నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 29, 2011

వయాగ్రాని కలిపి ఆయుర్వేదం పేరు చెప్పి అమ్ముతున్న కంపెనీలు


నపుంసకత్వం లేదా ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ అన్నది చాలా మగవారిని పీడించే చాలా సాధారణ సమస్య. డయాబెటీస్, అధిక రక్తపోటు లాంటి జబ్బుల వలన కానీ, ధూమ పానం, మద్య పానం లాంటి అలవాట్ల వలన కానీ, టెన్షన్, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యల వలన కానీ ఇది అధిక శాతం మగవారిని వయసుతో సంబంధం లేకుండా పట్టి పీడిస్తూంది. అంగ స్థంభన కలిగించే సిల్డెనఫిల్, తడలాఫిల్, వర్డనాఫిల్ లాంటి మందులకి అనేక మిలియన్ డాలర్ల బిజినెస్ ఉంది. అయితే ఈ మందులు ఎక్కువగా వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భయం కూడా ఉంటుంది. ఈ భయాన్ని ఆయుర్వేద కంపెనీలు బాగా సొమ్ము చేసుకొంటున్నాయి.
 


అంగ స్థంభన కలిగించే అనేక మందులు మార్కెట్లో ఆయుర్వేద మందులుగా లభిస్తున్నాయి. అయితే అధిక శాతం ఆయుర్వేద మందులుగా చలామణి అవుతున్న వాటిలో సిల్డెనాఫిల్ లాంటి అల్లోపతీ మందులు కలిసి ఉంటున్నాయి. గుజరాత్ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు జీవన్ జ్యోతి కంపెనీ తయారు చేసే జోష్, జీవన్ జోష్ అనే మందులో, సన్ లాబొరేటరీ వారి, టైటానిక్ అనే మందులోనూ సిల్డెనాఫిల్ లేదా వయాగ్రా ఉన్నట్లు గుర్తించారు. 
   
హైదరాబాద్ కంపెనీ ఫిజికెమ్ లాబొరేటరీ తయారు చేసే ఓజోమెన్, ఓజోమెన్ ఫోర్ట్ అనే మందులలో కూడా సిల్డెనఫిల్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ముస్లి పవర్ అన్న మందులో కూడా వయాగ్రా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయుర్వేదిక్ మందుల ముసుగులో సిల్డెనఫిల్, తడలాఫిల్ మందులు వాడడం వలన లైసెన్సింగ్ సమస్యలే కాదు, కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా కలగవచ్చు. గుండె పోటు వచ్చి కొన్ని రకాల మందులు వాడే వారు ఈ మందులు తీసుకోకూడదు. అందు చేత ఆయుర్వేదిక్ మందులే కదా, అపాయమేమీ ఉండదు అని ఈ మందులు వాడితే అంతే సంగతులు.

No comments: