కొంత మందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. వీరు నిద్రలో నడిచేసమయంలో అడ్డంకులు ఎదురయితే వాటిని తప్పించుకుని మరీ నడుస్తారు. కానీ తెల్లవారితె తాము నిద్రలో నడిచిన విషయం వీరికి గుర్తుండదు. నిద్రలో నడిచి హత్యలు చేసినట్లు కోర్టుని నమ్మించి నిర్దోషిగా శిక్షని తప్పించుకున్న థ్రిల్లర్ నవలలు ఎన్నో ఉన్నాయి. ఈ వ్యాధిని సోమ్నాంబులిజం అంటారు.
అలాగే నిద్రలో అమ్మాయితో తమకు తెలియకుండానే శృంగారంలో పాల్గొనే మరొక విచిత్రమయిన వ్యాధి ఉంది. దీని పెరు సెక్స్‌సోమ్నియా. ఈ జబ్బు ఉన్న వారు వారికి తెలియకుండానే తమ పక్కనున్న వారితో శృంగారంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. అది భార్యకానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ అయితే సమస్య లేదు. మరింక ఎవరయినా అయితే ఇబ్బంది. అయినా ఈ ఇద్దరూ కాకుండా ఒక మగవాడి పక్కన ఇంకెవరు పడుకుంటారు.
ఈ మధ్య ఇంగ్లాండులో ఇలాంటిదే ఒక విచిత్రమయిన కేసు కోర్టుకెక్కింది. వేల్స్‌లో ఒక పదహారేళ్ళ అమ్మాయి తన స్టెప్ ఫాదర్ అయిన స్టీఫెన్ లీ డెవిస్ అన్న వ్యక్తి చేతిలో రేప్‌కి గురయింది . ఒక రాత్రి తన గదిలో ఏర్ కండిషనర్ సరిగా పని చేయకపోతే ఆమె డేవీస్ గదిలోకి వెళ్ళి అతని బెడ్ మీద పడుకుంది. నడి రాత్రి వేళ అతను ఆమె మీద పడితే ఆమెకి మెలకువ వచ్చి అరిచింది. కానీ అతను అవేమీ పట్తించుకోకుండా ఆమెని బలవంతంగా అనుభవించాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగి మళ్ళీ బెడ్ రూమ్ లోకి వచ్చి మరోసారి బలవంతంగా ఆమెతో సెక్స్ చేశాడు.
ఆమె అతని మీద కోర్టుకెళ్ళింది. డేవీస్ తనకి నిద్రలో తనకి తెలియకుండానే సెక్స్ చేసే వింత జబ్బు ఉందని చెప్పాడు. అందుకు సాక్ష్యంగా తన భార్య చేత, పాత గర్ల్ ఫ్రెండ్స్ చేత సాక్ష్యం చెప్పించాడు. తాము అతని పక్కన పడుకొని ఉన్నప్పుడు రాత్రి వేళల్లో అతనికి తెలియకుండానే తమతో శృంగారం చేసేవాడని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఎడిన్‌బరో స్లీప్ స్కూల్ డైరెక్టర్ క్రిస్ ఇజికోవ్‌స్కీ కూడా ఈ వ్యాధి ఉన్న వాళ్ళు తమ ప్రమేయం లేకుండానే సెక్స్ చేస్తారని సాక్ష్యం చెప్పడంతో కోర్టు డేవీస్‌ని నిర్దోషిగా విడుదల చేసింది.
అయితే మిన్నెసోటాకి చెందిన మరొక నిపుణుడు మిచెల్ బోర్నెమాన్ ఈ వాదాన్ని ఒప్పుకోవడం లేదు. నిజంగా డేవీస్ సెక్స్‌సోమ్నియాతోనే ఆ అమ్మాయితో శృంగారంలో పాల్గొని ఉంటే వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసుకొని తాగడం ఉండేది కాదని, ఈ చర్య అతను పూర్తి స్పృహలో ఉండి చేసి ఉంటాడని వాదిస్తున్నాడు. కానీ మరికొంతమంది నిపుణులు ఈ వాదనతో ఏకీభవించడం లేదు. తన ఇంట్లో అణువణువూ డేవీస్‌కి పరిచయమ్ కాబట్టి అతను తనకి తెలియకుండానే కాఫీ చేసుకొని తాగి ఉండవచ్చని అంటున్నారు.
ఏది ఏమైనా కోర్టు డేవీస్ చేసిన సెక్స్‌సోమ్నియా వాదనని సమర్ధించి కేసుని కొట్టివేసింది. మనదేశంలో కోర్టులు ఈ జబ్బుని నమ్ముతాయొ లేదో కానీ రేపుల నుంచి తమ క్లయింట్లని తప్పించడానికి లాయర్లకి ఇదొక వాదనగా పనికి రావొచ్చు.
2 comments:
Your analysis of the topic is good, taking it up as an issue is good. But, what was the need to post those pictures?
Frankly, to add a bit of spice. Nothing else.
Post a Comment