ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల మనోగతం ఇలాగే ఉన్నట్లుంది. ఆరేళ్ళ పాలనలో దివంగత నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి, మహానేత(గాంధీ గారిని జాతిపిత అన్నట్లు YSR గారికి మహానేత అన్న బిరుదు కట్టబెట్టేశారు సాక్షి జగన్ కలిసి. అన్నట్లు పనిలో పనిగా తనకూ యువనేత అన్న బిరుదు తగిలించుకున్నాడు లెండి) తన మంత్రివర్గ సహచరులతో, ఉన్నత అధికారులతో కలిసి తన కుమారుడికీ, అల్లుడికీ, తన మానస పుత్రుడుకీ( కర్ణాటక/బళ్ళారి గాలి గారు) రాష్ట్రంలో వనరులని, ఖజానాని, భూమినీ, గనులనీ దోచి పెట్టారని సీబీఐ సాక్ష్యాలతో సహా బయట పెట్టినా ప్రజలు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది.
యువనేత రాష్ట్రమంతా కలియదిరుగుతూ కొన్నాళ్ళు ఆగండి ఆ స్వర్ణయుగాన్ని మళ్ళీ తీసుకొస్తాను అంటుంటే చప్పట్లు కొట్టి మరీ తమ ఆమోదాన్ని తెలుపుతున్నారు. స్వర్ణయుగం అంటే ఒక వైపు దోపిడీ చేస్తూ మరో వైపు తలో వందో రెండొందలో పెన్షనో మరొకటో విదల్చడమా? దోఫిడీ చేస్తే చేసుకోనీ మనకీ చిల్లర దక్కింది కదా అని ప్రజలు అనుకుంటున్నారా?
అయినా ఈ పెన్షన్లూ, ఉచిత విద్యుత్తూ ఇచ్చింన రాజ శేఖర్ రెడ్డి అనెక సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి, ప్రజలకు దగ్గరగా వారి కష్టాలు తెలిసిన వాడు, పాదయాత్ర చేసి జనాలకి దగ్గరగా మెలిగి వాళ్ళ స్థితిగతులు చూసిన వాడు. చిన్నప్పటినుంచీ వ్యాపారంలో మునిగి ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి అన్న సింగిల్ పాయింట్ అజెండాతో పార్టీ పెట్టి, ఏసీ వాహన యాత్ర చేస్తున్న జగన్‌కి ప్రజల ఈతిబాధల పట్ల అదే విధమయిన సింపతీ, ఎంపతీ ఉంటాయని ఈ జనం అనుకుంటున్నారా?
ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు అన్ని స్కాములు చేసిన వ్యక్తి తనే స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం గతి ఏమిటా అని ఎవరయినా అలోచిస్తున్నారా? రాష్ట్రాన్ని ఎవడు దోచుకుంటే మనకేం, మన బొచ్చెలో నాలుగు చిల్లర నాణేలు పడ్డాయా లేదా అన్న విషయం మాత్రమే చూస్తున్నారా?
ఇదేదో జగన్ పట్లా, వైఎస్సార్ కంగ్రెస్ పట్లా అక్కసుతో, కాంగ్రెస్‌కో, తెలుగు దేశానికో మద్ధతుగా రాసిన పోస్టు కాదు. ప్రజల సంపదని దోపిడీ చేసి, జైలులో కాకుండా అధికార పీఠం ఎక్కుతున్న రాజకీయ నాయకులు(జగన్ శత్రువులు చంద్ర బాబు నాయుడు, సోనియా గాంధీతో సహా) దేశమంతా ఉన్నారు. వారిని చూసి ఆవేశంతో రాశాను. జగన్, వైఎస్సార్ అభిమానులు గమనించండి.
17 comments:
Liked your post.
ఈమధ్య నాకు, నాతో పాటు వర్క్ చేసే ఒక తోటి సహ ఉద్యోగితో ఇదే సంభాషణ జరిగినప్పుడు...తన స్పందన .... "రాజకీయాలన్నాక అన్ని పార్టీలు అవినీతికి పాల్పడతాయి ..కనీసం దివంగత ముఖ్యమంత్రి గారు పేదలకు చేసినది ఎంతో ఉంది" అని.. ఆశ్చర్యంతో అడిగా..అదేంటి సమర్దిస్తున్నారా అవినీతిపరులని అంటే ..."బయటపడ్డాయి కాబట్టి అందరూ అంటున్నారు...జగన్ గారు పేదల పాలిటి పెన్నిదై చాలా మంది కంటే ఎంతో మంచి చేసే చేన్స్ ఉంది" అని జవాబు వచ్చింది. ఉన్నతవిద్యలు అభ్యసించినవారు కులతత్వపు ఉక్కుసంకెళ్ళకు బంధీలౌతున్నరు...... సామాన్య జనం వాళ్ళు ఎన్నుకునే నాయకుల గురించి అలోచించటం లేదు. వార్తలన్నీ సరదాగా చూసేసి అంతే త్వరగా మర్చిపోతున్నరు.
