బ్రాండ్ నేమ్ చాలా బలమైనది. ఒక సారి ఒక బ్రాండ్ వినియోగ దారుల మనసుల్లో బలంగా నాటుకుంటే అది చెరిగిపోదు. ఈ నాటడం కోసమే అనేక కంపెనీలు కోట్లు దారపోసి క్రికెటర్లనూ, సినీ తారలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా వాడుకుంటారు. అలాంటి ఒక బ్రాండ్ ఆపిల్. ఆ సంస్థ తయారుచేసే వస్తువులు కొనడానికి కొత్త ప్రోడక్టు ఏదైనా విడుదల అయ్యేముందు ఆపిల్ షాపుల ముందు రెండు మూడు రోజులనుండే టెంట్లు వేసుకొని క్యూలలో ఉంటారు జనం.
కొత్త ఐ ఫోను ఎవరైనా కొనిస్తే అతనికి తన కన్యాత్వాన్ని అర్పిస్తానని ఆ మధ్య ఒక యువతి ఇంటర్నెట్‌లో ఆఫర్ ఇచ్చింది. ఐ ప్యాడ్ కొనడానికి ఒక చైనా కుర్రవాడు ఏకంగా తన కిడ్నీనే అమ్మి పారేశాడు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే ఆపిల్ సంస్థ ఎంత ధర పెట్టినా వెచ్చించి ఆ కంపెనీ ఉత్పత్తులను జనం వెర్రిగా కొంటున్నారు. అయితే నిజంగా అవి అంత ఖరీదు చేస్తాయా అని కొందరు నిపుణులు వాటిని పరీక్షించి చూస్తే వెల్లడి అయిన నిజాలు చూడండి.
ఐ సప్ప్లై అనే సంస్థకి చెందిన నిపుణులు లేటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ 4S ని విడదీసి ఆ విడి భాగాల ఖరీదు లెక్క కడితే అది 120 పౌండ్లుగా తేలింది. అదే ఫోను 32 GB వెర్షన్ 499 పౌండ్లకి అమ్ముడు బోతూంది. మన కరెన్సీలో చూస్తే తయారీకి అయ్యేది పది వేలయితే అమ్మేది నలభై వేలు. ఈ అధిక ధర ఆ ఫోన్ కోసం ఆ కంపెనీ వెచ్చించిన రీసెర్చ్, డెవలప్‌మెంట్ తదితరాలకూ, కంపెనీకున్న ఇమేజ్‌కీ వినియోగదారుడు చెల్లిస్తున్నట్టు అనుకోవాలి. ఐ ఫోన్‌తో అన్ని విధాలుగా పోల్చదగ్గ శామ్‌సంగ్ S2 ఫోన్ 32 వేలకే దొరుకుతుంది. ఐ ఫోన్‌లో వాడే మెమరీ చిప్స్ తయారుచేసేది శామ్‌సంగ్ కావడం ఒక విశేషం. శామ్‌సంగ్ కంపెనీ నుండి మెమరీ చిప్స్ కొనుగోలు చేసే కంపెనీలలో అతి పెద్దది ఆపిల్.
9 comments:
ఒక రివాల్వర్ తయారీకి ఉపయోగించే లోహం, ఇనుము కానివ్వండి లేదా తుత్తునాగం(zinc) కలిపి కానివ్వండి, ఆ లోహం ఖర్చు & కరిగించడానికయ్యే ఖర్చు కలిపి వెయ్యి రూపాయలు దాటదు. కానీ కోఠీ ఆర్మొరీలో రివాల్వర్ ధర పాతిక వేలు ఉంటుంది.
even the processor of first iphone is from Samsung.
ఒక రివాల్వర్ తయారీకి ఉపయోగించే లోహం, ఇనుము కానివ్వండి లేదా తుత్తునాగం(zinc) కలిపి కానివ్వండి, ఆ లోహం ఖర్చు & కరిగించడానికయ్యే ఖర్చు కలిపి వెయ్యి రూపాయలు దాటదు.
praveen...can you give some reference??
