రాహుల్ గాంధీ గారూ,
తమరి పేరులో ఉన్న గాంధీ అనే తోకని చూసి, నాయనమ్మని, ఆమె నాన్నని చూసి జనం కళ్ళు మూసుకుని గుంపులు గుంపులుగా ఓట్లు గుద్దే రోజులు పోయాయి. ఈ సంగతి మీకు నేను చెప్పాల్సిన పని లేదు. గతంలో చాలా సార్లు, నిన్న యూపీ ఎన్నికల్లోనూ ఫలితాలు చూశాక ఈ విషయం మీకు కొట్టొచ్చినట్లు, మొహం మీద తన్నొచ్చినట్లు తెలిసి ఉంటుంది. సోదరితో, బావతో కలిసి వెళ్ళి ప్రచారం చేసినా అమేధీలో, రాయ్ బరేలీలో ప్రజలూ కూడా ఓట్లేయలేదంటే నెహ్రూ, గాంధీ తోకలకి ప్రభావం తగ్గిపోయిందని తెలిసిపోయింది కదా. అయితే ఈ అపజయానికి నేనే భాధ్యుడిని అని మీరు ధైర్యంగా చెప్పడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి విరుద్ధంగా ఉండడం చూసి భవిష్యత్తులో మీరు విజయం సాధించే అవకాశం ఉందేమో అని ఈ లేఖ రాస్తున్నాను, చిత్తగించండి. ఉపయోగపడవచ్చు.
దళితుల ఇళ్ళలో భోజనం చేసి, ఒక రాత్రి నిద్రచేసినంత మాత్రాన వాళ్ళు ఓట్లేయరు అన్న సంగతి కూడా మీకు తెలిసి ఉంటుంది. ప్రజలు ఈ గిమ్మిక్కులని నమ్మడం మానేసి చాలారోజులయింది. ముందు మీరు పార్టీని సంస్కరించేపనిలోకి దిగండి. తలకి నీలంరంగు పాగా చుట్టుకొని మంటెక్ సింగ్ ఆహ్లూవాలియా అని ఒకడు ఉంటాడు. వాడిని ముందు తగలేయండి. కాగితాల మీద గ్రోత్ రేటు కోసం ప్రజలని పణంగా పెట్టే ఇలాంటి వారి వల్ల మీ పార్టీ ఓట్లు కోల్పోతుందేకాని, గెలుచుకోలేదు. ప్రజలకోసం ఎకానామీ కానీ, ఎకానమీ కోసం ప్రజలు కాదు.
తరువాత మీరు వేటు వేయాల్సిన వాడు దిగ్విజయ్ సింగ్. మీ పార్టీలో టాప్ పొజిషన్లో ఉన్న అనేకానేక వేస్ట్ కేండిడేట్స్లో మొదటి స్థానంలో ఉంటాడీ పెద్ద మనిషి. ఇతను ఒక్కసారి నోరు తెరిస్తే కొన్ని లక్షల ఓట్లు మీ హస్తం గుర్తుకి దూరం అవుతాయి. తరువాత మీ దృష్టి అవినీతి మీద పెట్టండి. ఏ మాత్రం భయం లేకుండా, జాలి చూపించకుండా అవినీతి నేతలని పార్టీకి దూరం చేయండి. ప్రజలు అవినీతితో విసిగి వేసారి ఉన్నారు. అవినీతిపరులని పార్టీలో పెట్టుకొని వాళ్ళని ఓట్లు అడగడం భావ్యం కాదు. అడిగినా వాళ్ళు ఓట్లు వేస్తారని నమ్మితే అది అమాయకత్వం అవుతుంది.
ఇలా కొన్ని సాహసోపేతమయిన నిర్ణయాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టండి. 2014లో జరిగే ఫైనల్స్లో గెలవడానికి మీకు అవకాశం ఉంటుంది.
5 comments:
very convincing. it must be realized by all Indians.
అంటే, దొంగల్ని పార్టీ నుంచి పంపేసి, బొక్కలో తోసి, జిమ్మిక్కులు మరోవిదంగా చేసి, కొత్తోల్లకు సీట్స్ ఇచ్చి మరో సారి మోసం చెయ్యాలి అనుకుంటే మీ అభిప్రాయం ప్రకారం 2014 లో UPA కి వోటేస్తారు అన్నమాట.
good sir.
మీ అభిప్రాయం ప్రకారం మొట్ట మొదటిగా రావల్ విన్సీ తప్పుకోవాలి.
మన రాహుల్ బాబుకు మంచి పిల్లను చూసి పెళ్ళి చేసి అప్పుడు చూపించమనండి విషయం !
ఈ వయసులో ఎందుకు లెండి. పాపం ఆ పిల్ల!
Post a Comment