1922లో లార్డ్ హోవార్డ్ కార్టర్ టుటాన్‌ఖామున్ పిరమిడ్‌లోని మమ్మీని పెట్టిన శవపేటికని తెరిచినప్పుడు చాలామంది ఆ మమ్మీని తెరిస్తే ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందని, ఆ మమ్మీ తన శాపాన్ని ఆ తెరిచిన వారిమీద ప్రయోగిస్తుందని భయపెట్టినా ఆ పురావస్తు శాస్త్రవేత్త భయపడలేదు. అయితే ఆయనకి ఏమీ కాకపోయినా ఆయన బృందంలోని కొంతమంది అనూహ్యంగా మరణించడమో ప్రమాదాలకి గురికావడమో జరిగింది. The Curse of Tutankhamun అని దీనిని వర్ణిస్తారు.
అలాగే The Curse of Hope Diamond అని మరొకటి ఉంది. దక్షిణ భారతదేశంలోని ఒక గుడిలో సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసి అందులోనుండి ఈ హోప్ వజ్రాన్ని ఒక ఫ్రెంచి దేశీయుడు తీసుకెళ్ళాడు. దీన్ని ఒక రష్యన్ ప్రభువుకి అమ్మిన కొన్నాళ్ళకే అతన్ని వేట కుక్కలు చంపేశాయి. ఈ వజ్రాన్ని కొన్న ఆ రష్యన్ ప్రభువు కూడా అకాల మరణం పాలయ్యాడు. అటు పిమ్మట దీన్ని చేజిక్కించుకొని తన కిరీటంలో అలంకరించుకొన్న ఫ్రెంచి రాజు పదహారవ లూయీ, అతని భార్య మేరీ అంటోనెట్‌లు ఫ్రెంచి విప్లవంలో గిలొటిన్ ద్వారా దాఋణంగా చంపబడ్డారు.
ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇలాంటిదే The Curse of Jagan Mohan Reddy అని ఒకటి నడుస్తుందని జగన్ వీరాభిమాని చెప్పుకొచ్చాడు. అంతే కాదు అందుకు సమర్ధనగా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. మొదటగా జగన్ పైన కేసు వేసిన శంకర్ రావు అత్యంత అవమానకర పరిస్థితుల్లో మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయబడ్డాడు. సాధారణంగా ఎవరినైనా మంత్రివర్గం నుండి తొలగించాలంటే ఆ విషయం చెప్పి వారి చేతనే గౌరవప్రదంగా రాజీనామా చేయించి సాగనంపుతారు. కానీ శంకర్ రావుని సస్పెండ్ చేసి పారేశారు.
తరువాత జగన్ పైన తీవ్ర విమర్శలు చేసి కడప పార్లమెంట్ స్థానానికి జగన్‌తో పోటీ పడ్డ డీఎల్ రవీంద్రా రెడ్డి, మంత్రిగా అధికారంలో ఉండీ డిపాజిట్ దక్కించుకోలేక పోవడమే కాకుండా, తన స్వంత అసెంబ్లీ సెగ్మెంట్‌లో కూడా మెజారిటీ తెచ్చుకోలేకపోయాడు.
ఇక బొత్సా సత్యనారాయణ జగన్ మీద, వైఎస్ విజయమ్మ మీద ఇద్దరి మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. ఆయన మద్యం కుంభకోణంలో ఇరుక్కొని సీఎంతో కాళ్ళ బేరానికొచ్చి బయట పడ్డాడు.
జగన్ మీద కేసు పెట్టిన వారిలో మరొక ముఖ్యమైన వ్యక్తి తెలుగు దేశం నాయకుడు ఎర్రన్నాయుడు కారు ప్రమాదానికి గురయి ఏకంగా ఈ లోకం నుండే సెలవు తీసుకున్నాడు.
జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి, ఆయన పైకి ఒంటికాలి మీద లేచిన మరొక వ్యక్తి నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి. వైఎస్ ఉన్నప్పుడు ఆయనకి వీర విధేయులుగా ఉండేవారు ఆనం సోదరులు. ఆ తరువాత వీరిలో పెద్ద వాడైన సింహపురి సోగ్గాడు వివేకా జగన్ పైన తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశాడు. ఆయన ఇప్పుడు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక కాస్పిటల్‌లో చికిత్స తీసుకొంటున్నారు. వివరాలు బయటకి రాకపోయినా ఎముకలకి చంబంధించిన కాన్సర్ అనీ ఒక వారం రోజుల్లో చికిత్స కోసం విదేశాలకి తరలించే అవకాశం ఉందనీ సమాచారం.
కాబట్టి ఇప్పుడు జగన్ వ్యతిరేకులు జాగ్రత్తగా ఉండాలేమో?!
7 comments:
YSR దిక్కులేని చావు చావడం కూడా జగన్ కాకి దృష్టి పడినందువల్లే అంటారు. వీడో ఐరన్ లెగ్గు గాడండి, రాష్ట్రాన్ని నిప్పులేకుండానే మసి చేయగలడు.
అయితే ఈ curseకి బలయిన వారి లిస్టు వైఎస్‌తో మొదలయింది అంటారు. My mistake.
ఇప్పుడా లిస్టులోకి పైనున్న ఎనానిమస్సు చేరాడు..
అయ్యో, ఈ సింహపురి షోకులరాయుడికి అంత పెద్ద జబ్బు చేసిందా? ఎవరేమన్మా ఈయనది కలర్‌ఫుల్ పర్సనాలిటీ.
అవినీతి ఎంగిలికూడు తిన్న విశ్వాసం ఈ వూర కుక్కలది.
Blah blah! What a joke? Even I will get the so called curse from Jagan. I am his staunch opponent.
Only when you enter into politics.
Post a Comment