నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, December 16, 2011

స్టాలిన్ పైన రెండు జోకులు


ఇవి ఆర్మీలో మేజర్‌గా పని చేసి వచ్చి, అందరికీ సాయపడుతూ, వారిని తలో ముగ్గురికీ, ఆ ముగ్గురూ మరో ముగ్గురేసి మందికీ సాయం చేయాలని చెబుతూ, త్రిషతో రొమాన్స్ చేసే స్టాలిన్ గురించి కాదు. సోవియట్ యూనియన్‌కి నియంతగా ఉన్న జోసెఫ్ స్టాలిన్ గురించిన జోకులు.





అవే కొనుక్కుంటాయి


ఒక సారి స్టాలిన్ తన అధికారులతో కలిసి కొన్ని వ్యవసాయ క్షేత్రాలు తనిఖీ చేయటానికి వెళ్ళాడు. మొదటి దానిలో యజమానిని పిలిచి "నువ్వు నీ కోళ్ళకి ఆహారం ఏం పెడతావ్?" అనడిగాడు.


"బార్లీ వేస్తాను సార్" అని చెప్పాడు యజమాని.

"సోవియట్ ప్రభుత్వం ఎంతో డబ్బు వెచ్చించి దిగుమతి చేసుకునే బార్లీని కోళ్లకు దాణాగా వేస్తావా?" అని కోపంతో తుపాకీ తీసి యజమానిని కాల్చి పారేశాడు స్టాలిన్.

రెండవ ఫారంలో అదే ప్రశ్న వేస్తే ఆ యజమాని "గోధుమలు వేస్తాను సార్" అని చెప్పాడు. " సోవియట్ రైతు కామ్రేడ్లు చెమట చిందించి పండించిన పంట నీ కోళ్ళకు దాణాగా వేస్తావా?" అని ఆగ్రహించి అతన్ని కాల్చి పారేశాడు.




మూడవ చోట అదే ప్రశ్న వేస్తే మొదటి ఇద్దరికీ పట్టిన గతి చూసిన ఆ యజమాని తెలివిగా," నేను నా కోళ్ళకి తలా ఓ అయిదు కోపెక్కులు ఇస్తాను సార్. వాటికి ఏం కావాలో అవే కొనుక్కుంటాయి" అని చెప్పాడు.




సంతోషించిన స్టాలిన్ అతనికి సోవియట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇచ్చేశాడు అక్కడికక్కడే.

(రూబుల్, కోపెక్ అనేవి సోవియట్ కరెన్సీ)



టాప్ సీక్రెట్

ఒక సారి ఒకడు మాస్కో నడి బొడ్డున నించుని పెద్దగా "స్టాలిన్ పిచ్చోడు" అని అరిచాడు. మరు క్షణంలో బిల బిలా పోలీసులొచ్చి అతన్ని పట్టుకెళ్ళి కోర్టులో పెట్టారు. జడ్జి అంతా విని, "వంద రూబుళ్ళు జరిమానా, ముప్పయి సంవత్సరాలు సైబీరియాలో జైలు శిక్ష" అని తీర్పు చెప్పాడు.


  

 "ఎందుకు నాకీ శిక్ష?" అనడిగాడు ఆ అరిచిన వ్యక్తి.

"సాటి కామ్రేడ్‌ని అవమాన పరిచినందుకు జరిమానా. ప్రభుత్వానికి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ బయట పెట్టినందుకు జైలు శిక్ష" అని చెప్పాడు న్యాయ మూర్తి.

5 comments:

Anonymous said...

:) ;)

Sri Kanth said...

first one is outstanding.. :-)

Apparao said...

రెండో జోక్ ఫస్ట్ పెట్టి ఉంటె స్టాలిన్ పిచ్చోడు అని ప్రూవ్ అయ్యేది :)

రెండూ బాగున్నాయి

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అప్పారావ్ గారూ, మీరు చెప్పింది నిజమండీ.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అప్పారావ్ శాస్త్రి గారూ మీరు చెప్పినట్లు మార్చాను. థాంక్స్.