నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, November 3, 2011

72 రోజుల్లో పెళ్ళి+హనీమూన్+విడాకులు=కోట్లు కోట్లు


పెళ్ళి, హనీ మూన్, విడాకులు ఇవన్నీ డబ్బు వదిలించే పనులు. కానీ ఇది మనలాంటి మామూలు మనుషులకు. సెలబ్రిటీలు, పేజ్-3 జీవులు కొందరు ఉంటారు. వారికి ఇవన్నీ డబ్బులు పుట్టించే వ్యవహారాలు. వాళ్ళు పెళ్ళి గురించి ప్రకటన చేస్తే డబ్బు, పెళ్ళి చేసుకుంటే డబ్బు, హనీ మూన్‌కి వెళ్తే డబ్బు, చివరికి విడాకులు తీసుకున్నా డబ్బే. అమెరికాలో కిమ్ కర్డాషియాన్ అన్న టీవీ రియాలిటీ షో యాక్టర్, మోడల్, అడపా దడపా నటి ఈ విషయాన్ని ఇటీవల నిజం చేసి చూపించింది. 




31 సంవత్సరాల ఈ చిన్నది రెండు నెలల క్రితం క్రిస్ హంఫ్రీస్ అనే 26 సంవత్సరాల బాస్కెట్ బాల్ ఆటగాడిని పెళ్ళి చేసుకుంది. ఇది అతనికి మొదటి పెళ్ళి కాగా అమ్మడికి రెండవది.



 పెళ్ళి గురీంచిన ప్రకటన తమ పత్రికలోనే రావడానికి  ఒక పత్రిక అమ్మడికి మిలియన్ డాలర్లు ఇచ్చిందట. పెళ్ళి ఫోటోల ఎక్స్‌క్లూజివ్ రైట్స్ కోసం పీపుల్ అన్న పత్రిక ఒకటిన్నర మిలియన్లు అంటే అటూ ఇటూగా ఏడున్నర కోట్ల రూపాయలు, సమర్పించుకుంది. ఇక పెళ్ళి తంతు వీడియోని E!న్యూస్ చానల్ మరింత డబ్బు ఇచ్చుకొని కొనుక్కుంది. పెళ్ళికి వచ్చిన బహుమతుల విలువ కూడా కోట్లలో ఉంటుంది.




హనీమూన్ కోసం ఇటలీలో ఒక ఖరీదైన రిసార్టుకి వెళ్ళి ఆ ఫోటోలని పత్రికలకి అమ్మి సొమ్ము చేసుకుంది.
Basking in the sunshine: The pair relaxed in the sun as they made the most of their time together Beach bodies: The couple made the most of the warm weather on Italy's Amalfi coast, soaking up the sunshine and enjoying cooling dips in the pool Cuddling up: The couple looked more interested in kissing and cuddling than exploring the local attractions
 చిలకా గోరింకల్లా పది వారాలు గడిపి సరిగ్గా 72 రోజులకి విడాకులు తీసుకున్నారు. విడాకుల వార్త బయటకి పొక్కగానే వీళ్ల పెళ్ళి వీడియో మళ్ళీ టెలికాస్టు చేసి E!న్యూస్ మళ్ళీ రేటింగులు పెంచుకుంది. పెళ్ళికి బహుమతులు సమర్పించుకున్న వాళ్ళు ఫీలవకూడదని ఓ రెండు లక్షల డాలర్లు చారిటీకి ఇస్తానని ప్రకటించింది ఈ కిమ్ ముద్దుగుమ్మ.


అయితే ఈ కర్డాషియన్‌ల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇదంతా డబ్బు కోసం ఈ చిన్నది ఆడుతున్న నాటకమని మధ్యలో ఈ మొగుడు పాత్ర వేసినవాడు ఫూల్ అయిపోయాడని అంటున్నారు.ఇప్పుడు ఈ విడాకుల వ్యవహారంలో ఇంకెంత డబ్బు పోగేస్తుందో ఈ చిన్నది అని అప్పుడే కొందరు లెక్కలేయడం ప్రారంభించారు.

