నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 8, 2011

L.O.L. కి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో దక్కిన స్థానం.


LOL 

LOL.ఇంటర్నెట్‌లో చాటింగ్, మెయిలింగ్ చేసే వారికి సుపరిచితమైన పదం(phrase అనాలేమో) ఇది. Laughing out loud కి సంక్షిప్త రూపమే ఇది. ఇంటర్నెట్‌తో సంబంధం లేని వారికి ఇదొక పిచ్చి పదంలా అనిపించవచ్చు. ఇంతవరకూ నెటిజెన్లకు మాత్రమే పరిమితమైన ఈ LOL ఇప్పుడు Oxford English Dictionery లో స్థానం సంపదించుకోబోతోంది. OED కొత్త ఎడిషన్‌లో LOL కి ఈ గౌరవం దక్కబోతోంది.

బాషా వేత్తలకి ఈ సంగతి కోపం తెప్పించినా కొత్త తరం మాత్రం హర్షిస్తారని OED సంపాదక బృందం ఆ విమర్శలనేమాత్రం పట్టించుకోకుండా LOL కి తమ నిఘంటువులో స్థానం కల్పించడానికే నిశ్చయించుకున్నారు.

సత్య సాయిబాబా ఏ స్థితిలో ఉన్నాడు? నిజం ఎందుకు బయటకి రావడం లేదు?


ರಾష్ట్రంలో గత పది పన్నెండు రోజులుగా అందరినీ వేధిస్తున్న సమస్య సత్య సాయి బాబా అరోగ్యం. ఆయన భక్తులకీ, విమర్శకులకీ, తఠస్థంగా ఉండే వారికీ ఎవరికీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ICU  లో ఏం జరుగుతోందో అంతు బట్టడం లేదు. మీడియాని, సాయి బంధువులనీ, భక్తులనీ,పోలీసులని, చివరికి VIP లని ఎవరిని ఆయన్ని చూడ్డానికి సాయి ట్రస్టు వారు అనుమతించడం లేదు. 
 
వాజ్‌పాయి ప్రధానిగా ఉన్నప్పుడు నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షని భారత ప్రభుత్వం ఎంత గోప్యంగా ఉంచిందో ఇప్పుడు ఈ ట్రస్టు వాళ్ళు సాయి బాబా ఆరోగ్యాన్ని అంతకన్నా రహస్యంగా ఉంచుతున్నారు.


సోవియట్ యూనియన్ ముక్కలుగా విడిపోకముందు, ప్రచ్చన్న యుద్ధం తీవ్ర స్థాయిలొ ఉన్నప్పుడు సోవియట్ ప్రీమియర్ ఎవరైనా జబ్బుపడితే ఆయన చనిపోయినా ఆయన వారసుడిని ఎంపిక చేశాక గానీ ప్రపంచానికి ఆ సంగతి తెలిసేది కాదు. ఒక దేశాధినేత, అణు క్షణం యుద్ధం ముంగిట్లో ఉన్న పరిస్థితిలో దేశం నాయకుడు లేకుండా ఉందీ అంటే ఇబ్బందులు ఎదురవుతాయేమో అని భావించి వాళ్ళు అలా చేసి ఉండవచ్చు. ఇది అర్ధం చేసుకోదగ్గ విషయమే.
 
అమెరికాలో ఇటాలియన్ మాఫియా కుటుంబాలలో కూడా ఈ పద్ధతి పాటిస్తారట. ఒక కుటుంబానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఏ రూపంలో అయినా మరణిస్తే తరువాతి నాయకుడిని ఎన్నుకొనేదాకా ఆ విషయం బయటకు తెలియదట. దీన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. నాయకుడు లేడని తెలిస్తే అవతల గ్రూపువాళ్ళు తమ వాళ్లని ఏమైనా చేయవచ్చు, లేదా తమ గ్రూపులోని వాళ్ళకు వల వేసి తమ వైపు తిప్పుకోవచ్చు.
 