సర్, ఇట్లా మనం ఎన్ని రాసి, చెప్పినా ఈ జనాలు మారారు. కాని మీరు వాడిన టైటిల్ అదిరింది. మంచి ఏదో చెడు ఏదో అతి త్యరలో జనాలు తెలుసుకుంటారని ఆశిస్తూ ...
బాగా వ్రాశారు. అటు అవినీతి వ్యతిరేక ఉద్యమానికీ ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్ళి అక్కడా గంతులు వేస్తున్నారు, ఇటు ఇలాంటి యాత్రలకీ జనం వస్తున్నారు. హారతులు పడుతున్నారు. మీరన్నట్టుగా ఏది ఏమిటి అనే విషయాలు మనకు (అంటే ప్రజలకి) తెలుస్తున్నట్టుగా లేదు. ఎవరి అవినీతి వల్ల కొద్దో గొప్పో బాగుపడి, ఆ మనిషి తమకు విదిల్చిన దానికన్నా ఎన్నో వెయ్యి రెట్లు మింగినా సరే, తమకు కొద్దిగా విదిల్చాడుకదా అని ఆ మనిషిని అందలం ఎక్కించటం ప్రస్తుతం మనదేశంలో ప్రజాస్వామ్యం కింది చలామణి అవుతున్నది.
మా పట్టణంలో వృద్ధిలకి YSR గ్రాంట్ చేసిన ఫించన్ కేవలం రెండు వందల రూపాయలు (రెండు పాకెట్ల కుక్క బిస్కట్ల ధరతో సమానం). అది కూడా కొన్ని సార్లు బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వదు.
సభ కోసం చేస్తున్న జన సమీకరణని బలం అనుకోలేం. అది జగన్‌కైనా.. ఇంకెవరికైనా.
ఎన్నిక నాడు మందూ... నోట్లూ... ఎవరెంత ఎక్కువ ఇస్తే... వాడికే ఎక్కువ అవకాశాలుండే పరిస్థితిలో మార్పేమీ రాలేదనిపిస్తోంది.
మన జనాలకి నిజమైన భావప్రాప్తి అంటే అసలు తెలుసా అని.
good one..!! The irony is the educated illiterates are growing day-by-day.
శ్రీశ్రీశ్రీ రాజ మార్తాండ రాజ గంభీర అపర దాన కర్ణ రాజశేఖర రెడ్డి గాంధీ గారి ముద్దుల గారాల తనయుడు జగన్మోహన్ రెడ్డి గాంధీకి ముఖ్య మంత్రి పదవి ఇస్తే చంద్రబాబు నాయుడు కంటే పక్కాగా రాష్ట్రాన్ని దివాలా తియ్యిస్తాడు. అప్పుడు రాష్ట్ర ప్రజలకి శ్మశానంలో ఏరుకుని అమ్ముకోవడానికి బొగ్గులు తప్ప ఏవీ మిగలవు.
చాలా ఘాటైన టైటిల్..
కాని, నిజాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు?
well said.. sir.
Thank you all.
ఈ దేశానికి కావాల్సింది ఎవరినీ లెక్క చేయని మోడీలే.
title adurs....!!!
మీడియా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినంతమాత్రాన మోడీ గొప్పవాడైపోడు. రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు మీడియా మోడీని పొగిడినట్టే అతన్ని కూడా పొగిడిందని గుర్తుంచుకోవాలి.
లగడ పాటి సర్వే నిజమైతే మన వోటర్లంతా యువనేత ను ముందు నాకు ముందునాకు అని ప్రాధేయపడుతున్నట్లుగా ఉంటే మానభంగం అంటారేమిటి మాష్టారూ!
అదేనండీ ఈ పోస్టులో గోల!
కృష్ణ గారు ఏమి టైటిల్ అండి!సిగ్గు లజ్జ ఉండే ఏ రా.నా.ఆత్మహత్య చేసుకోవలండి ఇది చదివితే!కీపిటప్.మేము చేయలేనిపనిని మీరు చేస్తున్నందుకు చాల
హ్యాపీ గా ఉందండి.
హ్యాపీ ఉగాది
Read this link: http://stalin-mao.net.in/ysr
Post a Comment