అయితే ఈ తొక్కలో పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంతలా కోట్లు పోసి కొనుక్కొని చూపించడం, అవి నోళ్ళు వెళ్ల బెట్టుకొని చూసే ప్రేక్షకులు ఉండడం చూశాక మన టీవీ చానళ్లలో డైలీ సీరియళ్ళు చూసే వాళ్ల మీద నాకున్న దురభిప్రాయం చాలా వరకూ తొలిగిపోయింది.

Tuesday, November 1, 2011

శవం లేచి నడిచి వస్తే


శవాలు కూడా లేచి కూర్చునే అందం నీది అంటాడు రాజేంద్ర ప్రసాద్ ఒక అమ్మాయితో తేనెటీగ సినిమాలో. శవాలు సమాధుల్లోంచి లేచి డాన్స్ చేస్తాయి మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ పాటలో. చిరంజీవి కూడా కాష్మోరా కౌగిలిస్తే ఏం చెస్తావో అని ఆ పాటని కాపీ కొట్టి శవాలని లేపాడు ఒక పాటలో. శవం పోస్ట్ మార్టం బల్ల పైనుండి లేచి వస్తే ఎలా ఉంటుందో హైడీ క్లమ్ అనే మోడల్/నటి/ఫ్యాషన్ డిజైనర్ మొన్న ఒక పార్టీలో చూపించింది.


 
అక్టోబర్ 31న హాలొవీన్ అనే దెయ్యల పండగ చేసుకుంటారు అమెరికా వాళ్ళు. ఇంటి ముందు ఒక గుమ్మడి కాయని లోపల గుజ్జు తీసి, దీపం వెలిగించి తగిలిస్తారు. పిల్లలు దెయ్యాల మాస్కులు ధరించి ఇంటింటికి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని కేకులు, చాక్‌లెట్లూ దండుకుంటారు. ఇందులో భాగంగా ఒక ఫ్యాన్సీడ్రెస్ వెడుకలో హెయిడీ క్లమ్ అనే ఈ అమ్మడు ఇలా పోస్ట్ మార్టం జరుపుకున్న శవంలా రంగులు వేసుకుని, మరింత సహజత్వం కోసం ఒక స్ట్రెచర్ మీద పక్కన రక్తం మరకలయిన డాక్టరుతొ సహా ఎంట్రీ ఇచ్చింది.


Her most intricate Halloween outfit yet? Heidi Klum went all out for her annual party, and was wheeled in to the TAO nightclub on an autopsy table by two blood-spattered doctors Leaving nothing to the imagination: Heidi's 'dead body' costume showed the body with the first layer of skin ripped off Preparations: Heidi kept fans updated on the progress of the costume by posting shots of the stages on Twitter Getting there: Heidi posted a shot which showed the 'road map' of the make-up, before sharing one which showed her having the make-up applied by airbrushing it on Finishing touches: Heidi completed the astonishingly realistic outfit with a pair of rotten teeth Finishing touches: Heidi completed the astonishingly realistic outfit with a pair of rotten teeth
ఆ రంగులు కూడా చాలా సహజంగా అనాటమీ టెక్స్ట్ బుక్‌లో చూసి వేసినట్టు వేశాడు ఆ పెయింటర్. "చర్మం తొలిగిస్తే శవం ఎలా ఉంటుందో అలా కనిపించాలని ఎనిమిది గంటలపాటు కదలకుండా కూర్చుని ఈ వేషం వేశాను" అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. మొత్తానికి ఈమె శ్రమ ఫలించి వచ్చిన అతిధులు ఈ వేషాన్ని చూడగానే వావ్ అన్నారట.

