నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, July 19, 2011

ఎనర్జీ డ్రింకులు హానికరం. జాగ్రత్త. పేరు చూసి మోసపోవద్దు.

మార్కెట్లో రెడ్ బుల్, బర్న్, క్లౌడ్ 9, మాన్‌స్టర్ ఇలా రకరకాల పేర్లతో ఎనర్జీ డ్రింకులు లభ్యమవుతున్నాయి. వాటి పేరును చూసి అవి తాగిన వెంటనే ఎక్కడ లేని శక్తి వంట్లోకి వచ్చేస్తుందన్న అపోహతో డబ్బు తగలేసి చాలా మంది వాటిని తాగడమే కాకుండా పిల్లలకి కూడా తాగిస్తుంటారు. అయితే అవి ఎనర్జీని ఇచ్చే మాటేమో కానీ ఆరోగ్యానికి హాని మాత్రం చేస్తాయని పరిశోధకులు తేల్చారు.

  
డిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వారి పరిశోధనలో ఈ డ్రింకులలో అధిక శాతంలో కెఫీన్ ఉన్నట్లు తేలింది. ఈ కఫీన్ వల్ల ఆ డ్రింకుల తాగిన కాస్సేపు మనసు ఉల్లాసంగా, ఆహ్లాదంగా అనిపించినా ఈ కెఫీన్ తాగేవారిని ఆ డ్రింకులకి అడిక్ట్ అయ్యేలా చేస్తుంది. అదే పనిగా తాగడం వల్ల కొన్నాళ్ళ తరువాత కెఫీన్ వలన కలిగే హానికర పరిణామాలు బయట పడుతాయి. 

Torso of a young man with overlayed text of main side-effects of caffeine overdose.  
నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం, కడుపులో తిప్పడం, మూత్రం అధికంగా రావడం, మానసిక ఆందోళన లాంటివి ఈ దుష్పరిణామాల్లో కొన్ని మాత్రమే. ఇంకొక విషయమేమిటంటే ఈ ఎనర్జీ డ్రింకులని కొంతమంది స్పోర్ట్స్ డ్రింకులుగా భ్రమపడి ఆటల పోటీలలో పాల్గొనే సమయాల్లో వాడుతుంటారు. అయితే కెఫీన్ కండరాల శక్తిని తగ్గించి వంట్లోని నీటి శాతాన్ని తగ్గిస్తుంది అంటారు పరిశోధకులు.

కాబట్టి బ్రాండ్ నేమ్ చూసి ఈ ఎనర్జీ డ్రింకులు తాగి జేబుకీ, ఆరోగ్యానికీ బొక్క పెట్టుకోవద్దు.

2 comments:

రాజాదిరాజు said...

హమ్మయ్య, ఇన్నాళ్ళకు బూతు బొమ్మలు లేకుండ పనికి వచ్చె ఎకైక పోస్టు మీ కలం నుండి జాలువారింది.

కంటిన్యూ ద ట్రెండ్...

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ నెలలోనే రెండు మూడు పోస్టులు బూతు బొమ్మలు లేకుండా ఉన్నాయి. చూడండి.