నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, December 16, 2011

స్టాలిన్ పైన రెండు జోకులు


ఇవి ఆర్మీలో మేజర్‌గా పని చేసి వచ్చి, అందరికీ సాయపడుతూ, వారిని తలో ముగ్గురికీ, ఆ ముగ్గురూ మరో ముగ్గురేసి మందికీ సాయం చేయాలని చెబుతూ, త్రిషతో రొమాన్స్ చేసే స్టాలిన్ గురించి కాదు. సోవియట్ యూనియన్‌కి నియంతగా ఉన్న జోసెఫ్ స్టాలిన్ గురించిన జోకులు.





అవే కొనుక్కుంటాయి


ఒక సారి స్టాలిన్ తన అధికారులతో కలిసి కొన్ని వ్యవసాయ క్షేత్రాలు తనిఖీ చేయటానికి వెళ్ళాడు. మొదటి దానిలో యజమానిని పిలిచి "నువ్వు నీ కోళ్ళకి ఆహారం ఏం పెడతావ్?" అనడిగాడు.


"బార్లీ వేస్తాను సార్" అని చెప్పాడు యజమాని.

"సోవియట్ ప్రభుత్వం ఎంతో డబ్బు వెచ్చించి దిగుమతి చేసుకునే బార్లీని కోళ్లకు దాణాగా వేస్తావా?" అని కోపంతో తుపాకీ తీసి యజమానిని కాల్చి పారేశాడు స్టాలిన్.

రెండవ ఫారంలో అదే ప్రశ్న వేస్తే ఆ యజమాని "గోధుమలు వేస్తాను సార్" అని చెప్పాడు. " సోవియట్ రైతు కామ్రేడ్లు చెమట చిందించి పండించిన పంట నీ కోళ్ళకు దాణాగా వేస్తావా?" అని ఆగ్రహించి అతన్ని కాల్చి పారేశాడు.




మూడవ చోట అదే ప్రశ్న వేస్తే మొదటి ఇద్దరికీ పట్టిన గతి చూసిన ఆ యజమాని తెలివిగా," నేను నా కోళ్ళకి తలా ఓ అయిదు కోపెక్కులు ఇస్తాను సార్. వాటికి ఏం కావాలో అవే కొనుక్కుంటాయి" అని చెప్పాడు.




సంతోషించిన స్టాలిన్ అతనికి సోవియట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇచ్చేశాడు అక్కడికక్కడే.

(రూబుల్, కోపెక్ అనేవి సోవియట్ కరెన్సీ)



టాప్ సీక్రెట్

ఒక సారి ఒకడు మాస్కో నడి బొడ్డున నించుని పెద్దగా "స్టాలిన్ పిచ్చోడు" అని అరిచాడు. మరు క్షణంలో బిల బిలా పోలీసులొచ్చి అతన్ని పట్టుకెళ్ళి కోర్టులో పెట్టారు. జడ్జి అంతా విని, "వంద రూబుళ్ళు జరిమానా, ముప్పయి సంవత్సరాలు సైబీరియాలో జైలు శిక్ష" అని తీర్పు చెప్పాడు.


  

 "ఎందుకు నాకీ శిక్ష?" అనడిగాడు ఆ అరిచిన వ్యక్తి.

"సాటి కామ్రేడ్‌ని అవమాన పరిచినందుకు జరిమానా. ప్రభుత్వానికి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ బయట పెట్టినందుకు జైలు శిక్ష" అని చెప్పాడు న్యాయ మూర్తి.

Thursday, December 15, 2011

తమిళ నాడు లోని ఆ ఆనకట్ట వయసు రెండు వేల సంవత్సరాలు


దక్షిణ తమిళనాడులో కావేరి నది మీద చోళుల కాలంలో నిర్మించిన కల్లనై డ్యామ్ వయసు రెండు వేల సంవత్సరాలు.

 
 క్రీ.శ.మొదటి శతాబ్ధిలో కరికాళ చోళుడు నిర్మించిన ఈ ఆనకట్ట నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈరోడ్, సేలం జిల్లాల మధ్య ఉన్న కావేరీ నది మీద ఉన్న ఈ ఆనకట్ట ద్వారా తంజావూరు డెల్టా  సశ్యశ్యామలంగా మారి Rice Bowl of Tamil Nadu అని పెరు తెచ్చుకుంది.