Sunday, October 30, 2011

ఆపరేషన్ లేకుండా వక్షోజాల సైజు పెరగాలంటే


ఆడవారికి తమ శరీరం గురించి, అందులోనూ ముఖ్యంగా తమ వక్షోజాల సైజు గురించి పట్టింపు ఎక్కువ. అందరికీ ఆస్తి పాస్తులు ఎక్కువగా ఉండనట్టే ఈ సైజులో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. తగినంత సైజు లేకపోతే ఒకప్పుడు మన సాంప్రదాయక చీరకట్టులో కొద్దోగొప్పో దాచిపెట్టే వీలు ఉండేది. కానీ ఇప్పుడు టీ షర్టులూ జీన్సు వచ్చాక ఆ వెసులుబాటు లేకుండా పోయింది. ప్యాడెడ్ బ్రాలతో కొంతవరకూ మానేజ్ చేయవచ్చు కానీ, అప్పుడు లోనెక్ షర్టులు వేయడానికి వీలు కాదు. ఉన్నదాంతో సరిపెట్టుకోవచ్చు కదా అంటే ఆడవారి శరీరం ఈ సైజుల్లో ఉండాలని 34-26-36, 36-28-38 ఇలా కొలతలు తీర్మానించేశారు సినిమాలూ, టీవీలు, మ్యాగజైన్స్ వాళ్ళు.


 
ఈ సైజులలోకి రావడానికి ఓపిక డబ్బూ ఉన్నవాళ్లు మరి ముఖ్యంగా సౌందర్యాన్ని పెట్టుబడిగా వాడే వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్లని ఆశ్రయించి చిన్నవిగా ఉంటే breast augmentation అని, మరీ పెద్దవిగా ఉంటే breast reduction అని, బిగి సడలి జారిపోయినట్లు ఉంటే mastopexy అని రకరకాల ఆపరేషన్లతో తమ శరీరాన్ని తమకు నచ్చినట్లు మలచుకొంటున్నారు. అయితే ఆపరేషన్ అంటే భయం ఉన్నవాళ్ళకి ఆపరేషన్ లేకుండా సైజు పెంచుతామని నకిలీ వైద్యులు సొమ్ము చేసుకుంటారు.
  


సౌత్ డిల్లీలో ఒక బ్యూటీ పార్లర్ నిరావహుకురాలు ఇలాగే నాలుగు ఇంజెక్షన్లు ఇచ్చి వక్షాల సైజు గ్యారంటిగా పెంచుతానని డబ్బులు దండుకొని అక్కా చెల్లెళ్ళు ఇద్దరి మీద ప్రాయోగం చేసి కటకటాల పాలయింది.

 "నాలుగంటే నాలుగు ఇంజెక్షన్లు వేయించుకుంటే చాలని, కావాలంటే రాత పూర్వకంగా గ్యారంటి ఇస్తానని డబ్బు తీసుకుని రొమ్ములలోకి పదిహేను ఇంజెక్షన్లు చేసింది. సైజు పెరగడం మాట దేవుడెరుగు, ఇప్పుడు రూమ్ములపైన నీలంరంగు మచ్చలు, ఒకటే నొప్పి దురదా వచ్చాయి" అని ఆ అక్కా చెల్లెలు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు మామూలుగానేIPC 420,337 సెక్షన్ల కింద 
  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.

Saturday, October 29, 2011

విమానంలోనుండి నేను తీసిన అండమాన్ ఫోటోలు


చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వెళ్ళే కింగ్ ఫిషర్ విమానంలో విండో సీట్‌లో కూర్చుని పోర్ట్ బ్లెయిర్ సమీపిస్తుండగా నా సోనీ కెమెరాతో తీసిన ఫోటోలు ఇవి. నేను ఫోటోలు తీస్తుండగా ఎయిర్ హోస్టెస్ చూసింది కానీ నన్ను టెర్రరిస్టుగా భావించలేదేమో అభ్యంతరం చెప్పలేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆపమని మాత్రం చెప్పింది.




























Friday, October 28, 2011

నెట్‌లో సెక్స్ చూడడం ఎక్కువైతే బెడ్‌లో చేయడం తక్కువ అవుతుంది. .



