నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, May 31, 2012

చదరంగపు రారాజుకి జేజేలు


 లైట్నింగ్ కిడ్‌గా పేరు గాంచిన విశ్వనాధన్ ఆనంద్ తనని అలా ఎందుకు పిలుస్తారో మరోసారి ప్రపంచానికి చూపించాడు. బోరిస్ గెల్ఫాండ్‌తో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలో రెగ్యులర్ ఫార్మాట్‌లో జరిగిన పన్నెండు గేమ్‌లూ సరిసమానంగా ముగిశాక నాలుగు రాపిడ్ గేమ్‌లలో చాంపియన్‌షిప్ తేలుతుంది అనగానే ఆనంద్ అభిమానులు ఇక చాంపియన్షిప్ ఆనంద్‌కే అని డిసైడై పోయారు. వేగంగా ఎత్తులు వేయడంలో సిద్ధహస్తుడైన ఆనంద్ మామూలు గేమ్‌లని కూడా వేగంగా అడుతుంటాడు. కాబట్టి ఇక ఆనందే విజేత అని ఆయన అభిమానులు అనుకున్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ఆనంద్ విజేతగా నిలిచాడు.
  
అయితే ఆనంద్ మీద రష్యన్ చెస్ మాఫియా ఈ మ్యాచ్ మొదలయినప్పటినుండీ విషాన్ని చిమ్ముతూనే ఉంది. ఆనంద్‌లో మోటివేషన్ తగ్గిందనీ, మునుపటిలా ఎత్తులు వేయలేకపోతున్నాడని, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బోరిస్ గెల్ఫాండ్ ఆనంద్‌ని ఖంగు తినిపిస్తాడని అంటూ వచ్చారు. చివరికి పూర్వపు చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ కూడా ఇదే పల్లవి వినిపించాడు. కార్పోవ్, కాస్పరోవ్‌ల తరువాత రష్యన్ అధిపత్యానికి గండి కొట్టి చదరంగంలో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న ఆనంద్ పైన రష్యన్ చదరంగం అధికారులకీ, వ్యాఖ్యాతలకీ కడుపుమంట కొత్తేమీ కాదు. కార్పోవ్, కాస్పరోవ్‌ల తరువాత ఆ స్థాయి ఆటగాడని వాళ్ళు డబ్బా కొట్టిన మరొక బిగ్ K, వ్లాదిమిర్ క్రామ్నిక్ ఆనంద్ చేతిలో పరాజయం పాలయ్యాక ఈ కడుపు మంట మరింత ఎక్కువయింది గానీ తగ్గ లేదు.
 
అయితే నిజమైన చాంపియన్లు వయసు వచ్చే కొద్దీ కొంచెం నిదానం అవ్వవచ్చేమో గానీ వారిలో ఆ మెరుపు ఎక్కడికీ పోదని తన వందవ సెంచరీతో నిరూపించిన సచిన్ టెండూల్కర్‌లాగా విషీ ఆనంద్ చదరంగంలో మరొక సారి చూపించాడు.


ఆయన మరెన్నో విజయాలు సాధించి, ఇప్పుడు నాలుగవ స్థానంలో ఉన్న తన రేటింగ్‌ని మెరుగు పరుచుకొని మొదటి స్థానంలో నిలవాలని ఈ బ్లాగ్ ఆకాంక్షిస్తోంది.

3 comments:

Mohan said...

Congrats to the King.

sree said...

Good one. by the way, if you want to play online chess with real people for free (and is turn based so you can make your move when you have free time), you can register at chess.com.

I am playing on it for almost a year.

anrd said...

మీ బ్లాగ్ ద్వారా నేను కూడా ఆనంద్ గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి.