నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, December 3, 2012

శభాష్ కిరణ్ కుమార్ రెడ్డి


హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా చాలాకాలంగా సాగుతూ వస్తుంది. రాష్ట్రంలో మైనారిటీ ఓట్లన్నీ వీళ్ళ కనుసన్నల్లో ఉంటాయన్న తప్పుడు అభిప్రాయంతో పాలకులు  వీరి అడుగులకు మడుగులు ఒత్తారు. కాంగ్రెస్ పార్టీ దీనిని ఎక్కువగా చేసింది. ఇక రాజ శేఖర్ రెడ్డి సీఎం అయ్యాక వీరికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎన్ని కబ్జాలు చేసినా దందాలు చేసినా ఏమీ అనకుండా చట్టాన్ని, న్యాయ వ్యవస్థనీ అదుపు చేశారు పాలకులు.
   
తస్లీమా నస్రీన్‌ని టీవీ కెమెరాల సాక్షిగా దాడి చేసి గాయపరచినా, గత ఎన్నికల సమయంలో సాక్షాత్తూ ఎంపీ అయి ఉండి చేతిలో కర్ర పట్టుకొని పోలింగ్ బూత్ వద్ద తమకు వ్యతిరేకంగా ఓట్లేస్తారేమో అన్న అనుమానంతో ఓటర్లని అసదుద్దీన్ ఒవైసీ చితక బాదడం అన్ని చానళ్ళ కెమెరాలు చూపించినా ఏమీ పీకలేకపోయారు.
 
ఇప్పుడు కనీసం కొన్నాళ్ళ వరకూ అయినా ఈ దురవస్థకు అడ్డుకట్ట పడిందేమో అనిపిస్తోంది ఆది వారం శాసన సభలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌కి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికీ నడుమ సాగిన వాగ్వాదాన్ని పరిశీలిస్తే. ఎలాగూ వాళ్ళు తమ జట్టు వదిలి జగన్ చంకనెక్కడానికి సిద్ధం అయిపోయారని తెలిసి పోయింది కాబట్టి, ఊడిపోయినదానికోసం పాకులాడ్డం ఎందుకు అనుకున్నాడేమో కిరణ్ మాటకు మాట బదులిచ్చాడు.

రేపు జగన్ పక్షాన బరిలోకి దిగి అధికారం చేపట్టి మళ్ళీ తమ హవా కొనసగించే అవకాశం ఉన్నా కనీసం అంత వరకూ అయినా ఈ ఎంఐఎం ఆగడాలకు చెక్ పడుతుందేమో చూడాలి.

1 comment:

Anonymous said...

okka bjp tappa yevaru vari aagadalanu addukoleru.ysr kanisam varu maddathiu isthunnaduna vari aagadalaku vatthasu palikaru,.. babu mari ghoram varu tidutunnaa varike maddathu istharu