బూతు బొమ్మల్నీ, బూతు సాహిత్యాన్ని ఇంగ్లీషులో ముద్దుగా పోర్నోగ్రఫీ అని పిలుస్తారు. ఈ పోర్నొగ్రఫీ అనేది ఎప్పటినుండో ఉంది. ఖజురహోలోనూ, దేవాలయాల మీదా ఉండేది పోర్న్ అవునా కాదా అన్న వాదనలోకి వెళ్ళకుండా ఉంటే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ పుస్తకాలలో అక్కడక్కడా అమ్మాయిల బొమ్మలతో బ్రహ్మచారుల గదుల్లో పరుపుల కింద ఉన్న ఈ పోర్న్ ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని ఎక్కడ పడితే అక్కడ విశృంఖలంగా దొరుకుతూంది.
   
తెల్ల పిల్లలు, నల్ల పిల్లలు, వొంపు సొంపుల వయ్యారి భామలు, చూపించి చూపించనట్టు కొన్ని భాగాలు మాత్రమే చూపించే వాళ్ళు, వొళ్ళంతా విప్పి అంతా చూపించే వాళ్ళు, శృంగారం వొలికించే సాఫ్ట్ పోర్న్, వెగటు పుట్టించే హార్డ్ కోర్ ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వారికి బూతు ఇప్పుడు నెట్‌లో దొరుకుతూంది. అయితే ఇలా పోర్నోగ్రఫీ చూడడానికి అలవాటు పడితే అసలుకే మోసమొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకి చెందిన సైకాలజీ టుడే అన్న జర్నల్‌లో మార్నియా రాబిన్‌సన్ అనే ఒక సైకాలజిస్ట్ రాసిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో ఈ విషయాన్ని వెల్లడి చేశారు. బూతు బొమ్మలు అతిగా చూడడం వల్ల ఇరవై పాతిక యేళ్ళకే నపుంసకత్వం వచ్చే అవకాశం ఉందని ఆ వ్యాసం హెచ్చరిస్తూంది.
 


మనసులో శృంగార భావాలు కలిగినప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం ఉత్పత్తి జరిగి అది ఇతర భాగాలకి సంకేతాలు పంపి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. దీనివలన అంగ స్తంభన జరగడం, గుండె వేగం పెరగడం లాంటి మార్పులు సంభవిస్తాయి. తెర మీద బూతు బొమ్మలు చూసినప్పుడు కూడా ఈ మార్పులు సంభవిస్తాయి. కానీ ఇలా మాటిమాటికి బూతు బొమ్మలు చూసినప్పుడల్లా ఈ డోపమైన్ స్రవించి కొన్నాళ్ళకి మెదడులోని కణాలు ఆ రసాయనానికి స్పందించడం తగ్గిపోతుంది. దాంతో ఆ వ్యక్తి సాధారణ భావాలకి స్పందించడం మానివేస్తాడు. నెట్‌లో చూసే extreme sex బొమ్మలు మాత్రమే అతనిలో శృంగార ప్రేరణ కలిగిస్తుంది. పక్కకి అమ్మాయి వచ్చి పడుకున్నా అతని శరీరం స్పందించదు. తను చూసే బొమ్మల్లో, వీడియోలో ఉన్నట్టు కనిపిస్తే మాత్రమే అతనికి స్పందన కలుగుతుంది. అందరు ఆడవాళ్ళు అలా చేయరు కాబట్టి పడకటింట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. Porn induced sexual dysfunction గా అభివర్ణించే ఈ సమస్యనుండి బయట పడాలంటే కొన్నాళ్ళు దీనికి దూరంగా ఉండడమే మార్గం అని ఆ వ్యాస రచయిత చెప్పారు.




Saturday, October 22, 2011

నలభై వేల రూపాయల I-Phone తయారీకి ఖర్చయ్యేది పది వేలే!



