రాజ శేఖర్ రెడ్డి చనిపోయినప్పటినుంచీ సాక్షి పత్రికకి ప్రభుత్వంలో అసమర్ధతా, అవినీతి బాగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ రామ రాజ్యంలో, స్వర్ణ యుగంలో సుఖ సంతోషాలతో జీవిస్తున్న ప్రజలు ఒక్క సారిగా కష్టాల కడలిలో పడి పోయినట్లు ఒక ఫీలింగ్ కలుగుతుంది ఆ పత్రిక చదివే వారికి.
రెండు రోజుల క్రితం ఆరోగ్యశ్రీ గురించి అందులో ఒక వార్త వచ్చింది. ఈ పథకం కింద హాస్పిటల్స్‌లో చేరిన రోగులకి శస్త్ర చికిత్సల కోసం అనుమతి రావడం బాగా ఆలస్యం అవుతూ ఉందని, రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తూ ఉందని ఆ వార్త సారాంశం. ఈ పథకంలో కొన్ని మార్పులు చేయడమే అందుకు కారణం అని అందులో రాశారు.
అది నిజమా కాదా అని నెల్లూరులో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేసే నా మిత్రుడయిన ఒక ఎముకల డాక్టరుకి ఫోన్ చేశాను. అతను చెప్పిన విషయం ఈ వార్తకి పూర్తి విరుద్ధంగా ఉంది. ఆపరేషన్లకి సమ్బంధించి హాస్పిటల్స్‌కి డబ్బులు చెల్లించడంలో బాగా ఆలస్యం అవుతుంది కానీ, అనుమతుల విషయంలో మాత్రం ఆలస్యం ఏమీ లేదు అని ఒక ఉదాహరణ చెప్పాడు. తుంటి కీలు విరిగిన ఇద్దరు పేషంట్లని ఈ ఆదివారం మధ్యాహ్నం హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే వారికి ఆపరేషన్‌కి అనుమతి సోమవారం సాయత్రం కల్లా వచ్చేసింది అని అతను చెప్పాడు.
7 comments:
౨౨ ఏళ్ళ ఆడవారు నడుము నొప్పి అని వెళ్తే లామినెక్టమి లాంటి ఆపరేషన్ చేసి పారేస్తున్నారు ఆరోగ్యశ్రీ లో డబ్బులు గవర్నమెంట్ చెల్లిస్తుందన్న ధీమాతో..అందువల్ల కొంత వడపోత జరుగుతూ ఉండొచ్చు..మేలు కంటే హాని ఎక్కువ జరుగుతోంది అనవసరమైన ఆపరేషన్ల వల్ల ...వాటి బారిన పడ్ద వాళ్ళు దీర్ఘ కాల రోగులుగా మారిపోతున్నారు
పల్లెటూర్లలో ఎక్కువ మంది మలేరియా, ఫైలేరియా, డెంగీ లాంటి వ్యాధులతో చనిపోతోంటే కేవలం గుండె జబ్బులు, మోకాలు నొప్పులకి చికిత్స చేసే ఆరోగ్యశ్రీ పథకం చూసి పల్లె ప్రజలు నిజంగా వోట్లు వేస్తారా?
ప్రతి జబ్బుకీ ఆరోగ్య శ్రీ కార్డ్ పట్టుకుని వస్తున్నారు...పని చేయదని తెలిసి చేతి డబ్బులు పెట్టుకుంటున్నారు..పధకం జనాల్లో దేముడిచ్చిన వరంగా పాపులర్ అయింది..డౌట్ లేదు..
మందులతో తగ్గే అవకాశం ఉన్న మలేరియాకే పల్లెటూర్లలో మందులు దొరకడం లేదు. మందులే దొరకనివాళ్ళు నిజంగా ఆపరేషన్‌ల గురించి ఆలోచిస్తారా?
అవసరముందో లేదో తెలియక పోయినా ఉచితంగా వస్తుంది కదా అని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఆలోచించగలిగిన వాళ్ళు చెప్తున్నది కంఠ శోషగా మిగిలిపోతున్నది.
విశాఖపట్నం జిల్లాలో ఒక గిరిజనుడికి ఆంథ్రాక్స్ వచ్చింది. అది గుండె జబ్బు కంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి. కానీ ఆ వ్యాధి ఆరోగ్యశ్రీ పరధిలోకి రాదు. ఆ గిరిజనుడికి ఉనికి లేని దేవుడే దిక్కు.
ప్రవీణ్, నక్కవానిపాలెం, సీతమ్మధార, విశాఖపట్నం
ఈ లింక్ చదవండి: http://namastheamerica.com/?p=18665
Post a Comment