అమెరికాలో ఆరిజోనా రాష్ట్రంలోని, ఫీనిక్స్‌లో ట్రేసీ ఎలీస్ అనే అమ్మడు గాడ్డెస్ టెంపుల్ (GODDESS TEMPLE) పేరిట గత కొంత కాలంగా ఒక చర్చిని నడుపుతూ ఉంది. ఈ చర్చిలో తనని తాను ఈమె దేవతా మాతగా చెప్పుకొనేది. ఇక్కడ ఉండే మిగతా స్త్రీలందరూ దేవతలే. ఈ విషయాలు ఈ చర్చి అఫీషియల్ వెబ్ సైట్‌లో ఉన్నాయి. స్పిరిచువాలిటీని, సెక్సువాలిటీని ఏకం చేయడం ఈ చర్చి ప్రధాన లక్ష్యం. వీరి కార్యక్రమాలలో నగ్న శిక్షణ, సెక్స్ ఎడ్యుకేషన్, ఆగిపోయిన శృంగార జీవితం మళ్ళీ ప్రవహించేలా చేయటం ప్రధానమయినవి. ఇవి చేయడానికి ఈ చర్చిలొ కొందరు దేవతలు నియమించబడ్డారు. అయితే ఈ సేవలు లేదా ప్రయోజనాలు చేసినందుకు "భక్తుల" వద్దనుంచి వీరు ఫీజు తీసుకోరు. భక్తులు వీరికి కానుకలు సమర్పించుకోవాలి. ఏ సేవకు ఎంత కానుక అనేది వీళ్ళే నిర్ణయిస్తారు ముందుగానే. వీరి వెబ్ సైట్‌లో వీరే చెప్పుకున్నది ఏమంటే, "సెక్స్ పవిత్రమైనది, దివ్యమైనదీను. మన శరీరాలని నయం చేసే శక్తి దానికి ఉంది. ఆ సెక్స్ శక్తిని మనం ఆలింగనం చేసుకొంటే మనకి ఆనందం, శక్తి, విజయం ప్రాప్తిస్తాయి."
ట్రేసీ ఎలీస్‌తో కొందరు దేవతలు
గృహాన్నినడుపుతున్న మేడమ్ ట్రేసీ ఎలీస్
గత రెండేళ్ళుగా సాగుతున్న ఈ చర్చి కార్యకలాపాలను గమనిస్తున్న ఇరుగు పొరుగు వారికి ఇదేదో జమకుజమ లస్కుటపా వ్యవహారమని అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మతానికి సంబంధించిన విషయం కావడంతో పోలీసులు చర్య తీసుకోవడానికి భయపడ్డారు. పౌరులకు మత స్వేచ్చ కలిగిస్తూ అమెరికా రాజ్యాంగానికి సవరణ చేసినప్పటినుంచీ మత పరమైన విషయాలలో పోలీసులు కలగజేసుకోవడానికి అక్కడ కూడా మన దేశంలోలాగే జంకుతున్నారు.
అయితే ఒక స్థానిక పత్రిక ఈ చర్చి గురించి రాయడంతో పోలీసులు కలగజేసుకోకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఒక వెబ్ సైట్‌లో అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఈ ఆలయం గురించి ఒక ప్రకటన వచ్చింది. అందులో ఈ చర్చికి చెందిన అయాటా అనే దేవత ఫోటో అర్ధ/ముప్పావు నగ్నంగా ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆరు నెలలు నిఘా పెట్టి, రహస్యంగా కొందరు పోలీసులని మారు వేషాలలో ఆ చర్చిలోకి పంపి పక్కాగా సాక్ష్యాలు సేకరించిన పోలీసులకి దిమ్మ తిరిగే నిజాలు బయట పడ్డాయి.
అయాటా అనే దేవత
పోలీసుల మాటల్లో చెప్పాలంటే ఇదొక వ్యభిచార గృహం. ఇక్కడ దేవతలు అని చెప్పుకొనే వారంతా వ్యభిచారులు. ఇక్కడ ఉన్న దేవుళ్ళు కొంత మంది బ్రోకర్లు, మిగిలిన వాళ్ళు విటులు. ట్రేసీ ఎలీస్ దేవతా మాత కాదు, వ్యభిచార గృహం నడిపే మేడమ్. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు 30 మంది పైన కేసు నమోదు చేసి అందులో 18 మందిని అరెస్టు చేసి మిగిలిన వారికోసం వెదుకుతున్నారు. ఇదే మేడమ్ ఎలీస్ అరిజోనాలోనే సెడోనా అనే మరో చోట కూడా ఇలాంటిదే మరొక గృహం నడుపుందని తెలిసి దానిమీద కూడా దాడులు జరిపి అక్కడ మరికొంతమంది దేవుళ్లని, దేవతలని అరెస్టు చేశారు.
"చాటు మాటుగా ఇలాంటి కొంపలు నడిపే వారిని చాలా మందిని చూశాం కానీ ఇలా మతం, చర్చి ముసుగులో వ్యభిచారం నడపడాన్ని చూడడం మాకిదే మొదటి సారి. ఎవరికీ అనుమానం రాకుండా చాలా తెలివిగా నడుపుతున్నారు వీళ్ళు. సెక్స్‌ని వీళ్ళు పవిత్ర కలయిక అని, విటులని భక్తులు అని, విటులిచ్చే డబ్బుని నైవేద్యం అని కోడ్ పెట్టుకున్నారు" అని చెప్పాడు ఫీనిక్స్ పోలీస్ ప్రతినిధి స్టీవ్ మార్టోస్.
తరువాత తెలిసిందేమంటే ఈ ట్రేసీ ఎలీస్‌కి గతంలో సీటెల్‌లో కూడా ఒక బ్రోతల్ నడిపి పట్టుపడ్డ చరిత్ర ఉందని. ఒకసారి పోలీసులకి చిక్కిన అనుభవంతో ఈ సారి పక్కాగా ఎవరికీ దొరక్కుండా ఉండడానికి చర్చి ముసుగులో కంపెనీ పెట్టి కూడా దొరికిపోయింది.పాపం.
3 comments:
kalikalam boss
Yes. You are right.
mana babalu babylu chese daanikanna idi chala manchi pani
Post a Comment