బ్రాండ్ నేమ్ చాలా బలమైనది. ఒక సారి ఒక బ్రాండ్ వినియోగ దారుల మనసుల్లో బలంగా నాటుకుంటే అది చెరిగిపోదు. ఈ నాటడం కోసమే అనేక కంపెనీలు కోట్లు దారపోసి క్రికెటర్లనూ, సినీ తారలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా వాడుకుంటారు. అలాంటి ఒక బ్రాండ్ ఆపిల్. ఆ సంస్థ తయారుచేసే వస్తువులు కొనడానికి కొత్త ప్రోడక్టు ఏదైనా విడుదల అయ్యేముందు ఆపిల్ షాపుల ముందు రెండు మూడు రోజులనుండే టెంట్లు వేసుకొని క్యూలలో ఉంటారు జనం. 
   

కొత్త ఐ ఫోను ఎవరైనా కొనిస్తే అతనికి తన కన్యాత్వాన్ని అర్పిస్తానని ఆ మధ్య ఒక యువతి ఇంటర్నెట్‌లో ఆఫర్ ఇచ్చింది. ఐ ప్యాడ్ కొనడానికి ఒక చైనా కుర్రవాడు  ఏకంగా తన కిడ్నీనే అమ్మి పారేశాడు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే ఆపిల్ సంస్థ ఎంత ధర పెట్టినా వెచ్చించి ఆ కంపెనీ ఉత్పత్తులను జనం వెర్రిగా కొంటున్నారు. అయితే నిజంగా అవి అంత ఖరీదు చేస్తాయా అని కొందరు నిపుణులు వాటిని పరీక్షించి చూస్తే వెల్లడి అయిన నిజాలు చూడండి.


ఐ సప్ప్లై అనే సంస్థకి చెందిన నిపుణులు లేటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ 4S ని విడదీసి ఆ విడి భాగాల ఖరీదు లెక్క కడితే అది 120 పౌండ్లుగా తేలింది. అదే ఫోను 32 GB వెర్షన్ 499 పౌండ్లకి అమ్ముడు బోతూంది. మన కరెన్సీలో చూస్తే తయారీకి అయ్యేది పది వేలయితే అమ్మేది నలభై వేలు. ఈ అధిక ధర ఆ ఫోన్ కోసం ఆ కంపెనీ వెచ్చించిన రీసెర్చ్, డెవలప్‌మెంట్ తదితరాలకూ, కంపెనీకున్న ఇమేజ్‌కీ వినియోగదారుడు చెల్లిస్తున్నట్టు అనుకోవాలి. ఐ ఫోన్‌తో అన్ని విధాలుగా పోల్చదగ్గ శామ్‌సంగ్ S2 ఫోన్ 32 వేలకే దొరుకుతుంది. ఐ ఫోన్‌లో వాడే మెమరీ చిప్స్ తయారుచేసేది శామ్‌సంగ్ కావడం ఒక విశేషం. శామ్‌సంగ్ కంపెనీ నుండి మెమరీ చిప్స్ కొనుగోలు చేసే కంపెనీలలో అతి పెద్దది ఆపిల్.

Tuesday, October 18, 2011

నా బ్లాగ్ ఇప్పుడు లక్షాధికారి

పోయిన సంవత్సరం జనవరిలో నేను మొదలు పెట్టిన ఈ బ్లాగ్ ఈ రోజే ఒక లక్ష పేజ్ వ్యూస్ పుర్తి చేసుకుంది. ఇందుకు కారణమైన నా బ్లాగ్ వీక్షకులందరికీ ధన్యవాదాలు.
  
  
 ఈ పయనంలో నేను కూడా మీచేతిలో కొన్ని సార్లు వీర తాళ్ళు, కొన్ని సార్లు అక్షింతలూ వేయించుకొన్నాను. ఏది ఏమైనా నా బ్లాగ్ చూసిన వారికీ, కామెంట్లు పెట్టిన వారికీ మరొక సారి హృదయపూర్వక ధన్యవాదాలు.