 రెండు వేల క్రితం కట్టిన ఈ కట్టడం ప్రపంచంలోనే అతి ప్రాచీన మైన ఆనకట్టగా గుర్తింపు పొందింది. అప్పటి నిర్మాణం నేటికీ పని చేస్తూ ఉంది. పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్ధాలలో ఇంగ్లీషు ఇంజినీర్లు దీనికి కొన్ని మార్పులు చేసినా మూల నిర్మాణం మాత్రం చోళ శిల్పులు నిర్మించిందే.


కల్లనై అంటే తమిళంలో రాతి కట్ట అని అర్ధం. ఆంగ్లేయులు దీనిని Grand Anicut అని పిలిచే వారు. 329 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 5.4 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ఆనకట్ట తరువాతి కాలంలో ఆర్థర్ కాటన్‌తో సహా అనేక మందికి డ్యామ్‌ల నిర్మాణంలో స్ఫూర్తిగా నిలిచింది. 


గత సంవత్సరం వేయి సంవత్సరాలు పూర్తి చేసుకున్న తంజావూరు బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజ రాజ చోళుడి శిల్పాన్ని ప్రతిష్ఠించినట్లే ఈ డ్యామ్ కట్టించిన కరికాల చోళుడి విగ్రహం కూడా పెట్టాలని కావేరి డెల్టా రైతులు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఈ డ్యామ్‌కి సంబంధించి నేను ఈ ఆగస్టులో తీసిన కొన్ని ఫోటోలు ఇవి. మొదటి రెండు ఫోటోలు వికిపీడియా నుంచి తీసుకున్నవి.

Wednesday, December 14, 2011

రొమ్ములు పెద్దవిగా ఉన్నాయని గైడ్ సినిమాలోంచి వైజయంతి మాలని తొలిగించారు


నాయికని వర్ణించడంలో ప్రబందాలయినా నవలలయినా వక్షోజాల ప్రసక్తి తప్పక వస్తుంది. అవి ఖచ్చితంగా పెద్దవే అయి ఉంటాయి. బోర్లించిన కుండలతో పోల్చినా లేదా ఇతర వస్తువులతో పోల్చినా నిండుగా ఉండి ఉంటాయి. ఇక సినిమాలలో అయితే చెప్పే పని లేదు. హీరోయిన్ల వక్ష సౌందర్యాన్ని ప్రేక్షకుల కళ్ళకి నిండుగా చూపిస్తారు దర్శకులు. కాబట్టి సమున్నత వక్ష సౌందర్యం వారికి పెద్ద అస్సెట్. సహజంగా పెద్ద పెద్ద అందాలు లేని వారు అది పెద్ద లోటుగా ఫీలవకుండా ప్లాస్టిక్ సర్జరీతో కావలసిన సైజుకి పెంచుకుంటున్నారు. రాఖీ సావంత్ దగ్గరనుండీ బిపాషా బసు, కత్రినా కైఫ్‌ల దాకా చాలామంది ఇలా తమ అందాలని సర్జన్ల కత్తులకి అప్పగించిన వారే.


  






 
అయితే ఆ ఎత్తైన వక్ష సౌందర్యం వైజయంతి మాల బాలిని 1965 లో వచ్చిన కళా ఖండం గైడ్ సినిమాకి దూరం చేసింది. దేవ్ ఆనంద్ నటించిన ఈ చిత్ర రాజంలో హీరోయిన్‌గా ముందు వైయయంతి మాలని తీసుకోవాలని అనుకున్నారు. ప్రసిద్ధ రచయిత R.K. నారాయణ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో హీరోయిన్ రోసీ ఒక డాన్సర్. దానితో సహజంగా డాన్సర్ అయిన వైయయంతి మాల అయితే ఆ పాత్రకి న్యాయం చేస్తుందని ఆమెని ఎంపిక చేశారు. 


  
ఈ సినిమాని ఇంటర్నేషనల్ రిలీజ్ కోసం ఇంగ్లీషులో కూడా తీస్తుండడంతో దర్శకుడు విజయ్ ఆనంద్ వైజయంతి మాల ఎంపిక అంగీకరించలేదు. అందుకు ఆయన చెప్పిన కారణం ఆమె ఎత్తైన వక్ష సంపద. ఇంగ్లీషు హీరోయిన్లకి అంత పెద్ద పెద్ద రొమ్ములు ఉండవనీ, కొంచెం సైజు తక్కువ ఉన్న హీరోయిన్ అయితే బావుంటుంది అని ఆయన చెప్పడంతో వైజయంతి మాలని మార్చి ఆ స్థానంలో వహీదా రెహ్మాన్‌ని ఎంపిక చేశారు. ఆ సినిమాలో వహీదా ఎంత బాగా రాణించిందీ, సినిమా విజయానికి ఎంత కారణమయిందీ అందరికీ తెలిసిందే.

