పుట్టపర్తి సత్య సాయి బాబా గారికి విమర్శకులెంతమంది ఉన్నారో, అంతకు అనేక రెట్లు వీర భక్తులు, అభిమానులూ ఉన్నారు. స్వామి వారు దైవ స్వరూపులని నమ్మే వాళ్ళు కొందరయితే, ఆయన సాక్షాత్తూ దైవమే అని విశ్వసించే కేటగిరీ మరోటి ఉంది. అయితే అంత దైవాన్ని చుట్టుముట్టి ఆయనకి అత్యంత సమీపంలో ఉండే వాళ్ళకి ఈ నమ్మకాలేమీ ఉన్నట్టు కనిపించడం లేదు.
ఆయన్ని ICUలో పెట్టి ఆయన బంధువులనీ, భక్తులనీ కనీసం చూపుకు కూడా నోచుకోకుండా చేయడం, ఒక పక్క ఆయన మృత్యువుతో పోరాడుతుంటే వీళ్ళు బంగారాన్ని ట్రక్కులలో ఆశ్రమం నుండి తరలించడం, చెక్ పవర్ కోసం తమలో తాము గొడవ పడడం ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి ఆ దేవుడో, లేక దేవుడి రూపమో అయిన వ్యక్తి పట్ల భయ, భక్తులు అటుంచి కనీస గౌరవం కూడా లేదేమోనని నా బోంట్లకి అనిపిస్తుంది. ఇదే విషయాన్ని బయటకి చెబితే నాస్తికుడు, హిందూ మతాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న హేటు వాదులు అని ముద్రవేస్తారు.
కానీ హిందూ మతం మీద నిజమైన అభిమానం ఉన్నవాళ్ళు ఈ బాబాలు, స్వామీజీల వెంటపడడం మానివేసి సర్వవ్యాపితుడు , సర్వ శక్తిసంపన్నుడూ, అది అంత రహితుడూ అయిన సనాతన దైవాన్ని మాత్రమే నమ్మి, ఆ దైవాన్నే ఆరాధించడం మొదలు పెట్టాలని నా కోరిక. అయినా మనకేం తక్కువ? మనకి మూడు కోట్ల మంది దేవుళ్ళుండగా?
18 comments:
Like! Like! Like your logic and article.
భక్తాగ్రేసరుల కామెంట్ల దాడి మొదలౌతుందేమో సిద్ధంగా ఉన్నారా?
భక్తాగ్ర 'అసురులా' :)
కృష్ణగారు, మీరు బాబా వలన మోసపోయారా? మోసపోతే ఎలా మోసపోయారో రాయండి. ఆయనకు డబ్బులు ఇచ్చినవారిలో కనీసం 0.05% మంది కూడా మేము బాబాకు డబ్బులిచ్చి మోసపోయామని ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. ఇక మీరేందుకు రోజు ప్రజలను కళ్ళు తెరవాలి, మేలుకోవాలి అని తెగ వర్రి అవుతున్నారు. ముందర కళ్ళు మీరు తెరవండి. మీరే మైన మోసపోయి ఉంటే దాని గురించి రాయండి. వీలైతే పోలిస్ స్టెషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఊరకనే ఇలా గాసిప్ పేపర్ " తెలుగు వెలుగు" చదివి మీరు మరింత గాసిప్ రాయకండి. సాక్ష్యాలు లేకుండా ఇతరుల నెత్తిన బురద చల్లడానికి మీకున్న అర్హత ఎమీటీ? మీరేంత వరకు నిజాయితి పరులు?
Ram
పేకాటలోనో, గుర్రపు పందేలలోనో డబ్బులు పోగొట్టుకున్నోడు కూడా తాను నష్టపోయాననుకోడు. అలాగని పేకాటనీ, గుర్రపు పందేలనీ జస్టిఫై చెయ్యగలమా?
సత్యసాయిబాబా చేతి నుంచి ఉంగరాలు కూడా తీస్తున్నట్టు ఇల్యూజన్ కలిగిస్తాడు. ఉంగరాన్ని తయారు చెయ్యాలంటే బంగారాన్ని కరిగించి మాడ్యూల్ చెయ్యాలి. మాడ్యూల్ చేసిన తరువాత, ద్రవం చల్లారిన తరువాత అప్పుడు ఉంగరపు వలయం సిద్ధమవుతుంది. బంగారం తేవాలన్నా ముడి ఖనిజపు రాళ్ళని కరిగించి వాటి నుంచి ధూళి పదార్థాలని వేరు చెయ్యాలి. చిన్నప్పుడు మా ఊర్లో కొలిమిలో సీసం తీసి తుపాకీ గుండ్లు తయారు చేసేవాళ్ళు. వాటిని గొట్టంలో పెట్టి మందు పెట్టి పేల్చేవాళ్ళు. సైన్స్‌లో ఏదైనా ప్రోసెస్‌ని అనుసరించి జరుగుతుంది. చూ మంతర్ కాళీ కళంతర్ అంటే బంగారం గానీ సీసం గానీ తయారైపోవు. చేతిని తిప్పితే చేతి నుంచి ఉంగరాలు గానీ గుండ్లు గానీ రావు.
పోనీ జనాన్ని ఆకట్టుకోవడానికి ఏవో ట్రిక్కులు చేసాడు.అది పెద్ద తప్పు కాదు.ఆస్పత్రులు ,విద్యాసంస్థలు ,కొన్ని గ్రామాలకి నీటి సౌకర్యం కలిగించాడు కదా .ఏ గవర్నమెంట్ ఇవన్నీ చెయ్యగలుగుతోంది?దీని గురించి మాట్లాడరేం ?
