నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, October 23, 2012

మెంటల్ మేధావులు


నిన్న, సోమవారం మధ్యాహ్నం అలా చానల్స్ తిప్పుతూండగా టీవీ9 లో ఒక దృశ్యం కనిపించింది. ఒక సభ తాలూకూ ఫోటో అది. కొందరు వేదిక మీద కూర్చుని ఉన్నారు. వారి వెనక రావణ వర్ధంతి సభ అన్న బ్యానర్ ఉంది. ఇంతలో ఓ ఫోటో స్థానంలో కంచె ఐలయ్య కనిపించాడు. ఎంతైనా మేధావి కదా అని చానల్ మార్చకుండా చూశాను. అది ఒక చర్చా కార్యక్రమం. కంచె ఐలయ్య, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి ఫోన్‌లో, మరొక ఆయన స్టూడియోలోనూ ఉంది చర్చిస్తూ ఉన్నారు. ఒక నిముషంలోనే విషయం అర్ధమై పోయింది. రామాయణంలో అసలు హీరో రావాణుడే అని ఐలయ్య సార్ అంటున్నారు. దానిని వాళ్ళిద్దరూ కౌంటర్ చెస్తూ ఉన్నారు.
 
అధికారం మొదటినుంచీ బ్రాహ్మణులూ, క్షత్రియులూ, రెడ్లూ, వెలమల చేతుల్లోనే ఉంది అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు అది అంద లేదనీ అందులో భాగం రామాయణం అని ఒక వింత వాదన లేవనెత్తారు ఐలయ్య. అసలు రావణుడు పులస్త్య బ్రహ్మ వారసుడు అని, స్వచ్ఛమైన బ్రాహ్మణుడు అని ఆయనకి కౌంటర్ ఇచ్చారు స్టూడియోలోని వ్యక్తి (ఆయన పేరు తెలుసుకోలేక పోయాను). దానితో ఐలయ్యకి చిర్రెత్తుకొచ్చి, "నువ్వు బీసీవి, అగ్ర వర్ణాలవారికి బానిసగా వారికి కొమ్ము కాస్తున్నావ్" అని అంటే, "నువ్వు విదేశీ డబ్బుకి అమ్ముడు పొయ్యావ్" అని ఈయన కేకలేసుకున్నారు. అప్పుడు యాంకర్ కాస్సేపు బ్రేక్ తీసుకున్నాడు.
 
బ్రేక్ తరువాత ఐలయ్య తన విశ్వరూపం చూపించాడు. రావణుడిని, శూర్పణఖని, వాలినీ ఎస్సీ, ఎస్టీలుగా వర్గీకరించి పారేసి, రాముడు మహిళలని హింసించాడని ఒక అభియోగం మోపాడు. మీరు చెప్పిన ఈ ముగ్గురూ ఎస్సీ, ఎస్టీలకి ఏం చేశారయ్యా అన్న ప్రశ్నకి, వాళ్ళు వస్తు ఉత్పత్తి చేశారు అని, ఇరవయ్యో శతాభ్దం తాలూకూ కమ్యూనిస్టు భావజాలాన్ని త్రేతాయుగం నాటి పాత్రలకి అంట గట్టే ప్రయత్నం చేశాడు ఐలయ్య. ఒరేయ్ నాయనా అస్సలు రామాయణం మహా కావ్యాన్ని రాసిందెవరో నీకు తెలుసా అన్న ప్రశ్నకి, తెలంగాణాలో క్రీస్తు పూర్వం మల్లయ్య అని ఒక కవి ఉండేవాడు అని మొదలు పెట్టి నేను మూర్చపొయ్యేలా చేశారు ఐలయ్య గారు. క్రీస్తు పూర్వమే తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్ర అని ఉండేవా అని షాకయ్యాను నేను.

శూర్పనఖని హింసించినందుకు లక్ష్మణుడు, అమ్దుకు ప్రోత్సహించినందుకు రాముడు శిక్షార్హులు అని ఐలయ్యగారి వాదన. ఇంకా నయం ఎలాగూ వాలి, శూర్పణఖ, రావణాసురల్ని ఎస్సీ, ఎస్టిలుగా తేల్చిపారేశాడు కాబట్టి వారితో యుద్ధం చేసినందుకు రామ లక్ష్మణుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటాడేమో కంచె ఐలయ్య అని నేను భయపడుతూండగా చర్చని ముగించాడు యాంకరు. బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాను. 

23 comments:

శశి కుమార్ said...

ఎవరు ఈ కంచే ఐలయ్య ? అసలు పేరు ఏంటి?!!

Anonymous said...

Read this post to know more details

http://yaramana.blogspot.in/2012/10/blog-post_21.html?showComment=1350969511029

Anonymous said...

