బూతు బొమ్మల్నీ, బూతు సాహిత్యాన్ని ఇంగ్లీషులో ముద్దుగా పోర్నోగ్రఫీ అని పిలుస్తారు. ఈ పోర్నొగ్రఫీ అనేది ఎప్పటినుండో ఉంది. ఖజురహోలోనూ, దేవాలయాల మీదా ఉండేది పోర్న్ అవునా కాదా అన్న వాదనలోకి వెళ్ళకుండా ఉంటే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ పుస్తకాలలో అక్కడక్కడా అమ్మాయిల బొమ్మలతో బ్రహ్మచారుల గదుల్లో పరుపుల కింద ఉన్న ఈ పోర్న్ ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని ఎక్కడ పడితే అక్కడ విశృంఖలంగా దొరుకుతూంది.
తెల్ల పిల్లలు, నల్ల పిల్లలు, వొంపు సొంపుల వయ్యారి భామలు, చూపించి చూపించనట్టు కొన్ని భాగాలు మాత్రమే చూపించే వాళ్ళు, వొళ్ళంతా విప్పి అంతా చూపించే వాళ్ళు, శృంగారం వొలికించే సాఫ్ట్ పోర్న్, వెగటు పుట్టించే హార్డ్ కోర్ ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వారికి బూతు ఇప్పుడు నెట్‌లో దొరుకుతూంది. అయితే ఇలా పోర్నోగ్రఫీ చూడడానికి అలవాటు పడితే అసలుకే మోసమొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకి చెందిన సైకాలజీ టుడే అన్న జర్నల్‌లో మార్నియా రాబిన్‌సన్ అనే ఒక సైకాలజిస్ట్ రాసిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో ఈ విషయాన్ని వెల్లడి చేశారు. బూతు బొమ్మలు అతిగా చూడడం వల్ల ఇరవై పాతిక యేళ్ళకే నపుంసకత్వం వచ్చే అవకాశం ఉందని ఆ వ్యాసం హెచ్చరిస్తూంది.
మనసులో శృంగార భావాలు కలిగినప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం ఉత్పత్తి జరిగి అది ఇతర భాగాలకి సంకేతాలు పంపి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. దీనివలన అంగ స్తంభన జరగడం, గుండె వేగం పెరగడం లాంటి మార్పులు సంభవిస్తాయి. తెర మీద బూతు బొమ్మలు చూసినప్పుడు కూడా ఈ మార్పులు సంభవిస్తాయి. కానీ ఇలా మాటిమాటికి బూతు బొమ్మలు చూసినప్పుడల్లా ఈ డోపమైన్ స్రవించి కొన్నాళ్ళకి మెదడులోని కణాలు ఆ రసాయనానికి స్పందించడం తగ్గిపోతుంది. దాంతో ఆ వ్యక్తి సాధారణ భావాలకి స్పందించడం మానివేస్తాడు. నెట్‌లో చూసే extreme sex బొమ్మలు మాత్రమే అతనిలో శృంగార ప్రేరణ కలిగిస్తుంది. పక్కకి అమ్మాయి వచ్చి పడుకున్నా అతని శరీరం స్పందించదు. తను చూసే బొమ్మల్లో, వీడియోలో ఉన్నట్టు కనిపిస్తే మాత్రమే అతనికి స్పందన కలుగుతుంది. అందరు ఆడవాళ్ళు అలా చేయరు కాబట్టి పడకటింట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. Porn induced sexual dysfunction గా అభివర్ణించే ఈ సమస్యనుండి బయట పడాలంటే కొన్నాళ్ళు దీనికి దూరంగా ఉండడమే మార్గం అని ఆ వ్యాస రచయిత చెప్పారు.
No comments:
Post a Comment