కానీ సత్య సాయి బాబా కమ్యూనిస్టు దేశాధినేత కాదు, మాఫియా డాన్ కాదు. మరి ఎందుకింత రహస్యం. మీడియాని దూరంగా పెట్టడం ఆహ్వానించదగ్గ, హర్షించ దగ్గ విషయమే. కానీ ఆయన స్వంత కుటుంబీకులను బంధువులను ఆయనను చూసేందుకు అనుమతించక పోవడమేమిటి?


అంతకు మించి బాబాని దైవ స్వరూపంగా ఆరాధించే ఆయన భక్తులను కూడా దూరం పెట్టడం భావ్యమా? ఏ భక్తుల మూలంగా అల్లరి చిల్లరగా తిరిగే ఒక మామూలు వ్యక్తి బాబాగా, దైవంగా మారాడో, ఏ భక్తుల వాలన లక్షల కోట్లు( ఒకటిన్నర లక్ష కోట్లు అని పత్రికల కథనం) ఆర్జించాడో అలాంటి భక్తులక్కూడా వాస్తవాలు చెప్పక పోవడం ఎంతవరకూ సమంజసం. 

అసలు బాబా బతికే ఉన్నాడా? లేక వెజిటేటివ్ స్టేట్‌లో యంత్రాల సాయంతో అలా అలా లాక్కొస్తున్నారా? అలా అయితే ఎంతకాలం? ట్రస్టులో సభ్యులు తమ తమ వాటాలు పంచుకొని అన్ని విషయాలు సెటిల్ చేసుకొని అప్పుడు బాబా ఆరోగ్యం గురించిన అసలు సమాచారం అందిస్తారా?

Thursday, April 7, 2011

1983 కప్పు గొప్పదా, 2011 కప్పు గొప్పదా?


1983 లో కపిల్ దేవ్ నాయకత్వంలో సాధించిన ప్రుడెన్షియల్ కప్పుని 2011 లో ధోనీ నాయకత్వంలో సాధించిన ఐసీసీ కప్పుతో పోల్చడం సరి కాదు. అయినా చాలా మంది ప్రముఖులు అందులోనూ తాజా, మాజీ క్రికెటర్లు అప్పటి విజయం కన్నా ఈ నాటి విజయం గొప్పది అని ప్రకటనలు గుప్పిస్తూ ఉంటే ఈ పోస్టు రాయాల్సి వచ్చింది.


  
ఏ విజయం గొప్పదో తెలియాలంటే ఆ నాడు కపిల్స్ డెవిల్స్ ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కప్పు గెలిచారో ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు.


ఆనాడు లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌లో అస్సలు మన వాళ్ళకి సరయిన విజయాలు కానీ గొప్పగా చెప్పుకోదగ్గ చరిత్ర కానీ లేదు. జట్టులో కెవలం ఇద్దరే కొద్దో గొప్పో చెప్పుకోదగ్గ ఆటగాళ్ళున్నారు. తరువాత్తరువాత వాళ్ళు రికార్డులు బద్ధలు కొట్టినా ఆనాటికి గవాస్కర్ కానీ,కపిల్ దేవ్ కానీ రికార్డు హోల్డర్లు కాదు. అందులోనూ అప్పటికి సునీల్ గవాస్కర్‌కి వేగంగా పరుగులు తీసే కాన్సెప్టు ఇంకా అలవడలేదు. ఓవర్లన్నీ అయిపించి, వికెట్లు కాపాడుకుంటే మ్యాచ్ డ్రా చేసుకొవచ్చని భావిస్తున్నట్టే అడుతాడా అన్న అనుమానమొచ్చేలా బ్యాటింగ్ చేశేవాడు.


