మన శరీరంలో ప్రతి అవయవానికీ ఒక నిర్దిష్టమైన పని ఉంటుంది. మనల్ని దేవుడు పుట్టించాడని నమ్మే వాళ్ళు, లేక డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఇద్దరూ ఒప్పుకొనే మాట ఇది. స్త్రీలలో వక్షోజాలుపాత్ర బిడ్డలకి పాలివ్వడం. మానవుల కన్నా పరిణామ క్రమంలో కింద ఉన్న జంతువులు ఈ పనిని నిర్వహిస్తూ ఉంటే ఉన్నత స్థానంలో ఉన్న మానవులు ఇటీవల దీనిని విస్మరిస్తూ ఉన్నారు. స్త్రీల రొమ్ములని పాలిచ్చే అవయవంగా కాక ఒక లైంగిక వస్తువుగా, సుఖాన్నిచ్చే సాధనంగా మార్చి వేస్తున్నారు.
రొమ్ములు చిన్నవిగా ఉన్నవాళ్ళు సిలికాన్ ఇంప్లాంట్స్‌తో ఆపరేషన్ ద్వారా వాటిని పెద్దవి చేసుకోవడం, బిగి సడలి జారిపోయాయి అనికున్నవాళ్ళు mastopexy అన్న ఆపరేషన్‌తో వక్షోజాలు రూపు మార్చుకోవడం ఇందులో భాగమే. అయితే రొమ్ములు కప్పుకోవడం తెలియని నాగరికత పూర్తిగా నెర్చుకోని తెగల్లోని వారు రొమ్ములని కేవలం పిల్లలలి పాలిచ్చే భాగాలుగా మాత్రమే చూస్తారని, వాళ్లకి అవి శృంగార సాధనాలు అన్న భావన ఉండదని శాస్త్రవేత్తలు చెబుతారు,
సినిమాలలో, మోడలింగ్‌లో రొమ్ములని చూపిస్తూ వాటికి sex objects ముద్ర వేస్తున్నారు. మగవారు చేసే ఈ పనికి ఆడవారు కూడా సహకరిస్తూ తమని తాము sex objects గా మార్చుకుంటున్నారు. అందులో భాగంగా బిడ్డలకి పాలివ్వడం తమ పాలిండ్ల సౌందర్యాన్ని పాడు చేస్తుందన్న అపోహ. రొమ్ముల బిగి సడలిపోతుందని సినిమా స్టార్లు, మోడల్సే కాక చాలా మంది ఆడవాళ్ళు పిల్లలకి తల్లిపాలు దూరం చేస్తున్నారు. చంటి బిడ్డలకి తల్లిపాలు ఆరోగ్యంతో బాటు రోగ నిరోధక శక్తి కూడా ఇస్తుందని డాక్టరు చెబుతున్నా వీరికి ఎక్కడం లేదు. ఇప్పుడు ఇలాంటి వారి కళ్ళు తెరిపించే నిజం మరొకటి నిపుణులు తెలుసుకున్నారు.
పిల్లలకి పాలివ్వడం ద్వారా తల్లికి రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కలిగించే కొన్ని రకాల హార్మోన్లు తగ్గిపోయి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉండదనీ, అలాగే రొమ్ముల్లో DNA లో మార్పు వచ్చిన కణాలు పాలివ్వడం ద్వారా తగ్గిపోతాయనీ, ఇలాంటి కణాలే ఉత్తరోత్తరా కేన్సర్ కలిగిస్తాయనీ, ఇవి తగ్గి పోవడం ద్వారా కేన్సర్ ప్రమాదం కూడా తగ్గిపోతుందనీ నిపుణులు చెబ్తున్నారు.
సిలికాన్ రొమ్ములతో కుర్రకారుని పిచ్చెక్కించిన బేవాచ్ స్టార్ పమేలా అండర్సన్, హాలీవుడ్ అందగత్తెలు సిండీ క్రాఫోర్డ్, డెమీ మూర్, సింగర్ సెలీన్ డియోన్ లంటి వాళ్లందరూ తమ పిల్లలకి తామే పాలిచ్చారు. తరువాత్తరువాత వెండి తెర మీద తమ బిగి సడలని వక్ష సౌందర్యాలని చూపించారు కూడా.
4 comments:
ఎంతో శ్రమకోర్చి చాలా చక్కటి సమాచారం, మంచి చిత్రాలతో సహా అందించారు. మీకు ధన్యవాదాలు.
వక్షాలు కాదు. వక్షోజాలు.
Vaksham means chest and vakshojam means part on the chest (breast).
తప్పు దిద్దినందుకు దన్యవాదాలు.అలాగే పోస్ట్ నచ్చినందుకు ఎనోనిమస్ గారికి కూడా.
Post a Comment