ఈ మధ్య పేపర్లలో దూకుడు, ఊసరవెల్లి గ్రాస్, షేర్ అంటూ కోట్లలో లెక్కలు చూపిస్తూ ఉండడం చూసి ఒక మల్టీ నేషనల్ సంస్థ కూడా టాలీ వుడ్‌లో్దిగాలని అనుకొంది. అనుకొన్నదే తడవుగా సర్వేలు జరిపి శ్రీను వైట్ల లాంటి దర్శకుడిని, కోన వెంకట్ లాంటి రచయితని పట్టుకొని అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకొంది. దర్శకుడు, రచయిత, సంస్థ ప్రతినుధులు ఇద్దరు కలిసి ఒక ఫైన్ మార్నింగ్ స్టోరీ మీద కూర్చున్నారు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో.
"మీకు ఏ తరహా కథ కావాలి?" అడిగాడు కోన వెంకట్. వచ్చిన ప్రతినిధుల్లో నం.1 తన చేతిలో లాప్ టాప్ ఓపెన్ చేసి "ఈ మధ్య ఎక్కువ వసూలు చేసిన ఇండియన్ సినిమా, హాలీ వుడ్ సినిమా రెండూ సైన్స్ ఫిక్షనే. మేమూ అదే తీయాలనుకొంటున్నాము" అన్నాడు. శ్రీను వెంకట్ వైపు చూశాడు, వీడు సైన్స్ ఫిక్షన్ రాయగలడా అన్నట్టుగా. కానీ వెంకట్ ఏమీ తడుముకోకుండా, "నా దగ్గర మంచి సైన్స్ ఫిక్షన్ లైన్ ఉంది. చెప్తాను వినండి" అన్నాడు.
అందరూ అతనికి చెవులప్పగించారు. వెంకట్ మొదలు పెట్టాడు.
" ఒక దుష్ట సైంటిస్టు, అతనికి తోడుగా ఒక చెడ్డ కోటీశ్వరుడు. ఇద్దరూ ఒక దీవిలో తమ స్థావరం నిర్మించుకొని ప్రపంచాన్ని తమ పాదా క్రాంతం చేసుకోవాలని చూస్తుంటారు. వీరి ఆట కట్టించడానికి ప్రభుత్వం హీరోని పంపుతుంది" అని ఆపాడు. ఆ వచ్చిన ఇద్దరు ప్రతినిధుల్లో ఒక్కడు కూడా అప్పటికి ఒకసారి కూడా జేమ్స్ బాండ్ సినిమా చూసి ఉండక పోవడం మూలాన ఉత్కంఠతో వింటున్నారు. వెంకట్ కొనసాగించాడు. "నానా కష్టాలు పడి, మధ్యలో హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడి విలన్ పంపిన రౌడీలతో స్టంట్లు చేసి హీరో ఒక పెద్ద షిప్పులో ఆ దీవి దగ్గరకి వెళ్తాడు. విలన్ హీరో పైకి ఒక మిస్సైల్ వదుల్తాడు. హీరో తన మిస్సైల్‌తో దానిని చిత్తు చేస్తాడు. విలన్ ఒక న్యూక్లియర్ బాంబు వేస్తాడు.హీరో దానిని పేలకుండా నిర్వీర్యం చేస్తాడు. అలా ఒక పావు గంట గ్రాఫిక్స్‌తో పోరాటాన్ని చూపిస్తాం. అప్పుడు హీరో, విలన్ ముఖాముఖీ తలపడుతారు. ఇద్దరూ లేజర్ కత్తులు పట్టుకొని కత్తి యుద్ధం చేస్తారు" అని ఆపాడు వెంకట్.
ఆ ప్రతినిధులిద్దరూ అంతకు ముందు స్టార్ వార్స్ సినిమా చూసి ఉండక పోవడం వలన వాళ్ళకి లేజర్ కత్తులతో యుద్ధం చాలా సూపర్ అనిపించింది. వెంకట్ మళ్ళీ చెప్పసాగాడు. " అలా కాస్సేపు పోరాటం చెశాక ఇద్దరూ ఒకరి కత్తిని మరొకరు ఎగర గొట్టేస్తారు. అప్పుడు హీరో పక్కన పడి ఉన్న ఒక కత్తి పుచ్చుకొని విలన్‌ని నరికేస్తాడు" అని ముగించాడు. ప్రతినిధి నం.2 తన లాప్ టాప్‌లో ఎంత ఖర్చవుతుందో లెక్కలేయ సాగాడు. నం.1 కొంచెం అసంతృప్తిగా కనిపించాడు. "ఎనీ డౌట్స్?" అడిగాడు వెంకట్. "ఇంత పెద్ద హైటెక్, సైన్స్ ఫిక్షన్ మూవీలో, అంత సేపు టెక్నాలజీతో ఫైటింగ్ చేసి, చివర్లో మరీ అలా కత్తితో పొడిచి విలన్‌ని చంపడమేమిటా అని."
వెంకట్‌కి కోపమొచ్చింది. కళ్ళు ఎరుపెక్కాయి. "నిజం చెప్పు నువ్వసలు స్వచ్చమైన తెలుగు వాడివేనా?" అని హూంకరించాడు. "లేదండీ. మా నాన్న తెలుగు, అమ్మ బెంగాలీ. ఎలా కనిపెట్టారు?" అడిగాడు నం.1.
"స్వచ్చమైన తెలుగువాడు ఇలాంటి చచ్చు ప్రశ్నలేయడు. చూపించింది చూపించినట్టు చూస్తాడు."
6 comments:
:) !!!
బాగుంది కధ
lol :) elanti great idea lu only telugu writers ki matrame vasthay....super
idea bhale undandee, inthakee meeru swacchamaina telugu vaarenaa?????
:)
అబ్బ..యెమి వ్రాసారండీ...సినిమా కళ్ళ ముందు కదిలింది....
Thank you.
Post a Comment