిడ్జి పొడవు 3858 అడుగులు.
ఇది 1102 అడుగుల ఎత్తులో ఉంది. హునాన్ రాష్ట్రంలోని, డేహాంగ్ లోయపైనున్న ఈ ఇంజినీరింగ్ అద్భుతం నిర్మాణం 2007లో మొదలయింది.
ఈ బ్రిడ్జివల్ల ఈ పర్వత మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ ఫోర్ లేన్ బ్రిడ్జిలో పాదచారులకి ప్రత్యేక లైన్ ఉంది.
ఈ బ్రిడ్జిని రాత్రి వేళల్లో 1888 లైట్లతో వెలిగిస్తారు.
2 comments:
ఏమి చేయాలి అన్న చైనా వారి తరువాతనే.. ౨౦౧౨ మూవీ లో కూడా ఆ పడవలను చైనా వారితోనే చేపిస్తారు... అదే ఇండియా లో అయితే ఎన్నిరోజులు పట్టేదో కదా... చైనా ఫోన్ నుచి ఈ బ్రిడ్జ్ వరకు... తిందాం అని కాకుంట ప్రజలకోసం చేదాం అనుకుంటే ఇలాంటి వండర్స్ చేయవచ్చు...
ఎన్ని చేసినా బ్రిడ్జి కి ఎరుపు రంగు అంతగా నప్పినట్లు లేదు. సర్లెండి అది వారిష్టం.
Post a Comment