మనుషులలో ఎదుగుదల అన్నది ఒక వయసు వరకే ఉంటుంది. ఆ తరువాత వంటి బయట వెంట్రుకలు, వంటి లోపల కొవ్వు తప్ప మరేదీ పెరగదు. అందుకే మీ పిల్లలకి చిన్నప్పుడే కాంప్లాన్ తాగించండి అని ఆ కంపెనీ వాళ్ళు టీవీ ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు.
అమ్మాయిలకి వక్షాలు కూడా ఒక సైజు కన్నా తక్కువ ఉంటే వాటిని పెంచడానికి నానా రకాల ఆపరేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలు లాంటి రంగాలలో ఉన్న వారికి ఈ ఆపరేషన్ ఒక వరం లాటిది. దీని సాయంతోనే బే వాచ్ సుందరి పమేలా ఆండర్సన్ అంత పాపులరయింది. ఆ మధ్య మన దేశంలో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నది ఈ చిన్నది. అవి చిన్నవిగా ఉన్నందుకే తమకి తగిన అవకాశాలు రావడంలేదని కమలినీ ముఖర్జీ, విద్యా బాలన్‌లు కూడా Breast Augmentation వైపు మొగ్గు చూపారని సమాచారం.
భారత జట్టు క్రికెట్ ప్రపంచ కప్పు గెలిస్తే అన్నీ విప్పి చూపింఛాలని ఉబలాటపడ్డ పూనమ్ పాండే face book పేజీ కానీ, ఆమె ట్విట్టర్ పేజీ కానీ చూస్తే పూనమ్ నీవి చిన్నవిగా ఉన్నాయి. ఆపరేషన్ చేసుకుని పెంచుకో, అద్భుతంగా ఉంటావు అన్న కామెంట్లు పుష్కలంగా ఉంటాయి.
కానీ ఏమి చేసినా ఆ పెరుగుదల ఒక స్థాయి వరకే, అంతకు మించి పెరగాలంటే మళ్ళీ ఏ ఆపరేషనో చేసుకోవాల్సిందే. కానీ అమెరికాలో, మిన్నెసోటాలోని చెల్సీ చార్మ్స్ అనే చిన్నదానికి ఆపరేషన్ చేసుకున్నాక ఆమె రెండు వక్షాలు క్రమేపి పెరగడం మొదలు పెట్టి ఆ పెరుగుదల ఆగిపోకుండా నెలకో అంగుళం చొప్పున పెరుగుతూనే ఉన్నాయట. అయితే ఈమె నటించేది బూతు సినిమాలలో కాబట్టి అవి అలా పెరుగుతూనే ఉన్నా ఈమెకి ఇబ్బంది ఏమీ లేదు. హాలీవుడ్ హీరోయిన్లలో అధిక భాగం మందికి అవి చిన్నవిగానే ఉంటాయి. అందుకనే దేవానంద్ తన గైడ్ సినిమాకి హీరోయిన్‌గా ముందు వైజయంతి మాలని అనుకొని, ఆ సినిమా ఇంగ్లీషు వెర్షన్ కూడా ఉండడంతో, పెద్ద బ్రెస్ట్ ఉన్న వైజయంతి మాల కన్నా చిన్నవి ఉన్న వహీదా రెహ్మాన్‌ని ఎంచుకున్నాడు.
ఈ చార్మ్స్ చిన్నది మూడు సార్లు తన రొమ్ములని పెంచే ఆపరేషన్ చేయించుకొన్నదట. మొదటిసారి ఆమె కప్ సైజు DD కి పెరిగి, రెండవసారి HH కి చేరింది. మూడో సారి ఆపరేషన్ అయ్యాక వాటిని కొలవడానికి సైజ్ చార్ట్స్ సరిపోవడం లేదట.
మొదటి రెండు ఆపరేషన్‌లలో సెలైన్ ఎక్కించి రొమ్ములని పెద్దవి చేస్తే, మూడవసారి పాలీప్రొపిలీన్ వాడారట. ఆమెకి ఆ మెటీరియల్ వలన రియాక్షన్ వచ్చి, దానితో లోపల నీరు చేరడం. ఆ నీటిని ఈ పాలీప్రొపిలీన్ గ్రహించి మరింత ఉబ్బడం, దానితో మరింత నీరు చేరడం, మరింత ఉబ్బడం ఇలా ఒక గొలుసు చర్య(chain reaction) మొదలయ్యి, ఆమె వక్షోజాలు నెలకి ఒక అంగుళం చొప్పున పెరుగుతూనే ఉన్నాయట. చాతీకి ముందువైపు ఇలా బరువైన సంపద ఉన్నందువల్ల, వీపునొప్పి మొదలయిందట పాపం ఈ సుందరికి. క్రమబద్ధంగా వ్యాయామం చేస్తూ ఆ నొప్పిని అదుపు చేస్తూందట మన చెల్సీ చార్మ్స్.
వీటి అందాన్ని గుర్తించి అతి పెద్ద వక్షోజాలు అని గిన్నీసు బుక్కు వాళ్ళు రికార్డులక్కూడా ఎక్కించారట. మార్క్ క్విన్ అనే బ్రిటీషు కళాకారుడు ఈమె లైఫ్ సైజు శిల్పాన్ని చెక్కి తన గ్యాలరీలో ప్రదర్శిస్తున్నాడట.
పోయిన వారం ITV అనే ఒక టెలివిజన్ చానల్ వాళ్ళు ఈమెతో ఇంటర్వ్యూ చూపించారు. This morning show అన్న ఆ షోలో యాంకర్‌గా ఫిలిప్ షోఫీల్డ్ అన్న ఒక వెర్రి గాడు, సెట్‌లోకి పుచ్చ పండ్లు తీసుకొచ్చి వాటిని, మన చార్మ్స్ వక్షాలను పోల్చి చూసి, ప్రేక్షకులతో తిట్లు తిన్నాడు. ఇది మార్నింగ్ షో అనుకున్నావా, లేట్ నైట్ షో అనుకున్నావా వెధవా అని ప్రేక్షకులు ఫోన్ చేసి మరీ చీవాట్లేశారు.
అంతలేసి అందాలను మోయటం భారమైపోయి, ఇప్పుడు పాప మళ్ళీ వాటిని తగ్గించుకోవడానికిమళ్ళీ ఆపరేషన్‌కి సిద్ధపడుతూందట. సహజంగా వచ్చిన వాటితో తృప్తి చెందక కృత్రిమంగా సంపాదించుకున్న వాటితో ఇలాంటి తలనొప్పులు కూడా ఉంటాయని ఈ అమ్మడి భాగోతం తెలియజేస్తూంది.
No comments:
Post a Comment