మూడు రోజుల క్రితం లూధియానాలో జరిగిన కబడ్డి ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టు మీద గెలిచి ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన భారత మహిళా జట్టుని మేనేజ్‌మెంట్, ఆర్గనైజింగ్ కమిటీలు దారుణంగా అవమానించాయి. జట్టు సభ్యులు ఇళ్లకి వెళ్ళడానికి కనీసం రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆ అమ్మాయిలు కప్ పట్టుకొని రోడ్ మీద ఆటో కోసం ఎదురు చూస్తూ నించున్నారు. కొందరయితే నడిచే వెళ్ళారు.
అలాగే క్రీడాకారులు బస చేసిన హోటల్‌లో వీరి భోజనానికయిన బిల్లు చెల్లించక పోవడంతో డబ్బులు కడితే కానీ రూమ్స్ ఖాళీ చేయడానికి వీల్లేదని పార్క్ ప్లాజా హోటల్ యాజమాన్యం పట్టుబట్టడంతో రెండు గంటలు హోటల్ లాబీలో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు స్పందించిన టీమ్ మేనేజ్‌మెంట్ హోటల్ వారికి బకాయి పడ్ద 22 వేల రూపాయలు చెల్లించడంతో బతుకు జీవుడా అని బయటకొచ్చారు.
అంతకు రెండు రోజుల ముందు ఈ క్రీడా కారిణులు ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో చాలా మంది లగేజ్ కూడ అందులో కాలి పోయింది. దానితో చాలా మంది ఒంటి మీదున్న ఒక జత బట్టల తోనే వారమంతా గడిపారు. జట్టు మేనేజ్‌మెంట్‌కి వారికి మరొక జత బట్తలు కొనడానికి కూడా వీలు కాలేదేమో పాపం!
కొద్దిలో కొద్దిగా మెరుగు ఏమంటే ప్రపంచ కప్ గెలిచిన పురుషుల, మహిళల జట్లలో సభ్యులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి పంజాబ్‌లో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీ దళ్ బీజేపీ ప్రభుత్వం హామీ ఇవ్వడం.
6 comments:
So, Sad. They surely got talent .... Wish these people all the best.
మన దేశంలో క్రికెట్ మినహా ప్రతి ఆటకు ఇలాంటి దుర్ఘతి తప్పడంలేదు. ఇటీవల పురుషుల కబడ్డీ జట్టు కూడా వరసగా ప్రపంచ టైటిల్ నిలబెట్టుకుంటు వస్తుంది. కానీ అలాంటి వార్తలు ఎక్కడున్నాయా అని పేపర్లో సైతం వెతుక్కోవలసిందే.
cricket thappa manavallaku edi pattadu. ilantivi jariginappudu kooda kaneesam siggu padarau, paddathi marchukoru.
పుణ్యం కట్టుకున్న ఆటోలు.
పాపం చేసుకున్న క్రీడాకారులు
నిదుర పోయిన టీం మేనేజ్మెంటు
డబ్బు మజా ప్లాజా
శిరోమణీ ఉద్యోగం హామీ కొంతలో కొంత రిలీఫ్
దేశమా, కాస్త నిదానిమ్చుమా, ఆలోచిన్చుమా !
ఆట ఏదైనా కానివ్వండి ప్రపంచ ఛాంపియన్లు అలా కప్ పట్టుకొని వీధుల్లో నించోవడం మన దేశంలో తప్ప మరెక్కడా చూడమేమో?
క్రికెటర్లకైతే కోట్లాది రూపాయలు అపాత్రదానం చేసేస్తారు కదా.
Post a Comment