నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, December 23, 2012

మూర్ఖత్వం రాక్షసత్వం కలగలిసిన నేల


పాకిస్తాన్‌లోని కరాచికి ఉత్తరాన దాడు జిల్లాలోని సీట గ్రామంలోని ఒక మసీదులో ఈ గురువారం ఉదయాన ప్రార్ధనలకోసం వచ్చిన వారికి ఖురాన్‌లోని కొన్ని కాగితాలు తగలబడి కనిపించాయి. మరెక్కడయినా అయితే అది అంతగా చెప్పుకోవలసిన విషయం కాదు కానీ పాకిస్తాన్‌లో దైవ దూషణ(Blasphemy) చట్తం ప్రకారం అది చాలా పెద్ద నేరం. ఆ రాత్రి ఆ మసీదులో ఒక యాత్రికుడు విశ్రాంతి తీసుకున్నాడు. అతను తప్ప మరెవ్వరూ ఆ మసీదులో లేరని ఆ మసీదు ఇమామ్ చెప్పాడు. దానితో అక్కడ గుమి కూడిన ప్రజలు అతన్ని తీసుకెళ్ళి పోలీసు స్టేషనులో అప్పగించారు. ఎక్కడయినా నాగరిక సమాజంలో ఇక్కడితో ఆ జనం బాధ్యత ముగిసి పోలీసుల విచారణ మొదలవుతుంది. 
 
అయితే అది పాకిస్తాన్. రాతియుగం మనుషులు నాగరికులుగా చెలామణి అవుతున్న నేల. పోలీసు స్టేషన్‌లో ఆ మనిషిని అప్పగించిన కొన్ని గంటల్లోనే అక్కడ ఒక గుంపు చేరి అతన్ని బయటకి లాక్కు వచ్చి కొట్టి చంపారు. ఆ పైన పెట్రోలు పోసి కాల్చి చంపారు. ఇదంతా అతను ఖురాన్‌ని కాల్చి ఉంటాడేమోనన్న అనుమానంతోనే. నిజంగా కాల్చడం ఎవరూ చూడలేదు.

పాకిస్తాన్‌లో దైవ దూషణ(Blasphemy) చట్టాలు చాలా అనాగరిక మైనవి. ఆ మధ్య డౌన్ సిండ్రోమ్‌ వల్ల బుద్ధి మాంద్యంతో బాధ పడుతున్న రింషా మాసిహ్ అనే 14 సంవత్సరాల క్రిస్టియన్ అమ్మాయి తన నోట్ బుక్‌లో ఖురాన్ గురించి రాసిన కాగితాలని చింపి వేసిందని పొరుగున ఒక మత పెద్ద కేసు పెడితే ఆ బాలికని జైలులో పెట్టారు. అయితే తరువాత కేసు పెట్టిన పెద్దే ఆ పని చేశాడని, తమ కాలనీ నుంచి క్రిస్టియన్స్ అందరినీ తరిమి వేయడానికె అతను ఆ పని చేశాడని వెల్లదయి ఆ కేసు కొట్టేశారు. అయితే నేటికీ ఆ అమ్మాయి కుటుంబం తమ  మునుపటి నివాసానికి పోవడానికి భయపడుతోంది. "అక్కడికి పోతె మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు" అంటారు వాళ్ళు. అది నిజమని అధికారులకి కూడా తెలుసు. అయినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

దాదాపు అన్ని ఇలాంటి కేసుల్లో దైవ దూషణ అభియోగం మోపబడ్డ వారికి, ఆ అభియోగం మోపిన వారికీ గతంలో గొడవలు ఉంటాయి. ఆ నెపం మీద తమకు కోపం ఉన్న వారి మీద ఈ అభియోగాలు మోపి వారు శిక్షకు గురయ్యేలా చేస్తారు. లేదంటే ఈ చట్టం కింద నేరం మోపబడే మరొక తరగతి క్రిస్టియన్లు. ఎవరయినా తమ ప్రాంతంలో ఉండే క్రిస్టియన్లు అక్కడి నుంచి పారిపోయేలా చేయడానికి ఈ చట్టాన్ని వాడుకుంటారు.

బ్రిటీషు వారి కాలంలో మత కలహాలు రాకుండా చూడడానికి పెట్టిన ఈ చట్టం స్వాతంత్ర్యం తరువాత భారత దేశంలో తీసివేయబడ్డా పాకిస్తాన్‌లో కొనసాగింది. జియా ఉల్ హక్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఈ చట్టానికి మరింత పదును పెట్టి అమానుషంగా తయారు చేశాడు. ఆ తరువాత కాలంలో క్రమేపీ ఇది మరింత భయంకరంగా తయారయింది. 

