శవాలు కూడా లేచి కూర్చునే అందం నీది అంటాడు రాజేంద్ర ప్రసాద్ ఒక అమ్మాయితో తేనెటీగ సినిమాలో. శవాలు సమాధుల్లోంచి లేచి డాన్స్ చేస్తాయి మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ పాటలో. చిరంజీవి కూడా కాష్మోరా కౌగిలిస్తే ఏం చెస్తావో అని ఆ పాటని కాపీ కొట్టి శవాలని లేపాడు ఒక పాటలో. శవం పోస్ట్ మార్టం బల్ల పైనుండి లేచి వస్తే ఎలా ఉంటుందో హైడీ క్లమ్ అనే మోడల్/నటి/ఫ్యాషన్ డిజైనర్ మొన్న ఒక పార్టీలో చూపించింది.
అక్టోబర్ 31న హాలొవీన్ అనే దెయ్యల పండగ చేసుకుంటారు అమెరికా వాళ్ళు. ఇంటి ముందు ఒక గుమ్మడి కాయని లోపల గుజ్జు తీసి, దీపం వెలిగించి తగిలిస్తారు. పిల్లలు దెయ్యాల మాస్కులు ధరించి ఇంటింటికి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని కేకులు, చాక్‌లెట్లూ దండుకుంటారు. ఇందులో భాగంగా ఒక ఫ్యాన్సీడ్రెస్ వెడుకలో హెయిడీ క్లమ్ అనే ఈ అమ్మడు ఇలా పోస్ట్ మార్టం జరుపుకున్న శవంలా రంగులు వేసుకుని, మరింత సహజత్వం కోసం ఒక స్ట్రెచర్ మీద పక్కన రక్తం మరకలయిన డాక్టరుతొ సహా ఎంట్రీ ఇచ్చింది.
ఆ రంగులు కూడా చాలా సహజంగా అనాటమీ టెక్స్ట్ బుక్‌లో చూసి వేసినట్టు వేశాడు ఆ పెయింటర్. "చర్మం తొలిగిస్తే శవం ఎలా ఉంటుందో అలా కనిపించాలని ఎనిమిది గంటలపాటు కదలకుండా కూర్చుని ఈ వేషం వేశాను" అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. మొత్తానికి ఈమె శ్రమ ఫలించి వచ్చిన అతిధులు ఈ వేషాన్ని చూడగానే వావ్ అన్నారట.
3 comments:
సరదా పండగేనా? పిచ్చిదనానికి పరాకాష్ఠ.
maa office lo ayite saradaga pirates & carribean veshalu, beautiful vampire veshalu vesukunnaru. paapam ee ammadiki pichi ekkuvainatlundi.
అసలు పండగ సరదాయే. ఇలాంటి వాళ్ళు దానిని పిచ్చిదానిని చేస్తారు. ఈ అమ్మడికి పిచ్చి ఎక్కువైందో లేక ఫాన్సీ డ్రెస్‌ని మరీ సీరియస్‌గా తీసుకుందో మరి.
Post a Comment