సినిమాలలో U,A సర్టిఫికెట్ల గురించే అందరూ విని ఉంటారు. ఒకటి యూనివర్సల్, అంటే అందరూ చూడదగ్గ సినిమా అని. A అంటే కేవలం పెద్దలు మాత్రమే చూడదగ్గ సినిమాలు అని. అయితే ఈ సినిమాలకి పిల్లలే ఎక్కువగా వెళ్తూ ఉంటారనుకోండి. ఏ సర్టిఫికెట్ వస్తే సినిమా మినిమమ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది అన్న భరోసా కూడా ఉంటుంది. అది వెరే విషయం.
అయితే మధ్యలో ఈ F సర్టిఫికెట్ ఏమిటా అనుకుంటున్నారు కదూ? F అంటే Fans Only అని అర్ధం. కేవలం ఆయా హీరోల అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమాలకి ఈ సర్టిఫికెట్ ఇస్తారు అన్న మాట. ఫ్యాన్స్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చి మిగిలిన వారికి పిచ్చి ఎక్కించే సినిమాలకి ఈ F సర్టిఫికెట్ పడేస్తే ఈ సినిమాల బారిన పడి అమాయక ప్రేక్షకులు బలవకుండా ఉంటారన్నమాట.
ఇప్పుడు ఆడుతున్న సినిమాలలో ఈ F సర్టిఫికెట్‌కి అర్హమయిన సినిమాలేవో మీకు ఇప్పటికే తెలిసిపోయింది కదూ?
8 comments:
నేనింకా ఫేక్ సర్టిఫికెట్ ఏమో అనుకున్నా.. మన వాల్లవి పాటల దగ్గరనుండి, సినిమా కథలు, స్క్రీన్ - ప్లే లతో సహా చాలా కాపీ కొడతారు కదా.. !!
:))
ఐడియా బాగుంది .అయితే సెన్సార్ వాళ్ళు f సర్టిఫికేట్ ఇవ్వకపోయినా సినిమా గురించి పత్రికల్లో, బ్లాగ్స్ లో సమీక్షలు రాసే వారు ముందు ఇది f సినిమా అని సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది .
:)
Such a Super Idea....F/C (fans/Caste)...idi inka better emo
C for caste is super idea.
చాలా మంచి ఐడియా.
krishna గారు!
ఇంకా certificat ల గొడవేదండి బాబు.ఇక future లో ఒకే ఒక certificate ఉంటుంది,future లో, అదే "A"అని.
Post a Comment