రావణుడేమో కాని, దీర్ఘంగా ఆలోచిస్తే ...శూర్ఫణక, తాటకి, భస్మాసురాదులు, ఐలయ్య వర్గీయులే అన్న ఆయన వాదన నిజమేనేమో అనిపిస్తోంది. :P అదేమిటో, ఐలయ్యతో ఏకీభవించాలనే దురద ఎక్కువవుతోంది. :D

rangaraju said...

lol @sknr

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అందుకేనేమో ఐలయ్యకి వీళ్ళంటే అంత ప్రేమ. రేపు దీపావళికి కూడా నరకాసురుడు హీరో, అతన్ని చంపి సత్యభామ, కృష్ణుడు తప్పు చేశారని టీవీ చానల్స్‌లో వాగుతాడేమో! కంచె ఐలయ్య అదేదో యూనివర్సిటీలో ప్రొఫెసర్. Why I am not a Hindu అన్న పుస్తకం రాశాడు. తెలంగాణాకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని వారికి శత్రువు అయ్యాడు.

Praveen Mandangi said...

దీని గురించి ఫేస్‌బుక్‌లో చర్చ జరిగింది. "రామాయణం ఒక పుక్కిటి పురాణం అయినప్పుడు అందులో హీరో రాముడా, రావణాసురుడా అనేది అనవసరం" అని నేను అన్నాను. అలా అన్నందుకే నాస్తికుణ్ణైన నన్ను హిందూత్వవాది అని ముద్రవేసేశారు. మంత్రాలకి చింతకాయలు రాలనప్పుడు రామాయణమైనా, ఇంకో పుక్కిటి పురాణమైనా అది ఫార్సే అవుతుంది. వాటిలో హీరోలు ఎవరు, విలన్‌లు ఎవరు అని లెక్కలు వేసుకుంటే కోడి గుడ్డు మీద వెంట్రుకలు ఏరినట్టే.

Anonymous said...

ప్రవీణ్
మరి " రాముడు/దశరథుడు మార్క్సిస్టు కాడు, రావణుడు తాడిత/పీడితుడు " అనే టైపు వాదంలో రాయబడిన విషవృక్షం దగ్గర ఇదే మాట మీద వుంటావా? లేదా "వంగతోట కాడ చెల్లుబాటు కాదు" అనే మినహాయింపులుంటాయా? :P :))

Anonymous said...

అంటే ... కోడిగుడ్డు మీద మన రంగనాయకి యీకలు ఏరినట్టే అంటావా?!!

Praveen Mandangi said...

టపాతో సంబంధం లేకుండా వ్యాఖ్యలు వ్రాయడం నీకు కొత్త కాదు. ఇంతకు ముందు "మోహన్ దాస్ గాంధీ ఏ వర్గ ప్రతినిధి" అనే దాని గురించి చర్చ జరుగుతోంటే కోబాడ్ గాంధీ గురించి మాట్లాడావు. నీ బొద్దింక బుర్రకి ఏదైనా అలాగే అర్థమవుతుంది. నేను అడిగిన ప్రశ్న ఏమిటింటే "రావణాసురుణ్ణి హీరోని చెయ్యడం వల్ల పుక్కిటి పురాణం నిజంగా జరిగిన కథ అయిపోతుందా?" అని. రాముడికి గుడి కట్టడం మానేసి రావణాసురునికి గుడి కట్టడం వల్ల మూఢ నమ్మకాలు పోవు. అదీ నేను ఇక్కడ చెప్పదలచుకున్న పాయింట్.

Anonymous said...

అదే నేనూ అంటున్నా... (నీ మేతస్సుకి అందినట్టు లేదు, మరింత నీ లెవెలికి దిగజారుతా, అది బొద్దింక గాని, బద్దె పురుగు గాని:D ),
విషవృక్షం రాసిన టైమ్‌పాస్, స్కూల్ డ్రాపవుట్ మార్కిస్ట్ మేతావులు రామాయణాన్ని ఒప్పుకున్నట్టేనా?

Praveen Mandangi said...

నువ్వు "రామాయణ విషవృక్షం" పుస్తకం చదవలేదు కనుక దాని గురించి చర్చించకు. రంగనాయకమ్మ గారు రావణాసురుణ్ణి హీరోని చెయ్యలేదు. కనుక రావణాసురుడు హీరోనా, కాదా అనే చర్చలో ఆ పుస్తకం గురించి మాట్లాడడం "బోడిగుండు-మోకాలు ముడి" అవుతుంది. నీకు తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లిష్‌లో చెపుతాను. Don't link skinhead with knees.

Praveen Mandangi said...

