పైకి ఎన్ని ఆడర్సాలు వల్లించినా, ఎంత విశాల హృదయులయినా పెళ్ళి దగ్గరకి వచ్చేసరికి తమ భాగస్వామి ఫ్రెష్ అయిఉండాలని, మొదటి రాత్రే వారికి మొదటి అనుభవం అయి ఉండాలని కోరుకుంటారు. మొదటి సెక్స్ టీనేజ్‌లోనే జరుగిపోతున్న ఈ రోజుల్లో పెళ్ళికి ముందు ఎన్ని ఆటలాడినా పెళ్ళయ్యాక నమ్మకంగా ఉంటే చాలు అన్న అభిప్రాయం ఈ మధ్య యువతీ యువకుల్లో వస్తూ ఉంది. భాగస్వామి ద్వారా తమకి నచ్చినట్లుగా లైంగిక ఆనందం దొరక్కపోతే ఆ అనుభవం బయట వెతుక్కోవడం తప్పు కాదు అని కొందరు శరత్ లాంటి ఓపెన్ మైండెడ్ వ్యక్తులు భావించినా వారి సంఖ్య చాలా స్వల్పం.
అయితే ఎక్కువమంది మగవారు తాము పెళ్ళికి ముందు ఎన్ని గ్రంధాలు నడిపినా తమకి వచ్చే భార్య మాత్రం కన్యగానే రావాలి అని ఆశిస్తూ ఉంటారు. కొన్ని సమాజాల్లో ఆడవారికి కన్యత్వం అనేది ఆప్షనల్ అయితే మరికొన్ని సమాజాల్లో మాండేటరీ అవుతుంది. సిడ్నీ షెల్డాన్ నవల అదర్ సైడ్ ఆఫ్ మిడ్‌నైట్‌లో హీరోయిన ఒక అమెరికన్. తాను టీనేజీ దాటిపోతూ ఉన్నా తనకి కన్యత్వం వదల్లేదే అని తెగ మధనపడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఎక్కడో యాక్సిడెంట్ అయి తను చనిపోతే, పోస్ట్‌మార్టంలో తను కన్యని అని తెలిస్తే అందరూ ఎంతగా నవ్వుకుంటారో అని తెగ బాధపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అమెరికన్. కాబట్టే కన్నెచెర వదిలించుకోవడానికి అంత ఆరాట పడుతుంది ఆ అమ్మాయి.
అయితే మరీ సాంప్రదాయక సమాజాలు కొన్నింటిలో పెళ్లికి ముందు ఆడవారికి శృంగారం అన్న అవకాశమే ఉండదు. ఇలాంటి కుటుంబాలలో అమ్మాయిలు శోభనం రాత్రి మాత్రమే తమ కన్యత్వాన్ని వదిలించుకోవలసి ఉంటుంది. ఇలాంటి కుటుంబాలలో పెళ్లికి ముందు వధువుకి శృంగార అనుభవం ఉంది అని వరుడికి అనుమానం వస్తే ఆ అమ్మాయికి మానసికంగా, శారీరకంగా హింస తప్పదు. అయితే శోభనం రాత్రి తన భార్య కన్య అవునో కాదో ఏ వరుడూ చెప్పలేడు. ఏ డాక్టరో వచ్చి వజైనల్ ఎగ్జామినేషన్ చేస్తే కానీ తెలిసే విషయం కాదు అది. అయితే చాలామంది అమ్మాయి కన్య అవునో కాదో తెలుసుకోవడానికి మూడు కొండగుర్తులు చెప్తూ ఉంటారు.
తొలి కలయిక స్త్రీకి నొప్పి కలిగించాలి, అప్పుడు కన్నెపొర చిరగాలి, రక్త స్రావం కావాలి అని. కన్నె పొర(hymen) యోని లోపల ఉండే ఒక పొర. చాలా మందిలో ఇది చాలా పలుచగా ఉంటుంది. కొందరిలొ ఇది స్పష్టంగా ఉండక పోవచ్చు. పెళ్ళికి ముందు ఆటల్లో గానీ, హస్త ప్రయోగం ద్వారా గానీ, బహిష్టు సమయంలొ వాడే టాంపన్స్, శానిటరీ నాప్కిన్స్ వల్ల గానీ ఈ కన్నెపొర చిరిగి పోవచ్చు.
