నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, September 4, 2011

లోక్‌పాల్ బిల్లుని అటకెక్కించే ప్రయత్నాలు.


మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి లోక్ పాల్ బిల్లు తెచ్చామని అన్నా హజారే తృప్తిగా ఉంటే ఉండొచ్చు కానీ, లోక్‌పాల్ బిల్లుతో తాము దెబ్బ తిన్నామని కేంద్రం ఏమాత్రం ఫీలవనక్కర్లేదు. లోక్‌పాల్ రాకుండా అడ్డుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. 
   


అన్నా హజారే ప్రతిపాదించిన జన లోక్‌పాల్ బిల్లు దళితుల, వెనక బడిన వర్గాల ఆశయాలను ప్రతిబింబించడం లేదని ఉదిత్ రాజ్ అనే మజీ IRS ఆఫీసర్ బహుజన లోక్‌పాల్ కోసం పోరాటం సాగిస్తానని అంటున్నాడు. SC,ST సంఘాల అమాఖ్య ఆధ్వర్యంలో పోరాటం చేస్తానని అంటున్నాడు ఉదిత్ రాజ్. దళితులకూ, వెనకబడిన వర్గాలకు నచ్చని బిల్లు మైనారిటీలకు మాత్రం నచ్చుతుందా? కాబట్టి మైనారిటీ లోక‌పాల్ బిల్లు కోసం కేంద్రమే ఒక కమిటీని వేయాలి. మైనారిటీల్లో అందరి అభిప్రాయాలు, కోర్కెలూ ఒకలాగా ఉండవు కాబట్టి ముస్లిముల కోసం ఒక సబ్ కమిటీ, క్రిస్టియన్ల కోసం మరొక సబ్ కమిటీ వేస్తే ఓ పనయి పోతుంది.
 


అప్పుడు భౌగోళిక పరంగా కూడా అసమ్మతి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కాశ్మీర్ కోసం ఒకటి, ఈశాన్య రాష్ట్రాల కోసం మరొకటి, అడిగితే తమిళ అమ్మ పురచ్చి తలైవి జయలలిత కోర్కె మేరకు తమిళుల ఆకాంక్షలు ప్రతిఫలించేలా లోక్‌పాల్ బిల్లు ఉండడానికి ఇంకో సబ్ కమిటీ ఇలా ఓ పదో ఇరవయ్యో సబ్ కమిటీలు వేసి పారేసి అవన్నీ తమ నివేదికలు ఇచ్చాక వాటిని విశ్లేషించి అవన్నీ కలగలిపి అప్పుడు ఒక సమగ్ర లోక్‌పాల్ బిల్లు తీసుకు వస్తామని చెప్పి ఆ వ్యవహారం మొత్తాన్ని కోల్డ్ స్టోరేజిలో విసిరి పారేయొచ్చు.



2 comments:

Praveen Mandangi said...

అసలు విషయం అది కాదు. లోక్‌పాల్ బిల్ పరధిలో కార్పొరేట్ కంపెనీలు & NGOలు లేవు. అన్నా హజారే కేవలం ప్రభుత్వం, బ్యూరోక్రాట్లనే ఆ బిల్‌లో ప్రతిపాదించాడు. కార్పొరేట్ కంపెనీలు & NGOలు అవినీతి చెయ్యొచ్చు కానీ తాము మాత్రం అవినీతి చెయ్యకూడదు అంటే ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుంది? దళితులు వ్యతిరేకించినా, వ్యతిరేకించకపోయినా ప్రభుత్వం ఎలాగూ ఆ బిల్‌ని అటకెక్కిస్తుంది. అన్నా హజారే రిజర్వేషన్లని వ్యతిరేకించే అరవింద్ కెజ్రివాల్ లాంటివాళ్ళతో కలిసి ఉద్యమం నడిపాడు. అందుకే దళితులు అన్నా హజారేని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ రిజర్వేషన్లని వ్యతిరేకించేవాళ్ళు అన్నా హజారే వెనుక లేకపోతే దళితులు అన్నా హజారేని గుడ్డిగా నమ్మేసేవాళ్ళేమో.

ssr... said...

Naku artham kani vishayam..manushullo maarpu rakunda billulu techi em opayogam andi??A bill techaka ani sariga amalu a vuthundo ledo chudalisindi malli lancham tesukune vale ga!!! Nenu e bill ki vethirekam kadu kani, a bill support chesthuna janalalo entha mandi ika lancham i v adam kani tesukovadam kani cheyatledhu! Edo punakam vachinattu ayina venakala padi povdam kadu ..asalu ayina chesthunadi emiti ,daniki vellu em cheyali annadi okkadanna alochinchada ani doubt.