అస్తీ, అంతస్తుల తేడాల్లేకుండా, చివరికి పశువులూ, పక్షులు సైతం ఆనందించే సెక్సులో సుఖాన్ని అనుభవించడంలో ఆస్తిక, నాస్తిక తారతమ్యాలున్నాయంటున్నారు నిపుణులు. శృంగారంలోని మజాని ఆస్తికుల కన్నా నాస్తికులే బాగా ఎంజాయ్ చేస్తారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది.
కాన్సాస్ యూనివర్సిటీ డాక్టర్లు 14,500 మందిలో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైన నిజం ఇది. దైవ భక్తి ఎంత ఎక్కువగా ఉంటే వారిలో శృంగారం కలిగించే ఆనందం అంత తక్కువగా ఉంటుందని ఈ సర్వే వెల్లడి చేసింది. ఆ పనిలో ఉన్నప్పుడు, పనయిన తరువాత భక్తులలో ఒక అపరాధ భావన వారికి తెలియకుండానే ఉంటుందని, దాని వలన వీరిలో కలిగే ఆనందం తక్కువగా ఉంటుందని వీళ్ళు తేల్చారు.
అయితే మిగిలిన విషయాలలో, అంటే వారానికి ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటారు అన్న దానిలో కానీ, హస్త ప్రయోగం, ఓరల్ సెక్స్, వివాహేతర సంబంధాలు మొదలయిన వాటిలో పెద్దగా తేడా ఏమో కనిపించక పోయినా sexual guilt మాత్రం దైవ భక్తి ఎక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుందని ఈ సర్వేలో తేల్చారు.
అయితే ఈ సర్వే అంతా వాళ్ళు క్రిస్టియానిటీలోని రకరకాల తెగలపైన చేసింది. హిందూ మతంలో అన్ని విధులతో పాటు పెళ్ళయాక గృహస్థాశ్రమం కూడా ఒక విధిగా చెప్తారు కాబట్టి పెళ్ళాంతో శృంగారం అన్నదాన్ని అపరాధ భావన కలిగించే పనిగా చూడరు కాబట్టి హిందూ మతస్తులు ఈ సర్వేని పట్తించుకోవలసిన అవసరం లేదేమో.
1 comment:
intaku miru nastikula astikula :-)
Post a Comment