మొత్తానికి సంవత్సర కాలం ఊరించి సచిన్ టెండూల్కర్ వందో శతకాన్ని పూర్తి చేశాడు. దేశమంతా కేరింతలు కొట్టినట్టే నా ఫ్రెండ్, సచిన్ వీరాభిమాని ఒకడు కూడా పొంగిపోయాడు. తన ఫేస్ బుక్‌లో వాడు పెట్టిన కామెంట్ ఇది.
hip hip hurry the one nd only cricket legend won tat nd the one nd only master of records nd the one nd only real hero of 100 centurys nd its amazing the one nd only sachin tendulkar great great great nd great greatttttttttttttttttttttttttt
జట్టు ఓడిపోయాక సెంచరీ కొట్టి ఏం లాభం బాబూ అని అడిగాను ఫోన్ చేసి.
ఇదేం మామూలు సెంచరీనా, ఇలాంటి అపురూపమైన సెంచరీ కోసం ఎన్ని మ్యాచ్‌లు ఓడిపోతేనేం. ఇంతకాలం జట్టుకి సేవ చేసిన కోసం జట్టు ఆమాత్రం త్యాగం చేయకపోతే ఎలా అని లాజిక్ లాగాడు.
నాకు అంగీకరించాలనిపించలేదు. మీరేమంటారు?
3 comments:
క్రికెట్ గురించి నేను మాట్లాడటానికి పూర్తిగా అనర్హుడిని
ఎందుకంటే నేను చూడను
సచిన్ రిటైర్ అయ్యేలోపు మా అబ్బాయిని క్రికెట్ ప్లేయర్ చెయ్యాలి
ఇప్పుడు మావాడికి రెండేళ్ళు :))
https://plus.google.com/u/0/100449938906601128648/posts/KvwRUG8cHQ4
ఈ ఫోటో చూడండి :))
కృష్ణ గారు,ఆటలలో గెలుపోటములు సహజం. కాని ఇది అసహజమైనది.ఈ మైలురాయి నిజంగానే ఆసహజమైనది
అసమాన్యమైనది.99 సెంచురీస్ వెనుక 22 సం.అకుంటిత దీక్షా,పట్టుదల,హుందాతనము,నిబ్బరము,సిన్సియారిటీదాగున్నాయి.ఇది ఎవరూ కాదనలేని సత్యం.మీ పోస్టింగ్స్ ని
నేను ఎంతో అప్రిసియేట్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తుంటాను.కాని ఈ విషయంలో మాత్రం మిమ్ములను విమర్శిస్తున్నాను.ప్రతి విషయాన్ని విమర్శించాలనే ధ్యేయము పెట్టుకున్న మీరు మంచి విషయాలను కూడా ప్రసంశించడం నేర్చుకోవాలి.
Yes. You are right, Hari.
Post a Comment