గతంలో ఈ చట్టం మీద విమర్శలు చేసినందుకు  పంజాబ్(పాకిస్తాన్ లోనిది) గవర్నర్ సల్మాన్ తసీర్‌ని ఆయన వ్యక్తిగత అంగ రక్షకుడు కాల్చి చంపాడు. ఆ తరువాత రెండు నెలలకి ఇదే విషయమ్ మీద పాకిస్తాన్ మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్న షాబాజ్ భట్టి అనే క్రిస్టియన్ కూడా హత్యకి గురయ్యాడు. కొంచెం ఆలోచించే వారిని భయపెట్టే సంగతి ఏమిటంటే ఈ రెండు హత్యలు చేసిన వారిని ఆ ప్రజలు హీరోలుగా చూడడం.

10 comments:

Anonymous said...

what a title!

కాయ said...

కాల్చి చంపే వాళ్ళకి, కొట్టి చంపే వాళ్ళకి తేడా ఎంత ఉందంటారు చెప్పు, దండల కృష్ణ గారు ?

Anonymous said...

@ కాయ గారు
ఇక్కడ తేడాలు, తప్పులు ఎంచాల్సింది శిక్ష అమలు పరిచేవాళ్ళను కాదు, హేయమైన తప్పు చేసిన వాళ్ళను. తప్పే చేయకపోతే శిక్షించాల్సిన అవసరమే వుండదు. అతితెలివి ప్రదర్శించి అడ్డదిడ్డంగా వాదిస్తే శిక్ష మరింత పెరిగే అవకాశం వుంది

కాయ said...

http://pooladebbalu.blogspot.com/2012/12/blog-post.html

కాయ said...

నా ప్రశ్న కృష్ణ గారికి మాత్రమే అనామకులు గారు. ఇంతకు ముందు టపా లో ఈయన ఢిల్లీ అత్యాచారపు క్రిమినల్స్ ని కాల్చి పారేయాలి అన్నారు. ఆ తదుపరి టపా లోనే పాకిస్థాన్ లో ఇలా చేస్తున్నారు అని వాపోతున్నారు.

Anonymous said...

పాకీస్‌కి మనకీ తేడాలేదేంటి? ఇద్దరూ ఒకేసారి, ఒకేలా ప్రవర్తిస్తే ఎలా? భలే కాయలా వున్నారే.

good catch

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అభం శుభం తెలియని ఓ అమ్మాయిని దాఋణంగా సామూహిక అత్యాచారం జరిపి కౄరంగా హింసించడానికి, మసీదులో ఖురాన్ కాలిపోతే అది ఆ రాత్రి అక్కడ పడుకున్న యాత్రికుడే చేశాడని అభియోగం మోపబడడానికీ తేడా లేదంటారా కాయ గారూ? రెండు నేరాలు మీకు ఒకే లాగా కనిపిస్తే నేనేం చేయలేను.

కాయ said...

అయ్యో.. అలాగంటారు. నేనేమీ ఏది పెద్ద నేరమో, ఏది కౄరమైన నేరమో విశేషణాలు ఉపయోగించి చెప్పలేదు. భారత దేశంలో జరిగిన మొట్ట మొదటి అత్యాచారమా మొన్నటిది ? లేక పాకీస్ చెసిన మొదటి మృత్యుకాండ నా మీరు చూపింది ?

కాంపిటెన్సు, అభివృద్ది పేరిట వినాశనం వైపు తీసుకెళ్తుంటే ఇలాంటివి జరిగి మీ లాంటి వాళ్ళను ఒకటీ రెండు రోజులు నిద్ర లేపుతాయి.
(పారదర్శకత లేని అభివృద్ధి, ప్రాక్టికల్ అనుభవం లేని కాంపెటెన్సూ ఎక్కడికి తీసుకెళ్తాయి ?)

కాయ said...

హింస ఎక్కడైనా ఖండించతగినవే. మనం చేస్తే రైటు వాళ్ళు చేస్తే తప్పు ఎలా ?
ఎమోషనల్ కాకుండా ఆ అంశాలనుంచి కొద్ది సేపు బయటకొచ్చి చూడండి. నిద్ర లో ఉన్నవాళ్ళు చేసేవన్నీ తప్పులే, సరైన ఫలితం ఇచ్చినా సరే, వాళ్ళు చేసింది తప్పు కారణాల కోసం. వాళ్ళకి సరైన కారణాలు తెలిసి ఉంటే వాళ్ళు నిద్ర లో ఉండరు.

నిద్ర లో ఉన్న జేపీ అయినా, చిన జీయర్, పరిపూర్ణానంద స్వామి లాంటి వారైనా, మీరైనా.
ఎందుకంటే మీరు ఒక స్టాండ్ తీస్కుంటున్నారు. ఈ చర్యల మూల కారణాలు చూసే ప్రజ్ఞ రాలేదు ఇంకా.. నిద్ర లో నడుస్తున్నారు..

ఎవరైనా (ముఖ్యంగా మీడియా) ఎగదోస్తే ఎగిసి పడడం, పండగొస్తే మర్చిపోవడం...

Anonymous said...

>>హింస ఎక్కడైనా ఖండించతగినవే.

మన్మోహన్ సింగ్ పేపర్ మీద రాసుకుని చదివిన ప్రకటనలా వుంది, కాయ గారి ప్రసంగం