1983 లో కపిల్ దేవ్ నాయకత్వంలో సాధించిన ప్రుడెన్షియల్ కప్పుని 2011 లో ధోనీ నాయకత్వంలో సాధించిన ఐసీసీ కప్పుతో పోల్చడం సరి కాదు. అయినా చాలా మంది ప్రముఖులు అందులోనూ తాజా, మాజీ క్రికెటర్లు అప్పటి విజయం కన్నా ఈ నాటి విజయం గొప్పది అని ప్రకటనలు గుప్పిస్తూ ఉంటే ఈ పోస్టు రాయాల్సి వచ్చింది.
ఏ విజయం గొప్పదో తెలియాలంటే ఆ నాడు కపిల్స్ డెవిల్స్ ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కప్పు గెలిచారో ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు.
ఆనాడు లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో అస్సలు మన వాళ్ళకి సరయిన విజయాలు కానీ గొప్పగా చెప్పుకోదగ్గ చరిత్ర కానీ లేదు. జట్టులో కెవలం ఇద్దరే కొద్దో గొప్పో చెప్పుకోదగ్గ ఆటగాళ్ళున్నారు. తరువాత్తరువాత వాళ్ళు రికార్డులు బద్ధలు కొట్టినా ఆనాటికి గవాస్కర్ కానీ,కపిల్ దేవ్ కానీ రికార్డు హోల్డర్లు కాదు. అందులోనూ అప్పటికి సునీల్ గవాస్కర్‌కి వేగంగా పరుగులు తీసే కాన్సెప్టు ఇంకా అలవడలేదు. ఓవర్లన్నీ అయిపించి, వికెట్లు కాపాడుకుంటే మ్యాచ్ డ్రా చేసుకొవచ్చని భావిస్తున్నట్టే అడుతాడా అన్న అనుమానమొచ్చేలా బ్యాటింగ్ చేశేవాడు.
ఇక జట్టుకి సపోర్టింగ్ స్టాఫ్‌గా మాన్ సింగ్ అని ఒకాయనే ఎండే వాడు. కోచ్, మానేజర్, మెంటల్ కండీషనింగ్ ఎక్స్ పర్ట్, బౌలింగ్, బ్యాటిం, ఫీల్డింగ్ అన్నిటికి ఈయనొక్కడే కోచ్. ఆటగాళ్ళ వెనుక కోటాను కోట్లు మూలుగుతున్న వాళ్ళు కూడా జట్టులో లేరు. ఒక వేళ కప్పు గెలిచినా ఆర్ధికంగా పెద్దగా లాభం లేని పరిస్థితి. తిరిగి భారత్ వెళ్ళాక ఎవరికి వాళ్ళు వారి భుక్తి కోసం కష్టపడాల్సిన స్థితి.
ఇప్పుడు ఆలోచించండి 1983, 2011 ల్లో ఏ విజయం గొప్పదో!
4 comments:
ఎప్పటికప్పుడే! మీరు చేపిఇన ప్రతికూలాలన్నీ కూడా ఒక్క వెస్ట్ ఇండీస్ కు (ఆటగాళ్ళ సత్తా) తప్ప మిగిలిన జట్లకూ 1983 మన జట్టు కంటే గొప్ప స్థితిలో లేవు.
ఇప్పుడు అన్ని జట్లకూ కోచులూ , మానసిక నిపుణులూ వగైరాలు ఉన్నారు.
నా ఉద్దేశ్యంలో ఎప్పటి"కప్పు"డే!
నాకైతే 1983 కప్పే నిజాయితీగా కష్టపడి సాధించిన కప్పుగా అనిపిస్తుంది
@ANALYSIS//అనాలిసిస్
అంటే ఇది నిజాయితీగా గెలిచింది కాదు అనా మీ అర్ధం
Nenu siva నేను శివ గారితో పూర్తిగా ఏకీభావిస్తున్నాను.
ఎప్పటి"కప్పు"డే
Post a Comment