ARDS అని ఒక కండీషన్ ఉంది. శ్వాస పీల్చుకోవడానికి కష్టపడుతుంటాడు ఇది వచ్చిన పేషంట్. దానితో ICU లోకి, వెంటిలేటర్ మీదికి అక్కడినుంచి మరణానికి చేరువవుతాడు. Acute Respiratory Distress Syndrome అంటారు దీనిని. ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా ఇలాంటిదే ALDS అన్న జబ్బు చేసింది. Acute Leadership Deficit Syndrome అని పిలవచ్చు దీనిని. సరయిన నాయకుడు లేక రాష్ట్రం ఊపిరాడక అల్లాడుతోంది. ప్రతిరోజూ పేపర్లో నాయకుల ఫోటోలు చూస్తూ ఉంటాం అలాంటిది నాయకుడే లేడు అంటాడు వీడెవడురా అనుకోవద్దు. కావాలంటే మీరే దీన్ని సాంతం చదవండి.
ఇప్పుడు నాయకుడయి ఒకాయన పాలిస్తున్నాడు. తాను నాయకుడినని గద్దెనెక్కే క్షణం వరకూ ఆయనకే తెలియదు. ఆయన నాయకుడని గద్దె నెక్కాక కూడా ఆయన కింద పనిచేసే మంత్రులకు తెలియదు, ఇప్పటికీ ప్రజలకు తెలియదు. లక్షలకు లక్షలు ఉద్యోగాలిస్తానని, కోట్లకి కోట్లు ఋణాలిస్తానని, ముందుంది ముసళ్ల పండగ, సారీ, మంచి కాలం అని రోజూ పేపర్లలో ప్రకటనలు దంచి పారేసి, చివరికి ముడ్డి కడుక్కోవడానికి కూడా డిల్లీ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తుంటాడు ఈ నాయకుడు. ఇక ఈయనకు పోటీగా కుర్చీ ఎక్కడానికి సిద్ధంగా నిరీక్షిస్తున్న మరొకాయన్ని చూస్తే ఈయన వంటి నిండా సారా కంపు, అవినీతి మరకలు.
ఒకప్పుడు కుర్చీని మాయోపాయంతో దక్కించుకొని, తరువాత పోగొట్టుకుని తిరిగి ఎక్కడానికి శతవిధాల యత్నిస్తున్న ఒక బాబు గారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజల దాకా ఎందుకు ఆయన అనుచరులే ఆయన్ని నమ్మేలా లేరు. నా తండ్రి కుర్చీ నాకు ఇవాల్సిందే అని రాష్ట్రమంతా తిరిగి గీపెట్టి గోల చేస్తున్న యువరాజు ఎప్పుడు శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పోవల్సి వస్తుందో తెలియని స్థితి.
ఇప్పుడు ఉన్న వారందరూ చేతగాని సన్నాసులు, అవినీతి కంపు కొట్టే దరిద్రులూ, స్వచ్చమైన పాలన కావాలంటే నేను రాజకీయాల్లోకి రావల్సిందే అని రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఒక ఆశాజ్యోతి పదవుల్లేకపోతే నేను బతకలేనని ఆ సన్నాసులూ, దరిద్రులతోనే కలిసి పోయి వారి మోచేతి నీరు తాగడానికి సిద్ధమయి పోయాడు. ఇక రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా పని చేసే వాడొకడు, ఏం పని చేయాలో తెలియక పిచ్చిగా తిరుగుతూ, ఎక్కడో నక్కి అప్పుడప్పుడూ తాము బతికే ఉన్నామని కలుగులోఛి బయటకొచ్చే ఎర్ర ఎలుకలూ, సత్తా లేని, పత్తాలేని నాయకుడు ఇంకొకాయన... వీళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రానికి దిక్కు.
కాబట్టి నాయకుడయి ముందుండి నడిపించేవాడు వచ్చే వరకూ ఈ రాష్ట్రానికి ఈ జబ్బు నయం అయ్యే అవకాశం లేదు.
3 comments:
meeroo nenoo aa chivaraayanani gelipiste emaina cheyagalademo!
I don't think majority people agree with this opinion.
http://teluguwebmedia.in మీకు నూతన సంవత్సర స్వాగతం పలుకుతోంది.
-- ప్రవీణ్ శర్మ
Post a Comment