 
ఇక జట్టుకి సపోర్టింగ్ స్టాఫ్‌గా మాన్ సింగ్ అని ఒకాయనే ఎండే వాడు. కోచ్, మానేజర్, మెంటల్ కండీషనింగ్ ఎక్స్ పర్ట్, బౌలింగ్, బ్యాటిం, ఫీల్డింగ్ అన్నిటికి ఈయనొక్కడే కోచ్. ఆటగాళ్ళ వెనుక కోటాను కోట్లు మూలుగుతున్న వాళ్ళు కూడా జట్టులో లేరు. ఒక వేళ కప్పు గెలిచినా ఆర్ధికంగా పెద్దగా లాభం లేని పరిస్థితి. తిరిగి భారత్ వెళ్ళాక ఎవరికి వాళ్ళు వారి భుక్తి కోసం కష్టపడాల్సిన స్థితి.


ఇప్పుడు ఆలోచించండి 1983, 2011 ల్లో ఏ విజయం గొప్పదో!

Wednesday, April 6, 2011

పూనమ్ పాండే! చూపించింది చాలు, ఇక మూస్తావా?!


ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే తన అందాలన్నీ బట్టలిప్పి ఛూపిస్తానని ఒక చిన్న స్టేట్‌మెంట్ ఇవ్వడం ద్వారా రాత్రికి రాత్రి పాపులర్ అయిన మోడల్ పూనమ్ పాండేని నేను పెద్దగా తప్పు పట్టలేదు.
భారత్ గెలిచినా ఓడినా ఈ అమ్మడు విప్పేదీ ఉండదు, చూపించేదీ ఉండదు అని ఏ మాత్రం తెలివి ఉన్న వాడెవడైనా చెప్తాడు. అప్పటి వరకూ ఎవరికీ తెలియని ఈ పిల్ల పేరు ఒక మాటతో సంచలనమై పోయింది. ఆ చిన్నది కోరుకున్నదీ అదే. ఆ ముద్దు గుమ్మ మాటలకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలెసి ఉంటే ముద్దు గుమ్మ కాస్తా మొద్దు గుమ్మ అయి మరుగున పడి పోయేది. 
Have patience, will strip soon: Poonam Pandey


పని లేక పిల్లి తల గొరుగుతూ కూర్చొని ఉండే మంగలులకి మన దేశంలో కొరత లేదు కాబట్టి మరొక పాండే మహాశయుడు ఈ పిల్ల బ్రాహ్మణ పిల్ల కాబట్టి ఈ స్టేట్‌మెంటుతో బాపనోళ్ళ పరువు గంగలో కలిపిందని కోర్టులో కేసు పెట్టి ఈమెని మరింత పాపులర్ చేశాడు. ఈ కోవకే చెందిన బీజేపీ మహిళామణి ఒకావిడ ఈ అమ్మాయిని గుడ్డలిప్పనివ్వం కాక విప్పనివ్వమని మరింత ఎక్కువ చేసింది.


దంతో ఈ అమ్మడు మరింత రెచ్చిపోయింది. తన నగ్నత్వంతో భారత జట్టుకి స్ఫూర్తినిస్తానని తన అందాలు చూసి జట్టు;లో సభ్యులు మరింత రెచ్చిపోయి ఆడి కప్పు గెలిస్తే అది తనకు ఆనందాన్నిస్తుందనీ, ఒక వేళ భారత్ చట్టం తన నగ్న ప్రదర్శనకు ఒప్పుకోకపోతే BCCI  తనని, భారత క్రికెట్ జట్టునీ పారిస్ తీసుకెళ్తే అక్కడ విప్పి చూపమన్నా తనకి ఓకే అని మరొక పిచ్చి కూత (tweet) కూసింది తన ట్విట్టర్‌లో.
 
ఈ అందగత్తె అందాలు చూడకపోయినా భారత జట్టు అమోఘంగా ఆడి కప్పు గెలవగానే ఈ అమ్మడు తన ఫోన్ స్విచాఫ్ చేసి వెళ్ళిపోయింది. అప్పటినుండీ ఇంటర్నెట్టంతా ఇదే భాగోతం. Facebook, Twitter, yahoo ఒకటేమిటి ఒకటే గోల గోల. నీ అందాల కోసం కొత్త HD  టీవీ కొన్నాను, ఎప్పుడు విప్పి ఛూపిస్తావు అని ఒకడు, నీ కోసం టీవీ ముందే కూర్చుని ఉన్నాను, కమాన్ వచ్చి విప్పు అని మరొకడు ఇలా ఒకటే మెసేజ్‌లు.