చిన్నప్పుడు మా తాతగారు ఇంటి వాకిట్లో కొలిమి పెట్టి సీసం కరిగించి DBBL గుళ్ళు తయారు చేసేవాళ్ళు. ఆ గుళ్ళని మేగజిన్‌లో పెట్టి తుపాకీ మందు (గన్ పౌడర్) పోసి పేల్చేవాళ్ళు. ఇనుము, తుత్తునాగం, సీసం లాంటి లోహాల ధరలు ఎంతుంటాయో మాకు తెలియదా? ఒకప్పుడు బ్రిటిష్ కంపెనీ వెబ్లీ & స్కాట్ తయారు చేసిన రివాల్వర్లు భారతీయ మార్కెట్‌లో డబ్బై ఐదు వేలకి దొరికేవి. కానీ ఇతర కంపెనీలు తయారు చేసిన రివాల్వర్ల ధర పాతిక వేలు దాటేది కాదు.
ఏమండీ, ఆ ఐ ఫొను కంపనీ ఎంప్లొయీస్, షేర్ హొల్దెర్స్ కుర్చీ యజమాని ఎటచెట్రా వాటి ఖరీదు వెలకట్టకనే మీరు ఇలా లెక్క కడితె ఎలా ? మన ముఖ్య మంత్రులు పెట్టే పొట్టి సంతకం మనం పెట్టలేమా ? వారికి ఎందుకంత జీతాలు ? మన కెందుకింత తక్కువ జీతాలు ?
ఇంకో విషయం గమనించారా? HP స్కానర్ కమ్ ప్రింటర్ యొక్క బాక్స్ మీద ధర 18,000 రూపాయలు అని ముద్రించి ఉంటుంది. కానీ హార్డ్‌వేర్ డీలర్ హోల్‌సేలర్ దగ్గర కొనేది 12,000 రూపాయలకే. హార్డ్‌వేర్స్ తక్కువగా అమ్ముడుపోయినా హార్డ్‌వేర్ డీలర్ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉండాలి కదా. అందుకే 33% ఎక్కువ ధరకే అమ్ముతాడు.
చిన్నప్పుడు మా తాతగారు ఇంటి వాకిట్లో కొలిమి పెట్టి సీసం కరిగించి DBBL గుళ్ళు తయారు చేసేవాళ్ళు. ఆ గుళ్ళని మేగజిన్‌లో పెట్టి తుపాకీ మందు (గన్ పౌడర్) పోసి పేల్చేవాళ్ళు. ఇనుము, తుత్తునాగం, సీసం లాంటి లోహాల ధరలు ఎంతుంటాయో మాకు తెలియదా?
ohh...is it..good. i will give you 2000 rupees.. can you make one for me??
ఇప్పుడు కూడా పల్లెటూర్లలో నాటు తుపాకులు తయారు చేసేవాళ్ళు కొలిమిలోనే ఇనుము కాల్చి నాటు తుపాకులు తయారు చేస్తారు. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో కనిపెట్టిన స్మూత్ బోర్ మజిల్ లోడర్ (SBML) తుపాకులని పల్లెటూర్లలో నాటు తుపాకులు అంటారు. పాత బేటరీల నుంచి సీసం కలిసిన భాగం తీసి దాన్ని కరిగించి పేడ మీద పోస్తారు. ఆ ద్రవం పేడ మీద ఒలికిన తరువాత అందులో సీసం, ఇతర పదార్థాలు వేరవుతాయి. ఆ సీసంతోనే బుల్లెట్లు తయారు చేస్తారు. వాటికి SBML తుపాకీ యొక్క మేగజిన్‌లో పెట్టి గన్ పౌడర్ పోసి పేలుస్తారు.
http://en.wikipedia.org/wiki/List_of_British_ordnance_terms#SBML అప్పట్లో SBML తుపాకులని ఇనుముతో చేసేవాళ్ళు. ఇతర రకాల తుపాకులని రాగి, తగరం, తుత్తునాగం లాంటి లోహాలతో చేసేవాళ్ళు. రాగి, తగరం, తుత్తునాగం లాంటి లోహాలని కంచరివాళ్ళు (bronze-smiths) కరిగిస్తారు కానీ కమ్మరివాళ్ళు (black-smiths) కరిగించరు.
ఇప్పుడు కూడా పల్లెటూర్లలో నాటు తుపాకులు తయారు చేసేవాళ్ళు కొలిమిలోనే ఇనుము కాల్చి నాటు తుపాకులు తయారు చేస్తారు
only natu thupakulu...can't they make revolvers?? so using the same procedure can you make one revolver for me?? as i said earlier i will you 2000 rupees..
Post a Comment