Friday, December 9, 2011

ఆడ వారు అరటి పండు తాకకూడదు అని ఆర్డరేసిన మత పెద్ద


ఆడవారి మీద ఆంక్షలు విధించడంలో ఇస్లాం మత పెద్దల రూటే వేరు. ఈ విషయంలో విరి కున్న సృజనాత్మకతకు అంతు లేదు. అందంగా కనిపించే ఆడవారి వల్ల మగవారికి కలిగే ఇబ్బందులని, తద్వారా వారికి కలిగే ప్రమాదాలని నివారించాలన్న పెద్ద మనసుతో అమ్మాయిలని తల నుండి కాలిదాకా బురఖాతో కప్పేశారు. ఆడవాళ్ళు మగవారి తోడు లేకుండా బయట తిరగ కూడదని కొన్ని దేశాల్లో ఆంక్షలు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌లో స్వంత బంధువు చేతిలో ఒకమ్మాయి రేప్‌కి గురయితే ఆ బాధితురాలిని జైలులో పెట్టి తనని రేప్ చేసిన వాడిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటే విడుదల చేస్తామని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈ మత పెద్దలు.


 
సౌదీ అరేబియాలో ఆడవారు డ్రైవింగ్ చేయకూడదన్న నిబంధన ఎత్తి వేయడానికి ఈ మత పెద్దలు అంగీకరించడం లేదు. దానికి వారు చెప్పే కారణాలు చాలా వింతగా ఉన్నాయి. ఆడవారిని డ్రైవింగ్ చేయనిస్తే ఆడవాళ్ళందరూ తమ కన్యత్వాన్ని పోగొట్టుకుంటారట. దేశంలో వ్యభిచారం, బూతు, విడాకులు ఎక్కువవుతాయట.
 
ఇది చాలదన్నట్టు ఇప్పటికే కళ్ళు తప్ప మిగతా శరీరమంతా కప్పేలా బురఖా తగిలించుకునే ఆదవారు తమ కళ్ళు కూడ కప్పుకోవాలని కొత్తగా ఆర్డర్ వేశారు ఈ పెద్దలు.  Saudi Arabia's Committee for the Promotion of Virtue and the Prevention of Vice కి చెందిన పెద్దల ప్రకారం కొందరు అమ్మాయిల కళ్ళు కూడా ఆకర్షణియంగా కనిపించి మగవారిని టెంప్ట్ చేస్తాయట.
 
ఈ మూర్ఖ శిఖామణుల జాబితాలోకి ఇప్పుడు మరొకడు చేరాడు. el-Senousa News అనే ఒక మత పత్రికలో ఫత్వా జారీ చెసిన ఒక యూరోప్ ఇస్లాం మత పెద్ద ఆడవారు అరటి పళ్లు, దోస కాయలు, క్యారట్ లాంటి పళ్ళు, కూర గాయలని తాక కూడదు అని హుకుం జారీ చేశాడు. వాటి షేపు చూసి, వాటిని తాకితే ఆడవారిలో శృంగార పరమైన ఆలోచనలు తలెత్తు తాయట. ఒక వేళ ఎవరయినా అరటి పండు తినాలనుకుంటే ఇంట్లో మగ వారి చేత దాన్ని కట్ చేయించిన పిదప మాత్రమే దానిని తాకాలట.
  


 మరి వీటిని తాకి మగవాళ్ళు కూడా హోమో సెక్సువల్స్ అవుతారని ఈ పళ్లని ఆడా, మగా కాని వారే తాకాలని కూడా త్వరలో ఫత్వా వస్తుందేమో చూడాలి. అలాగే గుండ్రంగా ఉండే పళ్ళూ, కూరగాయలు మగవారిలో ఆడవారి శరీర భాగాలకి సంబంధించిన ఆలోచనలు రేకెత్తిస్తాయి కాబట్టి మగవారు వాటిని తాక కూడదు అని కూడ ఆర్డరేస్తారేమో?

