ఈ మధ్య కాలంలో వార్తల్లో బాగా నానిన మసాలా ఉన్న కేసు తారా చౌదరిది. సహజంగా ఇలాంటి విషయాలతో ఇన్‌స్పైర్ అయ్యే వారిలో రామ్ గోపాల్ వర్మ ముందు వరసలో ఉంటాడు. తన క్రియేటివిటీ మీద నమ్మకం తగ్గడం మూలాన కావచ్చు, కథలు ఆలోచించి బుర్ర పాడుచేసుకోవడం ఎందుకు పేపర్లలో, టీవీ చానళ్లలో వచ్చే వాటినే కథలుగా తీసుకొని సినిమా తీసి పారేస్తే ఓ పనయి పోతుంది కదా అన్న ఆలోచన కావచ్చు ఇలాంటి వాటిని ఆధారం చేసుకొని సినిమాలు తీస్తుంటాడు వర్మ.
ఆ మధ్య బొంబాయిలో ప్రియుడితో కలిసి ఒక డైరెక్టర్‌ని (నీరజ్ గ్రోవర్) హత్య చేసిన అమ్మాయి(మరియా సుసయ్‌రాజ్) కథని తెరకి ఎక్కించాడు వర్మ. ఇప్పుడు తారా చౌదరి కేసు బయటకొచ్చి ఇన్నాళ్ళు అవుతున్నా వర్మ దగ్గరనుంచి ఈ కేసు ఆధారంగా నేను ఒక సినిమా తీయబోతున్నాను అన్న ప్రకటన ఇంకా రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
తారా చౌదరి కథలో వర్మకి కావలసిన అన్ని దినుసులూ ఉన్నాయి-సెక్స్, అవినీతి పరులయిన పోలీసులూ, రాజకీయ నాయకులూ, కుట్రలూ, కుతంత్రాలు.. ఇలా తనకి పనికొచ్చే అన్ని విశయాలు ఉన్న ఈ కథని ఆయన ఎందుకు పట్టించుకొలేదో! కొంపదీసి తారా చౌదరి వద్ద వర్మ గారి సీడీ లేదు కదా?
6 comments:
"కొంపదీసి తారా చౌదరి వద్ద వర్మ గారి సీడీ లేదు కదా?" idi maatram highlight! :-)
కొంపదీసి తారా చౌదరి వద్ద వర్మ గారి సీడీ లేదు కదా?
HAHAHA
అతను నిర్మించిన బెజవాడ రౌడీలు సినిమా ఫ్లాప్ అయ్యింది కదా. డబ్బులు వచ్చిన తరువాత తారా చౌదరి సినిమా నిర్మిద్దాంలే అని అనుకుని ఉంటాడు.
రాంగోవర్మ దృష్టిపడాలంటే కనీసం ఒక మర్డరన్నా ఉండాలి
But Tara Chowdary is not a murderer. She entered the profession of prostitution by force of her husband.
Post a Comment