దక్షిణ తమిళనాడులో కావేరి నది మీద చోళుల కాలంలో నిర్మించిన కల్లనై డ్యామ్ వయసు రెండు వేల సంవత్సరాలు.
క్రీ.శ.మొదటి శతాబ్ధిలో కరికాళ చోళుడు నిర్మించిన ఈ ఆనకట్ట నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈరోడ్, సేలం జిల్లాల మధ్య ఉన్న కావేరీ నది మీద ఉన్న ఈ ఆనకట్ట ద్వారా తంజావూరు డెల్టా సశ్యశ్యామలంగా మారి Rice Bowl of Tamil Nadu అని పెరు తెచ్చుకుంది.
రెండు వేల క్రితం కట్టిన ఈ కట్టడం ప్రపంచంలోనే అతి ప్రాచీన మైన ఆనకట్టగా గుర్తింపు పొందింది. అప్పటి నిర్మాణం నేటికీ పని చేస్తూ ఉంది. పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్ధాలలో ఇంగ్లీషు ఇంజినీర్లు దీనికి కొన్ని మార్పులు చేసినా మూల నిర్మాణం మాత్రం చోళ శిల్పులు నిర్మించిందే.
కల్లనై అంటే తమిళంలో రాతి కట్ట అని అర్ధం. ఆంగ్లేయులు దీనిని Grand Anicut అని పిలిచే వారు. 329 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 5.4 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ఆనకట్ట తరువాతి కాలంలో ఆర్థర్ కాటన్‌తో సహా అనేక మందికి డ్యామ్‌ల నిర్మాణంలో స్ఫూర్తిగా నిలిచింది.
గత సంవత్సరం వేయి సంవత్సరాలు పూర్తి చేసుకున్న తంజావూరు బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజ రాజ చోళుడి శిల్పాన్ని ప్రతిష్ఠించినట్లే ఈ డ్యామ్ కట్టించిన కరికాల చోళుడి విగ్రహం కూడా పెట్టాలని కావేరి డెల్టా రైతులు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ డ్యామ్‌కి సంబంధించి నేను ఈ ఆగస్టులో తీసిన కొన్ని ఫోటోలు ఇవి. మొదటి రెండు ఫోటోలు వికిపీడియా నుంచి తీసుకున్నవి.
2 comments:
Nice info.
Thank you.
Post a Comment