Thank you Anonymous.భక్తాగ్రేసరుల నుండి నన్ను కాపాడడానికి కొంతమంది పాఠకులు కూడా ఉన్నారుగా.సాయి బాబా గారి నుండి నేను మోసపోయిందేమీ లేదు. అవాతారాలెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి యుగ యుగాలుగా ఉన్న దేవుళ్ళని కని కట్టు గారడీ చేసే వ్యక్తి ఓవర్ టేక్ చేయడం కొంచెం బాధ కలిగించింది అంతే. ట్వంటీ 20 క్రికెట్‌లో ఓ పది సిక్సర్లు కొట్టిన ఆటగాడిని సచిన్ టెండూల్కర్ కన్నా గొప్పవాడని కీర్తిస్తే కలిగే ఫీలింగ్ ఇది. Thanks for the defence, Praveen.
గవర్నమెంట్ చేతకానితనాన్ని విమర్శించాలి కానీ కోట్లు విరాళాలు పోగు చేసే బాబాల మీద ఆధారపడాలనడంలో లాజిక్ లేదు.
ఇందాక నేను రాసిన వ్యాఖ్య - more of personal introspection than the matter of belief and non belief. నా వ్యాఖ్య వెనుక స్ఫూర్తి అనేకులకు అర్థం అవదనే ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య తొలగించాను. కృష్ణ గారికి క్షమాపణలు.
బాబా దేవుడైతే తన ఆస్తి కోసం కక్కుర్తి పడుతున్నవాళ్ళని తన దివ్య దృష్టితో ఎందుకు కనిపెట్టలేకపోయాడు? ట్రస్ట్ సభ్యులు ఒకరినొకరు విభేదించుకున్న తరువాతే విషయం ఎందుకు బయటకొచ్చింది?
*భక్తాగ్రేసరుల నుండి నన్ను కాపాడడానికి కొంతమంది పాఠకులు కూడా ఉన్నారుగా.*
ఆ పాఠకుల విలువ ఎంతో బ్లాగులు చదివే ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు తెలియక పోవటం దురదృష్టకరం. ఆయన మద్దతు నిచ్చాడు అని ఎక్కడైనా గొప్పగా చెప్పుకొనేరు. ఆయన రాసిన అన్ని కామేంట్లొ మీ బ్లాగులో ఉంటె మీ బ్లాగు విలువ పడిపోతుంది.ముందర అదిగ్రహించండి. 1900 samvatsaram పుస్తకాలు చదివి 2010 లో జీవించొద్దు.
Ram
Ram, 1900 కన్నా 2010 లో మనం మరింత లాజికల్‌గా తెలివి తేటలు పెంచుకొని ఆలోచించాలి. మరింత వెనక్కి ఏ 1800 లోకో వెళ్తామంటే ఎలా?
Ravi క్షమాపణలు అవసరం లేదు. మీ కామెంట్లు అర్ధం చేసుకున్నావాళ్ళు చేసుకుంటారు. లేకపోతే లేదు. అంతే.
Ram, 1900 కన్నా 2010 లో మనం మరింత లాజికల్‌గా తెలివి తేటలు పెంచుకొని ఆలోచించాలి. మరింత వెనక్కి ఏ 1800 లోకో వెళ్తామంటే ఎలా?
Ravi క్షమాపణలు అవసరం లేదు. మీ కామెంట్లు అర్ధం చేసుకున్నావాళ్ళు చేసుకుంటారు. లేకపోతే లేదు. అంతే.
సత్యసాయిబాబా చనిపోయాడు కానీ ట్రస్ట్‌వాళ్ళు షిరిడీ సాయిబాబాకి కట్టినట్టు సత్యసాయిబాబాకీ దేవాలయాలు కట్టగలరు. బాబా చనిపోకముందే అతని బంధువులు బాబా ఆస్తి నాదంటే నాది అంటూ ముందుకొచ్చారు. సాయిబాబా దేవుడు కాదు, సాధారణ మనిషే కానీ అతని బంధువులు బంధువు చనిపోతున్నాడని బాధ లేకుండా ఆస్తి కోసం ప్రయత్నాలు చెయ్యడం మానవ విలువలని మంటగలిపేదే. ఇప్పుడు చనిపోయిన తరువాత ఆస్తి నాటకం ముగిసిందే కానీ నమ్మకాల వ్యాపారం ముగిసిపోలేదు.
కొంత మంది ఈ బ్లాగులని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బాబాలని నమ్మని ప్రతివారూ హిందూ మత వ్యతిరేకులు కారు. హిందువులందరూ ఈ బాబాలని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. సత్య సాయి ట్రస్ట్ చేసిన మంచి పనులకు వారిని అందరూ అభిమానిస్తారు. అయితే అదే సమయం లో గురు స్థానం లో ఉండాల్సిన వ్యక్తి తననే భగవంతునిగా ప్రకటించుకుంటే అహం తలకెక్కినట్లే. మన పురాణాల్లో దేవుడు ఎపుడూ తనని తాను ప్రకటించుకోలేదు. తెలుసుకోవాల్సిన వారు స్వయంగా తెలుసుకున్నారు దేవుడిని.
సత్య సాయి మేజికులు చేయడానికి కూడా ఒక రకంగా మన అఙ్ఞానమే కారణమేమో. దేవుడి పేరు చెబితే తప్ప మనం ఒకరికి ఎపుడూ సాయం చేయము కదా మరి!!
Thank you very much, sree.
Post a Comment