సహాయ నిరాకరణ అన్నది మహాత్మా గాంధీ చేతుల్లో ఒక ఆయుధంలా పని చేసి భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడు ఇంచు మించు అలాంటిదే కానీ పూర్తిగా భిన్నమైన ఆయుధాన్ని పశ్చిమ ఆఫ్రికా దేశమైన టోగోలో మహిళలు తమ ఆయుధంగా ఎంచుకొని తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి పూనుకున్నారు. దీని పేరు శృంగార నిరాకరణ.
faure gnassingbe
టోగో అరవై లక్షల మంది జనాభా ఉన్న దేశం. ఇది పేరుకి ప్రజాస్వామ్య దేశమైన కొన్ని దశాబ్ధాలుగా ఒక కుటుంబం పాలనలోనే ఉంది. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న ఫౌరే గ్నాసింబే ఆ పదవిలోకి 2005 లో వచ్చాడు. అంతకు ముందు 38 సంవత్సరాలు ఆ పదవిలో ఆయన తండ్రి ఎయాడెమా గ్నాసింబే ఉన్నాడు. మరో రెండు నెలల్లో అధ్యక్ష పదవికి ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో సంస్కరణల పేరిట కొత్త చట్టం తీసుకురావడానికి ఫౌరే గ్నాసింబే ప్రయత్నిస్తున్నాడు. ఆ సంస్కరణలు తను మళ్ళీ అధ్యక్ష పదవిలోకి రావడానికి తనకి అనుకూలంగా చేసుకున్నవే అని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ సంఘాలలో ముఖ్యమైనది Let us save Togo అన్నది. దీనిలో మహిళా విభాగానికి నాయకురాలు అయిన ఇసబెల్లే అమెగాన్వి కి పురుషులు ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొనడం లేదు అన్న అనుమానం వచ్చింది.
ఇసబెల్లే అమెగాన్వి
కాబట్టి పురుషులు అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొనేలా చేయడానికి స్త్రీలు వారి మీద ఒక అస్త్రాన్ని ప్రయోగించాలని ఆమె పోయిన శని వారం పిలుపునిచ్చారు. ఆ ఆయుధమే శృంగార నిరాకరణ. ఒక వారం రోజులు టోగోలోని ఆడవాళ్ళందరూ తమ భర్తలని కానీ, ప్రియులని కానీ తమ పక్కలోకి రానివ్వకుండా ఉండాలని అప్పుడు గానీ వాళ్ళు రెచ్చిపోయి అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొనరని ఆమె ఒక సమావేశంలో అన్నారు.
శృంగార నిరాకరణ అన్నది కొత్తదేమీ కాదు. 1997లో కొలంబియాలో సైన్యానికీ, గెరిల్లాలకీ మధ్య జరుగుతున్న పోరాటానికి స్వస్తి పలకడానికి ఇరు పక్షాలలో పోరాడుతున్న వారి భార్యలూ, స్నేహితురాళ్ళు ఈ అస్త్రాన్ని ఉపయోగించి పోరాట విరమణ సాధించారు. 2003లో లైబీరియాలో మహిళా సంఘాలు ఈ అస్త్రాన్ని ఉపయోగించి పద్నాలుగేళ్ళ అంతర్యుద్ధానికి స్వస్తి పలికారు.
"ఇది కూడా ఉపవాసం లాంటిదే. ఉపవాసం చేస్తేనే భగవంతుడు మన కోర్కెలు తీరుస్తాడు" అని కొందరు అంటే, "ఏదో ఒకటి రెండు రోజులయితే సరే కానీ ఏకంగా వారమంటే కష్టం" అని కొందరన్నారు ఈ ప్రతిపాదన గురించి. "ఆమెకేం ఎన్నయినా చెప్తుంది. ఆమెకి పెళ్ళి కాలేదు, బాయ్ ఫ్రెండూ లేదు. వారం రోజులు దూరంగా ఉండమంటే మా మొగుళ్ళు ఒప్పుకుంటారా" అని మరికొందరు అన్నారు. "అయినా తలుపులు మూశాక వాటి వెనకాల ఏం జరుగుతుందో ఎవరు చూస్తారు. ఇది జరిగే పని కాదు" అని కొట్టి పారేశారు కొందరు.
అయినా వారం రోజుల ఈ సెక్స్ స్ట్రైక్ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. అప్పుడు ఈ ఆడవాళ్ల ఆయుఢానికి ప్రభావితమై టోగో మగవాళ్ళు ఎంత ఉత్సాహంగా నిరసన కార్యక్రమాలో పాల్గొంటారో తెలిసిపోతుంది.
1 comment:
"ఆమెకేం ఎన్నయినా చెప్తుంది. ఆమెకి పెళ్ళి కాలేదు, బాయ్ ఫ్రెండూ లేదు. వారం రోజులు దూరంగా ఉండమంటే మా మొగుళ్ళు ఒప్పుకుంటారా" అని మరికొందరు అన్నారు"
అది ఆడవాళ్ల అసలు సంగతి. ఒక్క పని స్వంతంగా వారికై వారు చేయటం రాదు. మాటలలో మటుకు ఆడామగ సమానం అని గొప్పగా వాగుతూంటారు. టపాలో మహిళా నాయకత్వాల విపరీత మనస్తత్వాన్ని, తమమాట నెగ్గాలనే పంతం,సర్దుకుపోలేని ధోరణి సూచిస్తున్నాది. ప్రపంచం లో ఏ దేశమైనా వీరి ప్రవర్తన ఒకే విధంగా ఉంట్టుంది. తెలుగులో స్రీ సాహిత్యం పేరుతో నాలుగు దశాబ్దాలు గా ప్రపంచవ్యాప్త చెత్తని ఎరుకొచ్చి, ఫెమినిస్ట్టులు, ఓల్గా రాసే తుక్కు సాహిత్యం చదివి చాలామంది పాఠకులు కూడా వాళ్లు చెప్పేది,రాసేది నిజమనే భ్రమలో ఉంటారు. ఫెమినిస్ట్టుల వాదన ప్రకరం ఆడవారు మగవారితో పోలిస్తే ఏ రంగం లోను తీసిపోరు, సమానం కాబట్టి ఆడవాళ్ళే ఉద్యమాలలో పోరాడి దేశాధ్యక్షుడిని అధికారం నుంచి దించవచ్చుగదా! మగవాళ్ల సహాయం ఎందుకు? అందులోను మగవారిని రెచ్చ గొట్టి పని చేయించుకోవలనే పురాతనకాలం నాటి ఎత్తుగడలు. మగవాళ్లకి శృంగార నిరాకరించటం ద్వారా, నాకీ పని చేసి పెడితే, నీతో శృంగార లో పాల్గొంటామని సంసిద్దతను వ్యక్తం చేయటం ద్వారా అనాదిగా చదువు సంధ్యా లేని ఆడవారు వేసే ఎత్తుగడ. ఈ ఆధునిక కాలంలో చదువుకొన్న గొప్ప మహిళా నాయకులు కూడా అదే టేక్నిక్ లు ఉపయోగించటం చూస్తుంటే, ఇప్పటికి వాళ్లు అనుకొన్న పనులు కావటం కోసం ఎంత నీచానికి దిగజారుతారో అర్థమౌతున్నది.
Post a Comment