భర్త అంటే భరించేవాడు అని అర్థం. దీనిని నిజం చేయడానికా అన్నట్లు ఫిన్‌లాండ్‌లో భార్యల్ని మోయడంలో పోటీలు నిర్వహిస్తారు. Wife carrying championships అని పిలిచే ఈ పోటీలలో ఖచ్చితంగా భార్యల్నే మోయాలి అని ఏమీ లెదు. 49 కిలోలకన్నా ఎక్కువ బరువు ఉన్న అమ్మాయి ఎవరయినా సరే భార్య కింద లెక్క. అలాంటి అమ్మాయి ఎవరినయిన మోస్తూ 253.5 మీటర్ల దూరం పరుగెత్తి ఈ పోటీలలో నెగ్గవచ్చు. ఇందులో గెలిచిన వారికి అమ్మాయి బరువు బీర్. అంతకు అయిదు రెట్లు కాష్ బహుమతిగా ఇస్తారు.ఈ పోటీలలో మధ్యలో రెండు చోట్ల హర్డిల్స్, ఒక చోట మీటరు లోతున్న నీటి గుంట ఉంటాయి. భార్యని పడేయకుండా ఈ అడ్డంకులు దాటాల్సి ఉంటుంది.
ఫిన్‌లాండ్‌లో ఒకప్పుడు పెళ్ళికాని యువకులు ఊర్ల మీద పడి కంటికి నదురుగా కనిపించిన అమ్మాయిని భుజాల మీద వేసుకుని ఎత్తుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకొనేవారట. అదే కాలక్రమేణా పెళ్ళాల్ని మోసే పోటీగా మారింది అని అంటారు. ఈ పోటీలో పెళ్ళాన్ని వీపు మీద వేసుకొని కానీ, ఒక భుజం మీద వేసుకుని కానీ మోస్తారు. అయితే బహుమతి పొందినవారిలో ఎక్కువమంది ఉపయోగించేది ఎస్టోనియన్ టెక్నిక్. ఇందులో అమ్మాయిని తలకిందులుగా వీపుమీద వేసుకుంటారు.
ఎస్టోనియన్ టెక్నిక్
ఇప్పుడిప్పుడే ఈ పోటీలు ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి అక్టోబర్ నెలలో అమెరికాలోని మెయిన్‌లో కూడా ఈ పోటీలు పెడుతారు. ఎకోరన్ ఇండియా అన్న సంస్థ జనవరి 1,2011న భార్యా సమేతం అన్న పేరుతో ఈ పోటీని కేరళలోని త్రివేండ్రంలో నిర్వహించింది.
No comments:
Post a Comment