అయితే కన్నెపొర శోభనం రాత్రి ఖచ్చితంగా ఉండాలి అనుకునేంత ఆర్థడాక్స్ ఫ్యామిలీస్‌లో అమ్మాయిలు పెళ్ళికి ముందు అనుభవాల వల్ల అది డామేజ్ అయిఉంటే దాన్ని మళ్ళీ సృష్టించడానికి హైమెనోప్లాస్టీ అన్న అపరేషన్ ఉంది. ఈ ఆపరేషన్ ఖర్చుతో, శ్రమతో కూడుకున్న విషయం. దీని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. పైపెచ్చు ఆపరేషన్ చేయించుకోవాలంటే అందరికీ తెలుస్తుందేమోనన్న భయం ఒకటి ఉంటుంది.
ఎటువంటి బాదరబందీ లేకుండా, మూడవ కంటికి తెలియకుండా కేవలం 30 డాలర్ల ఖర్చుతో, అరగంటలో తాము కోల్పోయిన కన్యత్వాన్ని తిరిగి పొందే అవకాశం కల్పించింది అలీషియా వింధామ్ అన్న అమ్మడు. ఈమె నడిపే hymenshop అన్న వెబ్‌సైటుకి 30 అమెరికన్ డాలర్లు పంపితే కృత్రిమ కన్నెపొరని ఒక పాకెట్‌లో పంపిస్తుంది. ఇందులో రెండు కన్నెపొరలు ఉంటాయి. ఒకటి ముందుగా ప్రాక్టీసు చేయడానికి, మరొకటి అసలు సీన్‌లో వాడడానికి. సెక్స్‌కి ఇరవై ముప్పై నిముషాలు ముందుగా ఆ పొరని బయటకి తీసి యోనిలో పెట్టుకుంటే అక్కడి తేమని పిల్చుకొని అది కొద్దిగా ఉబ్బి శృంగారం సమయంలో మగవాడికి కన్నెపొర అడ్డువచ్చినట్లు, అది చినిగినట్లూ అనుభూతి కలుగుతుంది. పైపెచ్చు అందులో ఉన్న కొన్ని పదార్ధాలు బయటకి స్రవించి రక్తస్రావమయినట్లు కనిపిస్తుంది.
దీనికి తోడు శృంగారం సమయంలో తనకి నొప్పిగా, బాధగా ఉన్నట్లు ఆమె కొంచెం మూలిగి అబ్బా,అబ్బా అని శబ్ధాలు చేస్తే ఎంత అనుమాన పక్షి అయినా ఆమె కన్య కాదని చెప్పలేడు.
పెళ్ళి నాటికే కన్యత్వం కోల్పోయి నరకం చవి చూస్తున్న అమ్మాయిలకి ఉపయోగకరంగా ఉండాలని తను ఈ కృత్రిమ కన్నెపొరని తయారు చేశానని అలీషియా వింధామ్ చెప్తూంది.
4 comments:
ఆడవాళ్ళు పెళ్ళికి ముందు కన్యలుగా ఉండాలి. మగవాళ్ళు ఎన్ని ఆటలైనా ఆడవచ్చు అన్న భావజాలం ఉన్నంతవరకూ ఇలాంటి వాటికి ఆదరణ ఉంటుంది. నిజానికి కన్యతో సెక్సు అంత సుఖాన్ని ఇవ్వదు. దీన్ని తెలుసుకోలేక కన్నెపిల్లల కోసం మోజు పడుతూ ఉంటారు. వేశ్యలని మెయింటెయిన్ చేసే మేడమ్‌కు కూడా తన దగ్గర ఉన్న కన్నెపిల్లలని కన్నెరికం చేసే అవకాశం కోరుకునే విటులకి ఎక్కువ సొమ్ముతో అందిస్తుంది.
మొదటి ఫోటో అదిరింది బాస్.
చాలా మంచి సమచారన్ని, ఎన్నో తెలియని కొత్త కొత్త విషయాలను, ఎంతో శ్రమ కోర్చి బ్లాగర్లకు పరిచయం చేస్తుంనందుకు ముందుగా మీకు హృదయపూర్వక అభినందనలు.
మీ నుంచి ఇటువంటి మచి టపాలు ఇంకా మరిన్ని రావాలని ఆశిస్తూ...
దన్యవాదాలు సర్.
Post a Comment