సరే ఎంత పూనమ్ పాండే నగ్న సౌందర్యం అయినా రెండు రోజుల్లో మరుగున పడిపోతుంది ఈ స్పీడ్ యుగంలో. అందరూ ఆమెని, ఆమె గుడ్డలిప్పి చూపడం అన్న విషయాన్ని మర్చి పోతున్నారేమోనని భయపడిందేమో గానీ ఈ పిచ్చిది ఈ రోజు తన ట్విట్టర్‌లో ఒక ఫ్రెష్ మెసేజ్ పెట్టింది.
  


once Steve Forbes said "A promise made should be a promise kept." so guys soon will complete my promise just Wait n watch


ఆడిన మాట తప్పను, ఖచ్చితంగా విప్పి చూపిస్తాను, ఓపిక పట్టండి అని. ఇది చూశాక నాకనిపించింది. ఎవరైనా ఆ పిల్లకి చెప్తే బావుణ్ణు, "విప్పడానికి చూపడానికి నీ దగ్గర ఏం మిగిలిందే వెర్రి మొహమా, కింద రెండు ఇంచీలు, పైన రెండు ఇంచీలు తప్ప మిగిలిందంతా ఎప్పటినుండో నీ ఫోటోలలో చూపించేశావ్ కదా! ఇప్పుడు నువ్వు విప్పుతానన్నా చొంగ కార్చుకుంటూ చూడ్డానికి ఎవరూ రెడీగా లేరు. మూసుకుని నీ పని చూసుకో, బాగు పడుతావ్" అని.


Please note: ఈ పిల్ల దగ్గర ఆల్రెడీ అందరికీ చూపించకుండా మిగిలింది ఏమీ లేదని చెప్పడానికి ఒకట్రెండు objectionable photos పెట్టాల్సి వచ్చింది

Monday, April 4, 2011

దేవుడికి వెంటిలేటర్ సపోర్టు పెట్టే మొనగాళ్ళా?


అవును.ఇది మీకందరికీ తెలిసిన విషయమే. టీవీల్లో పేపర్లలో అందరూ చదివే ఉంటారు. దేవుడు స్వంతంగా ఊపిరి తీసుకోలేక వెంటిలేటర్ మీదా, రెండు కిడ్నీలు పాడయ్యి డయాలసిస్ మీద బండి లాగుతున్నాడు.


 
అసలు దేవుడికి జబ్బు చేస్తుందా? మనలాంటి మామూలు మనుషుల్లాగా ఆయనకి వైద్యం అవసరమౌతుందా?ఇదంతా ఆ లీలామానుష చక్రవర్తి. జగన్నాటక సూత్రధారి ఆడుతున్న నాటకమేనా? 


అవును ఇదంతా ఆయన ఆడుతున్న నాటకంలో భాగమే. తన భక్తులకి తన మీద ఉన్న ప్రేమనీ, విశ్వాసాన్నీ, ఆధునిక వైద్య శాస్త్రం యొక్క సామర్ధ్యాన్నీ, తన హాస్పిటల్‌లో ఉన్న డాక్టర్ల మేధస్సునూ పరీక్షకు పెట్టే ప్రయత్నం ఇది. 

చూస్తూ ఉండండి రేపో,యెల్లుండో ఆ మర్నాడో ఆయన తన చేతులకు,ముక్కులోకి.గొంతులోకి పెట్టిన ట్యూబులన్నీ పీకేసి మధ్యందిన మార్తాండుడిలా నడుచుకొంటూ, సారీ వీల్ చైర్‌లో కూర్చుని తోయించుకుంటూ బయటకొచ్చి, చేయెత్తి భక్త కోటిని ఆశీర్వదిస్తాడు.
 