రంగనాయకమ్మ గారు రామాయణం నిజంగా జరగలేదని అంటారు. కానీ కంచ ఐలయ్య అలా కాదు. రామాయణం నిజంగా జరిగింది కానీ అందులో రావణాసురుడు హీరో అని అంటాడు. ఇక్కడ కంచ ఐలయ్య లాంటి మేతావుల గురించి చర్చ జరుగుతోంటే మధ్యలో అసలు రామాయణాన్నే నమ్మనివాళ్ళ గురించి చర్చ ఎందుకు? అందుకే నువ్వు టపాతో సంబంధం లేని కామెంట్‌లు వ్రాస్తున్నావని అన్నది.

Praveen Mandangi said...

అదేదో కథలో పంతులు విద్యార్థికి దేని గురించి అడిగినా ఆవు గురించి వ్యాసం చెప్పినట్టు ఇక్కడ కంచ ఐలయ్య గురించి చర్చ జరుగుతోంటే ఆయన ఐడిలాయజీతో సంబంధం లేని "రామాయణ విషవృక్షం" పుస్తకం పేరు చెప్పి చర్చని డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ ఆవు వ్యాస రచయిత.

Anonymous said...

Answer to the point, don't blabber.
విషవృక్షం రాసిన టైమ్‌పాస్, స్కూల్ డ్రాపవుట్ మార్కిస్ట్ మేతావులు రామాయణాన్ని ఒప్పుకున్నట్టేనా?

Anonymous said...

రంగనాయకమ్మ గారు రామాయణం నిజంగా జరగలేదని అంటారు
జరగని రామాయణాన్ని ఖండించడానికి విషవృక్షం రాశారా? మార్క్సిస్టులు అంత పనీపాట లేకుండా నీలాగా బేవార్సుగా వున్నారా?

Anonymous said...

చర్చ రంగనాయకమ్మ గారి రామాయణం దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ పుస్తకం గురించి నా అభిప్రాయం చెప్తున్నాను. రంగనాయకమ్మ గారు త్రేతాయుగం లో జరిగిన రామాయణాన్ని కలియుగ ధర్మం ప్రకారం జడ్జి చేసి ప్రతీ దానికి ఈకలు పీకారు. ఇక ఐలయ్య గారి లాంటి మహా మేధావుల గురించి మాట్లడటానికి నాకు ధైర్యం లేదు. రాముడినే తప్పు పట్టగల గుణశీలురు కదా వారు. ఇక నావంటి అర్భకుల్ని ఏమంటారో అని నా భయం. ఈ మధ్య రాముడ్ని తప్పు పట్టిన ఇంకో మహా సద్గుణశీలి రాం జెఠ్మలాని గారికి మాత్రం ఈ బ్లోగ్ ముఖంగా ఒక చిన్న విన్నపం - ముందు వారి పేరు మార్చుకుని తరువాత మాట్లాడమని. రావణ్ జెఠ్మలాని కాని కసబ్ జెఠ్మలాని కాని వారికి సరిపోవచ్చు. గమనిక: రావణ్ జెఠ్మలాని అంటే రావణుడికి అవమానం జరిగినట్టు అవ్వచ్చు, ఐలయ్య గారికి కోపం రావచ్చు.

Anonymous said...

అనానిమస్, ఓ సవరణ.
'కలియుగ ధర్మం' ప్రకారం కాదు, అలాంటి యుగాలు మార్క్స్ చెప్పలేదు కాబట్టి, అవి లేనట్టే. :)
ప్రస్తుతం ఇండియాలో వున్న 'హిందూ లా' అనబడే న్యాయం ప్రకారం, మూర్ఖిస్టు ధర్మకోణంలో తనదైన విమర్శచేశారు.

Praveen Mandangi said...

నిజమే అగ్నాతా. ఆవు వ్యాసం చెప్పాలనుకునేవాళ్ళు ఏ చర్చనైనా ఆవు దగ్గరకే తీసుకొస్తారు. మార్క్సిజంని ద్వేషించేవాళ్ళు మార్క్సిజంని వ్యతిరేకించే కంఅ ఐలయ్య లాంటి మేతావుల గురించి చర్చ జరుగుతున్నప్పుడు కూడా చర్చని మార్క్సిజం వరకు తీసుకొస్తారు. కంచ ఐలయ్య తాను మార్క్సిజంని వ్యతిరేకిస్తున్నట్టు బహిరంగంగానే చెప్పుకున్నాడు. అటువంటప్పుడు కంచ ఐలయ్యపై చర్చ జరుగుతున్నప్పుడు మార్క్సిస్ట్‍ల గురించి మాట్లాడడం టాపిక్ డైవర్సన్ అవ్వదా?

Praveen Mandangi said...

