వివక్ష అనెది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే. మత పరంగా, కులం, రంగూ, రూపూ, లింగం,అర్ధిక స్థితిగతులూ ఇలా అన్ని రకాల వివక్షలు తప్పే. అయితే కొన్ని సార్లు ప్రకృతే వివక్ష చూపిస్తుంది. ఉష్ణ మండలాల్లో ఉన్న వారు నల్లగా, శీతల ప్రాంతాలలో ఉన్న వారు తెల్లగా ఉంటారు. అలాగే ఆడ, మగా వారికి ప్రకృతి నిర్దేశించిన విధులననుసరించి వారి శరీరాలలో కొన్ని ప్రత్యేక మార్పులు ఉంటాయి. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. కోటీశ్వరాలయినా పిల్లలు కావాలంటే గర్భం ధరించాలి, పుట్టిన పిల్లలకి పాలివ్వాలి. ఆ పనులు భర్త చేత చేయిస్తానంటే కుదరదు.
టెన్నిస్ క్రీడాకారులు ఆట మధ్యలో చెమటతో తడిసిపోయిన చొక్కాని కోర్టులోనే మార్చుకుంటారు. అలాగే గెలిచినప్పుడు మన గంగూలీలాగా చొక్కా విప్పి తిప్పుతారు. ఆదవాళ్ళు ఇలా చేయాలంటే వీలు కాదు. బీచ్‌లలో మగవాళ్ళు ఒక చిన్న చెడ్డీ వేసుకుని తిరుగుతారు. ఆడవారు చాతీ భాగంలో చిన్న గుడ్దపేలిక అయినా వేసుకోవాలి, న్యూడ్ బీచ్ అయితే తప్ప. అలాగే మగ వారికి చొక్క లేకుండా బయట తిరిగే వీలు ఉంది. ఇది ఆడవారికి లేదు. ఇది ఒకరు పెట్టిన నిబంధన కాదు. ప్రకృతిలోనే అలా వచ్చింది.
అయితే ఈ అసమానతని చెరిపి వేయడానికి ఇప్పుడు కొందరు నడుం బిగించారు. ఆడవారు కూడా పబ్లిక్‌లో చాతీమీద గుడ్డలు లేకుండా రొమ్ములు చూపిస్తూ తిరిగే వీలుండాలని ఉద్యమం చేస్తున్నారు. అమెరికాలో పుట్టిన ఈ ఉద్యమం అందుకు వీలుగా చట్టాలు మార్చాలని అంటున్నారు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో ఇలా తిరగడం చట్ట విరుద్ధం కాకపోయినా ఆడవారు చాతి మీద గుడ్డలు లేకుండా బయటకి వస్తే indecent exposure అని కేసులు పెడుతున్నారు పోలీసులు.
ఈ అన్యాయానికి నిరసనగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఆగస్టు చివరి ఆదివారం go topless day ని నిర్వహిస్తున్నారు కొందరు అమ్మాయిలు. ఈ సంవత్సరం కూడా ఈ నెల 26న ఈ డే ఉంది. ప్రపంచవ్యాప్తంగా నలభై నగరాలలో జరిగే ఈ ఉద్యమం go topless అన్న ఒక స్వచ్చంద సంస్థ నిర్వహిస్తుంది. ఆ రోజున ఇందులో పాల్గొనే అమ్మయిలందరూ ఒక చోట చేరి తమ జాకెట్లూ బ్రాలు తీసివేసి నిరసన తెలుపుతారు. అలా చేయలేనివారు పూర్తి దుస్తులు ధరించి కూడా ఇందులో పాల్గొని సంఘీభావం తెలపవచ్చట. అన్నట్టు ఇది కేవలం ఆడవారికి మాత్రమే కాదు. ఈ ఉద్యమం పట్ల సానుకూలంగా ఉన్న మగ వాళ్ళు బ్రాలు, బికినీలు ధరించి ఇందులో పాల్గొని సపోర్టు చేయవచ్చు.
ఈ సారి ఆడవాళ్ళు పబ్లిక్‌గా టాప్‌లెస్‌గా తిరిగే వీలుగా చట్టాలను సవరించమని అమెరికా అద్ధ్యక్షుడికి తమ నిరసన తెలియచేయడానికి అధ్యక్ష భవనం ముందు పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు. అలాగే ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ కూడా చేపట్టారు.
అయితే లోగడ slut walk లాంటి కార్యక్రమాలు ఈ విదేశీ వనితలని చూసి మన దేశంలో ఢిల్లీలో, బెంగుళూరులో మన వాళ్ళు కూడా కొంతమంది చేశారు. కానీ ఈ go topless మాత్రం మన దేశంలో లేదు.
7 comments:
ఏమిటో మీరు అన్ని రకాల టాపిక్స్ మీద రాస్తుంటారు. మీ బ్లాగ్‌ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు.
పొయ్యేకాలం వస్తే ఇంతే. ఈ దిక్కుమాలిన దరిద్రపు ఆలోచనలు మనదేశానికి రాకుండా ఉంటే అంతే చాలు.
ఇప్పటికి ఇంకా రాలేదు. ఈ ఇంటర్నెట్ యుగంలో రావడం ఎంత సేపు లెండి.
పోని సమానత్వం కోసం మగ వాళ్ళను చోక్కా విప్పకూడదని ఉద్యమం చెయ్యోచ్చు గా... అలా మాత్రం ఆలోచించరు వెధవలు, తిండి ఎకువై పని తక్కువై ఇలాంటి పనికిమాలిన ఉద్యమాలు..
ముదనష్టపు మూర్ఖపు గాడిదలు చేసే ముండమోపి ఉద్యమం ఇది.
మొత్తం విడిచేసితిరిగినా అడిగేవాళ్ళెవరు . కాస్త మనుషులకు పసువులకు తేడా ఉండాలని భావించనప్పుడు ?
నిజమేనండీ, చేయడానికి పనేమీ లేనప్పుడు, పని చేయాల్సిన అవసరం లేనప్పుడు, idle man's brain is devil's workshop అంటారే, అలాంటి వర్క్ షాపుల్లో పుట్టె ఆలోచనలే ఇవి. ఇప్పటి వరకూ మన దేశానికి రాలేదు. సంతోషం.
Post a Comment