లేదా......? లేకపోతే మాత్రం ఆయన మరణిస్తాడా? నీలాగా నాలాగా ఆయనని మరణం చేరగలదా? సింపుల్‌గా ఈ అవతారాన్ని చాలించి వైకుంఠానికో, కైలాసానికో వెళ్తాడు. లేదా సజీవ సమాధి అయి ఈ భూమ్మీదే భక్త కోటిని సంరక్షిస్తూ ఉంటాడు. ఇంత చిన్న విషయాన్ని అర్ధం చెసుకోలేక ఆయన ఆరోగ్యం మీద ఈ భక్తులూ,బంధువులు,మీడియా వాళ్ళు ఆయన ట్రస్టు వాళ్ళతో గొడవ పెట్టుకుంటారెందుకో. తన కుర్చీకే దిక్కు లేని మన సీఎం ఆయన కోసం ఒక బృందాన్ని పంపడాన్ని చూసి ఆయన లోలోపల నవ్వుకోడూ!?




ఇదంతా ఆయన లీలలో భాగమే, ఆయన ఆడిస్తున్న నాటకమే. చరాచరా జగత్తునీ, ప్రకృతినీ,ప్రాణికోటినీ తన అదుపాగ్నల్లో ఉంచుకొనే ఆ సర్వ శక్తి సంపన్నుడికి వైద్యం చేయడం ఎవరికి సాధ్యం.


ఆయన ఆశ్రమంలో, ఆ చుట్టుపక్కలా సంభవించే మిస్టరీ మరణాలు కానీ, సివిల్స్‌కి సెలక్టయిన ఇద్దరు కుర్రాళ్ళు ఆయన మీద హత్యా ప్రయత్నం వేయడం, ఆ తరువాత కాల్చి చంప బడడం ఈ లీలలో భాగమే ఆయన ఆ కుర్రాళ్ళని తనలో ఐక్యం చేసుకుని ఏ కైలాసానికో, వైకుంఠానికో ట్రాన్స్‌ఫర్ చేసి పారేశాడంతే.



  . బెంగుళూరులో కింద పడి ఆయనకి తుంటి కీలు విరిగినా, ఆపరేషన్ చేసిన సెట్ కాక వీల్ చెయిర్‌లో కూర్చునే పరిస్థితి వచ్చినా అదీ ఆయన లీల తప్ప మరొకటి కాదు. 

అనంతపురంలో భూకంపం పుకార్లు వచ్చినప్పుడు ఆయన ఆశ్రమంలోంచి బయటకొచ్చి పచార్లు చేయడం ప్రాణ భయం వల్ల కాదు. సాక్షాత్తూ భూదేవి నే "చప్పుడు చేయక గమ్మునుండు" అని అదిలించడానికే.


కాబట్టి దేవదేవుడూ, విశ్వానికే చక్రవర్తి అయిన ఆయనకి వైద్య చేయడం, చేయించుకోవడం, ఆయన మరణించడం ఇవన్నీ ఆయనకి వర్తించవు అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. 

Saturday, April 2, 2011

ఇంతలా తెగ బలిసిన వాళ్ళక్కూడా టాక్స్ తగ్గించాలా?


క్రికెట్ ఆడే దేశాల సంఖ్య తక్కువయినా బాగా డబ్బున్న స్పోర్ట్స్ బాడీస్‌లో ICC ఒకటి. దీనికి బాగా డబ్బు జమ చేసేది ప్రపంచ కప్. అందులోనూ ఉపఖండంలో కప్ జరిగినప్పుడు ఇక డబ్బే డబ్బు. ఇక్కడ ఉన్న క్రికెట్ ప్రేమికుల వల్లనయితేనేమి, బాగా బలిసిన కార్పొరేట్ సంస్థల వల్లనయితేనేమి ఈ ప్రాంతంలో కప్ నిర్వహించినప్పుడు దీని ఖజానా నిండిపోతుంది.
 