కంచ ఐలయ్య ఒక పచ్చ కామెర్ల రోగి. అతను అందరినీ కులం కళ్ళతోనే చూస్తాడు. అతను మార్క్సిస్ట్‍లని కూడా కులగజ్జి కుక్కలనీ, బ్రాహ్మణవాదులనీ, మనువాదులనీ అంటుంటాడు. అసలు కంచ ఐలయ్య ఎవడో, వాడి ఐడియాలజీ ఏమిటో తెలియకుండానే అతన్ని మార్క్సిస్ట్‍లతో పోలుస్తున్నారు మరి కొందరు పచ్చ కామెర్ల రోగులు. ఈ పచ్చ కామెర్ల రోగుల ప్రత్యేకత ఏమిటంటే తమని వ్యతిరేకించే ప్రతివాళ్ళూ ఎర్రబాబులే అని అనుకుంటారు.

Anonymous said...

బాహాటంగా చెప్పుకోకపోయినా ఐలయ్య ఓ మార్క్సిస్ట్ అనడానికి ఆధారాలు వున్నాయి.
అ) ఆయన కూడా మేధావి, ఆ) ఆయనకూ వర్గశతృవులు అంటూ ఏడ్వటానికి ఓ వర్గం వుంది, ఇ) చరిత్రవక్రీకరణ కూడా చేస్తుంటారు. ఇంతకన్నా ౠజువులింకేం కావాలి? ఆయన నిర్ద్వందగా, శాస్త్రీయంగా మార్క్సిస్టే, మావోఇస్టే.

Praveen Mandangi said...

కులం వేరు, వర్గం వేరు నాయనా. దళితుడు డబ్బున్నవాడైనా, పేదవాడైనా అతను రిజర్వేషన్‍ల కోసం కులం పేరు చెప్పుకుంటాడు. అగ్రకులంవాడు డబ్బున్నవాడైనా, పేదవాడైనా అవకాశాల కోసం రిజర్వేషన్‍లని వ్యతిరేకిస్తాడు. ఇలాంటి విషయాలలో వర్గంతో సంబంధం లేకుండా దళితులూ, అగ్రకులాలవాళ్ళూ అవకాశాల కోసం ఒకరినొకరు కొట్టుకుంటారు. కానీ మార్క్సిజం విషయం వేరు. మార్క్సిజం ఆర్థిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కానీ కులం, మతం లాంటి సంకోచాల మీద నిలబడదు. ప్రతి మనిషినీ కులం కళ్ళతో చూసే & ఆర్థిక అంశాల గురించి మాట్లాడని కంచ ఐలయ్య మార్క్సిస్ట్ ఎలా అవుతాడు?

Anonymous said...

Anonymous November 14, 2012 2:06 PM
ఆ తత్వాన్ని అ ఆ ఇ ఈ లతో విప్పి ఆరగట్టారు. :)
మేతావి ఐలయ్య గారు, మార్క్సిస్టు కాకున్నా ఎర్ర బొద్దింక బుర్రగల ఓ మావోఇస్ట్ అయివుండవచ్చు. :P

gtrao.trainer@gmail.com said...







ఒక మతం లో ఉంటూ, ఒక మతానికి సంబందిచి Sheppard (పశువుల కాపరి) గా ఉంటూ, వేరే మతానికి సంబంధించిన కులాల మీద విడి విడి గా దాడి చేస్తూ అంతర్లీనంగా హిందూ మతం మీద కంచ ఐలయ్య గారు దాడి చేయటం గర్హనీయం.
ఇది ఉగ్రవాడుల బౌతిక దాడుల కన్నాప్రమాదకరమైన సంకేతం. గౌ||కంచ ఐలయ్య గారికి సంబందించిన మత పెద్దలు కుడా అతని దోరణిని కండించవలసిన పరిస్టితి ఉంది.
ఫైగా ప్రస్తుతం ఒక వైశ్య కులానికి చెందినవారు మాత్రమే కాకుండా, హిందూ మతస్తులందరూ కండించవలసిన విషయం

కొన్ని కులాలు కలిస్తే ఒక మతం అని చదువుకున్నాం! మనది మానవతా కులం అనుకున్నాం!

ఒక కులాన్ని గాని మతాన్ని గాని విమర్శించే హక్కు ఎవరికుంది, కనీసం ఆ కులం కాదు మతం అంతకన్నా కాదు,
నువ్వెలా విమర్శిస్టావ్!

కులాలు వేరైనా మతం ఒక్కటే!!!

నీది కాని మతం గురించి నీకేల, ఇదేనా విద్యాదికులు చేయవలసిన పని, హిందూ మతం లోని ఒక కులం గురించి అన్యేతరులు మాట్లాడటం అసమంజసం.

దేశం లో అత్యదికులు ఉన్న ఒక హిందూ మతం లోని ఒక కులం గురించి నువ్వు ఎలా మాట్లాదతావ్!!!

ఎంత మంది మనసులు నోచుకున్తున్నాయో తెలుస్తుందా!!

ఇది తెలియని వారు విజ్ఞులు ఎలా అవుతారు మీరే ఆలోచించండి.