Thursday, December 1, 2011

వీర్యం కోసం మగవారిని రేప్ చేస్తున్న జింబాబ్వే మహిళలు


వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. జింబాబ్వేలో ఎన్నాళ్ళగానో సాగుతున్న ఈ అరాచకంలో ఇప్పుడే అరెస్టుల పర్వం మొదలయింది. తనని ముగ్గురు మహిళలు మానభంగం చేశారని ఒక యువకుడు ముందుకు రావడంతో మొట్ట మొదటి కేసు నమోదయింది. టెలివిజన్‌లో అతడి మొహం చూపకుండా తనకి జరిగిమ దారుణాన్ని అతను చెప్పుకున్నాడు. బస్సు కోసం ఎదురు చూస్తున్న తనకి ఒక కారులోని వారు లిఫ్టు ఇస్తానంటే ఎక్కానని, కారులో ముగ్గురు ఆడవారు ఉన్నారని, తను ఎక్కిన వెంటనే ఒకామె తన మొహమ్మీద నీరు పోస్తే, ఇంకొకామె ఒక ఇంజెక్షన్ పొడిచిందనీ, దానితో తనలో విపరీతమైన లైంగిక వాంఛ ఏర్పడిందనీ, వారు తనని ఒక నిర్జన ప్రాంతానికి తీసుకెళ్ళి కండోమ్స్ తొడిగి ఒకరి తరువాత ఒకరిగా మళ్ళీ మళ్ళీ రేప్ చేశారనీ చెప్పాడు అతను. ఆ తరువాత తనని అలాగే వదిలేసి వాడిన కండోమ్స్ మాత్రం జాగ్రత్తగా పట్టుకెళ్ళారని చెప్పాడు. ఆడవారు మగ వారిని రేప్ చేయడం అన్నది జింబాబ్వే శిక్షా స్మృతిలో లేనందువలన దాడిగా మాత్రమే ఈ విషయంలో కెసు నమోదు చేశారు పోలీసులు.


 
ఈ సంఘటన జరిగి దాదాపు ఒక ఏదాడి జరిగింది. ఇన్నాళ్ళకి పోలీసుల తనిఖీలో ఒక కారులో ముగ్గురు ఆడవాళ్ళు, ముప్పయి వాడేసిన కండోమ్‌లూ కనిపించడంతో వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారు మాత్రం అలాంటి నేరాలకూ తమకూ సంబంధం లేదనీ, తాము వేశ్యలం మాత్రమేననీ, బిజీగా ఉండడం వలన వాడిన కండోమ్‌లు పారవేయలేకపోయామని చెప్పుకొచ్చారు.



అసలు ఇంతకీ ఈ ఆడవాళ్ళు ఇలా మగవారిమీద పడి అత్యాచారాలు చేయడం, అందులోనూ కండోమ్‌లు తొడిగి మరీ చేయడం ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమెస్తుంది. ఇదంతా మగవారి వీర్యం కోసమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా రేప్‌ల ద్వారా వీర్యాన్ని సేకరించే పెద్ద ముఠా ఒకటి ఉందని, ఇలా సేకరించిన వీర్యంతో వ్యాపారాలని అభివృద్ధి చేయడానికీ, డబ్బు సంపాయించడానికి రహస్య పూజలు చేస్తారని అనుమానిస్తున్నారు.


అయితే ఇలా మహిళల చేతిలో మానభంగానికి గురి అయినట్లు చెప్పుకోవడం తమ మగతనానికి అవమానంగా చాలామంది భావిస్తూ ఉండడంతో ఇలా రేప్‌కి గురయిన వారు చాలామంది ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మగవాళ్ళెవరూ అపరిచితులు ముఖ్యంగా ఆడవాళ్ళు కారులో లిఫ్ట్ ఇస్తామంటే తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
People standing by mini bus taxis in Harare, Zimbabwe
ఆడవాళ్ళు మగవారికి కండోమ్ తొడిగి రేప్ చేసి వీర్యం సేకరించడం అనేది నమ్మశక్యంగా లేక పోయినా ఇది నిజం. ఇది సాక్షాత్తూ BBC వారి కథనం. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ చూడవచ్చు.
http://www.bbc.co.uk/news/world-africa-15876968
అయినా వీర్యమే కావాలి అనుకుంటే ఇలా రేప్ చేయడం లాంటి రాక్షస కార్యాలు కాకుండా మరెన్ని సరసమైన దారులు లేవు