ప్రపంచ కప్ నాక్ అవుట్ దశలో ఆస్ట్రేలియా మీద తరువాత పాకిస్తాన్ మీద గెలిచిన భారత్ జట్టుని మీడియా ఆకాశానికెత్తేసింది. గెలిస్తే ఆకాశానికి ఓడితే అధఃపాతాళానికి పంపడం మన మీడియాకు, అభిమానులకు సాధారణం. అయితే ఈ విజయాలు చూడ్డానికి ఎంత గొప్పగా ఉన్నా అవి మరీ అంత ఘన విజయాలేమీ కాదు. ఒక వికెట్, ఒక క్యాచ్ అటూ ఇటూ అయి ఉంటే ఫలితం తారుమారయి ఉండేది.
క్వార్టర్ ఫైనల్‌లో ధోనీ అవుటయ్యాక రైనా, యువరాజ్ ఆడుతున్నప్పుడు మరొక వికెట్ పడి ఉంటే మన టైలెండర్లు బరిలోకి దిగాల్సి వచ్చేది. హర్‌భజన్, అశ్విన్,జహీర్, నెహ్రాలు జట్టుని విజయానికి చేర్చేవారా అన్నది అనుమానమే. అలాగే సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ వాళ్ళు సచిన్‌ని సెంచురీ చేయకుండా అవుట్ చేయకూడదని కంకణం కట్టుకొన్నట్లు ఫీల్డిం చేయబట్టి సరిపోయింది గానీ అతనిచ్చిన నాలుగు క్యాచ్‌ల్లో ఏ ఒక్కటి పట్టి ఉన్నా ఫలితం తారుమారయి ఉండేది కదా?
కాబట్టి ఈ మీడీయా హైపూ, కైపూ పట్టించుకోకుండా ఆడితే ఫైనల్‌లో శ్రీలంక పైన గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.
No comments:
Post a Comment