ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే తన అందాలన్నీ బట్టలిప్పి ఛూపిస్తానని ఒక చిన్న స్టేట్‌మెంట్ ఇవ్వడం ద్వారా రాత్రికి రాత్రి పాపులర్ అయిన మోడల్ పూనమ్ పాండేని నేను పెద్దగా తప్పు పట్టలేదు.
భారత్ గెలిచినా ఓడినా ఈ అమ్మడు విప్పేదీ ఉండదు, చూపించేదీ ఉండదు అని ఏ మాత్రం తెలివి ఉన్న వాడెవడైనా చెప్తాడు. అప్పటి వరకూ ఎవరికీ తెలియని ఈ పిల్ల పేరు ఒక మాటతో సంచలనమై పోయింది. ఆ చిన్నది కోరుకున్నదీ అదే. ఆ ముద్దు గుమ్మ మాటలకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలెసి ఉంటే ముద్దు గుమ్మ కాస్తా మొద్దు గుమ్మ అయి మరుగున పడి పోయేది.
పని లేక పిల్లి తల గొరుగుతూ కూర్చొని ఉండే మంగలులకి మన దేశంలో కొరత లేదు కాబట్టి మరొక పాండే మహాశయుడు ఈ పిల్ల బ్రాహ్మణ పిల్ల కాబట్టి ఈ స్టేట్‌మెంటుతో బాపనోళ్ళ పరువు గంగలో కలిపిందని కోర్టులో కేసు పెట్టి ఈమెని మరింత పాపులర్ చేశాడు. ఈ కోవకే చెందిన బీజేపీ మహిళామణి ఒకావిడ ఈ అమ్మాయిని గుడ్డలిప్పనివ్వం కాక విప్పనివ్వమని మరింత ఎక్కువ చేసింది.
దంతో ఈ అమ్మడు మరింత రెచ్చిపోయింది. తన నగ్నత్వంతో భారత జట్టుకి స్ఫూర్తినిస్తానని తన అందాలు చూసి జట్టు;లో సభ్యులు మరింత రెచ్చిపోయి ఆడి కప్పు గెలిస్తే అది తనకు ఆనందాన్నిస్తుందనీ, ఒక వేళ భారత్ చట్టం తన నగ్న ప్రదర్శనకు ఒప్పుకోకపోతే BCCI తనని, భారత క్రికెట్ జట్టునీ పారిస్ తీసుకెళ్తే అక్కడ విప్పి చూపమన్నా తనకి ఓకే అని మరొక పిచ్చి కూత (tweet) కూసింది తన ట్విట్టర్‌లో.
ఈ అందగత్తె అందాలు చూడకపోయినా భారత జట్టు అమోఘంగా ఆడి కప్పు గెలవగానే ఈ అమ్మడు తన ఫోన్ స్విచాఫ్ చేసి వెళ్ళిపోయింది. అప్పటినుండీ ఇంటర్నెట్టంతా ఇదే భాగోతం. Facebook, Twitter, yahoo ఒకటేమిటి ఒకటే గోల గోల. నీ అందాల కోసం కొత్త HD టీవీ కొన్నాను, ఎప్పుడు విప్పి ఛూపిస్తావు అని ఒకడు, నీ కోసం టీవీ ముందే కూర్చుని ఉన్నాను, కమాన్ వచ్చి విప్పు అని మరొకడు ఇలా ఒకటే మెసేజ్‌లు.
సరే ఎంత పూనమ్ పాండే నగ్న సౌందర్యం అయినా రెండు రోజుల్లో మరుగున పడిపోతుంది ఈ స్పీడ్ యుగంలో. అందరూ ఆమెని, ఆమె గుడ్డలిప్పి చూపడం అన్న విషయాన్ని మర్చి పోతున్నారేమోనని భయపడిందేమో గానీ ఈ పిచ్చిది ఈ రోజు తన ట్విట్టర్‌లో ఒక ఫ్రెష్ మెసేజ్ పెట్టింది.
ఆడిన మాట తప్పను, ఖచ్చితంగా విప్పి చూపిస్తాను, ఓపిక పట్టండి అని. ఇది చూశాక నాకనిపించింది. ఎవరైనా ఆ పిల్లకి చెప్తే బావుణ్ణు, "విప్పడానికి చూపడానికి నీ దగ్గర ఏం మిగిలిందే వెర్రి మొహమా, కింద రెండు ఇంచీలు, పైన రెండు ఇంచీలు తప్ప మిగిలిందంతా ఎప్పటినుండో నీ ఫోటోలలో చూపించేశావ్ కదా! ఇప్పుడు నువ్వు విప్పుతానన్నా చొంగ కార్చుకుంటూ చూడ్డానికి ఎవరూ రెడీగా లేరు. మూసుకుని నీ పని చూసుకో, బాగు పడుతావ్" అని.
Please note: ఈ పిల్ల దగ్గర ఆల్రెడీ అందరికీ చూపించకుండా మిగిలింది ఏమీ లేదని చెప్పడానికి ఒకట్రెండు objectionable photos పెట్టాల్సి వచ్చింది
2 comments:
అయినా ఈ పిల్ల దగ్గర సరుకు ఏమీ ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. sunny leone or alison angel కంటే అందగత్తెనా ఏమిటి? ఏది ఏమైనా కాని, మేం చూడకముందే మీరు మూసెయ్యమనటం మాత్రం బాధాకరం :)
చూశాక వాళ్ళకి జీవితం మీదనే విరక్తి వస్తేనో? అందుకే మూసేసింది.
Post a Comment