మేఘాలలో చాలా రకలున్నాయి. వాతావరణంలో తేమ, గాలి వేగం ఆధారంగా ఈ మేఘాల రంగు, ఆకారాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు. ఆ మధ్య రాజ శేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు క్యుములో నింబస్ మేఘాలు అన్న పదం పాపులర్ అయింది.
కటకం(lerns) ఆకారంలో ఉండే మేఘాలని lenticular clouds అంటారు. గాలి పర్వత శ్రేణుల మీదుగా ప్రయాణం చేసే సమయంలో ఈ మేఘాలు ఏర్పడుతాయి. ఈ మేఘాలనే చాలా సార్లు ఫ్లయింగ్ సాసర్లు (UFO) లుగా భ్రమ పడుతుంటారు.
ఇంగ్లండ్ లోని యార్క్‌షైర్‌లో BBC ఫోటోగ్రాఫర్ కెమెరాకి దొరికిన కొన్ని లెంటిక్యులర్ మేఘాల ఫోటోలివి.
1 comment:
UFOల గురించి నిజాలు తెలిసినా పత్రికలవాళ్ళు తెలియనట్టు నటిస్తారు. ఎందుకంటే ఇలాంటి కట్టుకథలు, పిట్టకథలు ఉంటేనే వాళ్ళకి వార్తల మేత దొరుకుతుంది.
Post a Comment