ఈ సంవత్సరం జనవరిలో నాకు ఒక Dell Streak మొబైల్ ఫోన్ గిఫ్టుగా వచ్చింది. డెల్ వాళ్ళు కంప్యూటర్లు చేస్తారని తెలుసు గానీ మొబైల్ హ్యాండ్ సెట్స్ కూడా చేస్తారని అప్పుడె తెలిసింది. మా ఇంట్లో డెస్క్ టాప్ డెల్ కంపెనీదే. బాగా పని చేస్తున్నది కాబట్టి ఈ ఫోన్ కూడా అలాగే నాణ్యతగా ఉంటుందని అనుకున్న నా నమ్మకం అయిదు నెలల్లో ఆవిరయిపోయింది.
ఉన్నట్టుండి ఫోన్ చార్జి కావడం మానేసింది. చార్జింగ్ కేబుల్ మార్చి చూశాను. అయినా లాభం లేక పోయింది. దాన్ని ఒక మొబైల్ రిపేరు వాడికి చూపిస్తే కనెక్టర్, అంటే చార్జింగ్ వైరు పెట్టే స్లాట్ పాడయింది అని చెప్పాడు. డెల్ మొబైల్ సర్వీసు వాడిని నెట్‌లో వెదికి పట్టుకుని వెళ్తే, ఇప్పుడు డెల్ కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తి ఆపేసింది అని, కాబట్టి ఆ మోడల్ స్పేర్ పార్ట్సు దొరికే అవకాశం లేదని అన్నాడు. అప్పట్నుంచీ అయిదంగుళాల ఆ డెల్ స్ట్రీక్ అలా ఖాళీగా పడి ఉంది.
దీనిని ఎలా మళ్ళీ చార్జి చేయవచ్చో ఎవరయినా చెప్పగలిగితే సంతోషిస్తాను. పవర్ మ్యాట్ అన్న దానితో వైర్లతో సంబధం లేకుండా చార్జి చేయవచ్చని విన్నాను. అది మనకు దొరుకుంతుందేమో ఎవరయిన చెప్పగలరా?
PS: ఇది గిఫ్టుగా వచ్చింది కాబట్టి నా దగ్గర దీని తాలూకూ బిల్లు లేదు.
6 comments:
మీ మొబైలు లోని బ్యాటరీ బయటకు తీయగలిగితే..... బ్యాటరీ చార్జర్లు కూడా దొరుకుతున్నాయి .... దానిలో బ్యాటరీ పెట్టి చార్జి చేసుకుని వాడుకోవచ్చు..... కుదిరితే స్పేరు బ్యాటరీ కొనుక్కుంటే... ఒకటి చార్జి చేసుకునేప్పుడు ఇంకొకదానితో మొబైలు ఉపయోగించుకోవచ్చు...
పవర్ మాట్ దొరుకుతుంది కానీ ఎక్కడ అనేది చెప్పలేను....
మీకు ఎవరైనా అమెరికా స్నేహితులు ఉన్నట్లైతే వారికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తెప్పించుకోవచ్చు... ధర యాభై డాలర్ల నుంచి ఉంటుంది... అంత కంటే తక్కువ లో కూడా ఉంటుంది కానీ నాణ్యత ఉండదేమో..
మన దేశంలో కూడా దొరకొచ్చేమో కానీ ఎక్కడా అంటే చెప్పటం కష్టమే...
1. First find a old charger. old nokia or something.
2. remove the end pin of the charger and take out the wires.
3. Find the polarity of the wires + -
4. On dell streak battery find + - and insert the wires and put the battery back.
5. charge for 30min and see.
http://www.streaksmart.com/2010/12/keep-extra-dell-streak-batteries-charged-with-lenmar-universal-clip-charger.html
Thank you very much. I will try these and let you know.
i think your best Bet would be to get an external battery charger like Madhavi mentioned , No big hassles and you can get the job done easily....
Post a Comment