 
మన ప్రభుత్వానికి బాగా డబ్బున్న వాళ్ళకి రాయితీలివ్వడం అంటే మహా మక్కువ. ఆ మధ్య పాతిక వేల కోట్లు వెచ్చించి ఇల్లు కట్టుకున్న ప్రపంచ టాప్-5 ఐశ్వర్యవంతుల్లో ఒకడయిన ముఖేష్ అంబానీ గారికి కరెంటు బిల్లు సక్రమంగా కట్టినందుకు రాయితీ ఇచ్చి తన ఔదార్యాన్ని చూపించుకున్న విషయం ఇక్కడే ఒక బ్లాగరు గారి పుటల్లో ముచ్చటించుకున్నాం కూడా.


 
ఇప్పుడు మన ఆదాయపన్ను వారికి ఉన్నట్టుండి ICC మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అసలే ఆదాయం ఎక్కువై వచ్చిన డబ్బుని లెక్క పెట్టుకోలేక నానా తంటాలు పడుతున్న వీరిని ఇప్పుడు పన్ను కట్టమంటే అవస్థ పడిపోరూ అని జాలి పడ్డ మన టాక్స్ వాళ్ళు ICC కి ఏకంగా 45 కోట్ల రాయితీ ప్రకటించి తమ క్రీడభిమానాన్ని లేదా క్రికెటాభిమానాన్ని చాటుకొన్నారు.


డబ్బుతో తెగ బలిసిన ICC నుండి న్యాయంగా రావలసిన పన్ను వసూలు చేసి ఇతర క్రీడలమీద ఖర్చు చేయడం లేదా క్రికెట్ మీదే ఖర్చు పెట్టాలనుకొంటే రాష్ట్రాలలో ఉన్న స్టేడియంలలో మౌళిక సదుపాయాలు కల్పించడమో చేస్తే బావుంటుందేమోనని మన లాంటి అల్పులకనిపిస్తే అందులో ఆశ్చర్యం లేకపోయినా IT వారికి అనిపించదేమో?

Friday, April 1, 2011

టీం ఇండియా పట్టించుకోవద్దు ఈ హైపు- ఎక్కించుకోవద్దు కైపు


ప్రపంచ కప్ నాక్ అవుట్ దశలో ఆస్ట్రేలియా మీద తరువాత పాకిస్తాన్ మీద గెలిచిన భారత్ జట్టుని మీడియా ఆకాశానికెత్తేసింది. గెలిస్తే ఆకాశానికి ఓడితే అధఃపాతాళానికి  పంపడం మన మీడియాకు, అభిమానులకు సాధారణం. అయితే ఈ విజయాలు చూడ్డానికి ఎంత గొప్పగా ఉన్నా అవి మరీ అంత ఘన విజయాలేమీ కాదు. ఒక వికెట్, ఒక క్యాచ్ అటూ ఇటూ అయి ఉంటే ఫలితం తారుమారయి ఉండేది.
 


క్వార్టర్ ఫైనల్‌లో ధోనీ అవుటయ్యాక రైనా, యువరాజ్ ఆడుతున్నప్పుడు మరొక వికెట్ పడి ఉంటే మన టైలెండర్లు బరిలోకి దిగాల్సి వచ్చేది. హర్‌భజన్, అశ్విన్,జహీర్, నెహ్రాలు జట్టుని విజయానికి చేర్చేవారా అన్నది అనుమానమే. అలాగే సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ వాళ్ళు సచిన్‌ని సెంచురీ చేయకుండా అవుట్ చేయకూడదని కంకణం కట్టుకొన్నట్లు ఫీల్డిం చేయబట్టి సరిపోయింది గానీ అతనిచ్చిన నాలుగు క్యాచ్‌ల్లో ఏ ఒక్కటి పట్టి ఉన్నా ఫలితం తారుమారయి ఉండేది కదా?
  
కాబట్టి ఈ మీడీయా హైపూ, కైపూ పట్టించుకోకుండా ఆడితే ఫైనల్‌లో శ్రీలంక పైన గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.