నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, October 14, 2011

ఆఫ్రికన్ చిన్నారుల రక్తంతో ఇంగ్లాండ్‌లో భూత వైద్యం


భూత వైద్యం కోసం చిన్న పిల్లల రక్తం వాడడం... ఇదేదో వెనక పడ్డ ఒరిస్సా, తెలంగాణా, బీహార్, యూపీ, ఆఫ్రికాలో కాదు. ప్రపంచానికి నాగరికత నేర్పించామని చంకలు గుద్దుకొనే ఇంగ్లాండ్‌లో సాగుతున్న భీభత్సం. ఇంటి సమస్యలా, వ్యాపారంలో సమస్యలా, ప్రేమ సమస్యా? అయితే మిమ్మల్ని గట్టెక్కించడానికి జుజూని ఆశ్రయించండి. లండన్‌లో హైక్లాస్ సొసైటీలో, కొన్ని వార్తాపత్రికలలో ఒక మూలన ఇలాంటి ప్రకటనలు కనిపిస్తాయి. ఎక్కువగా ఆఫ్రికన్లు ఈ భూత వైద్యం చేస్తుంటారు. చాలా మటుకు ఇది ఎవరికి హాని కలిగించకపోయినా కొంతమంది ఈ భూత వైద్యానికి చిన్న పిల్లల రక్తం వాడుతారు. ఇలా పిల్లల రక్తంతో చేసే భూత వైద్యం, దీనినే జుజూ అంటారు, బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.


ఇలా రక్తాన్ని సేకరించడం కోసం ఆఫ్రికా నుంచి పిల్లలని కిడ్నాప్ చేసి తరలించే ముఠాలు ఉన్నాయి. వీరి బారిన పడేది ఎక్కువగా ఉగాండా దేశం. కనీసం 400 మంది ఇలాంటి పిల్లలని బ్రిటీష్ అధికారులు రక్షించి తమ దేశానికి తిప్పి పంపారు. ఇంకా చాలా మంది ఈ భూత వైద్యుల చెరలో చిక్కుకుని ఉన్నారు. ఇలా వీరి చెరలో చిక్కి నానా హింస అనుభవించి బయట పడ్డ ఒక పిల్లవాడు చెప్పిన దాన్ని బట్టి ఈ భూత వైద్యులు జుట్టు కత్తిరించి, చేతులు, కాళ్ళు, మెడ, జననాంగాలు గాయ పరిచి రక్తాన్ని సేకరిస్తారు. ఆ పిల్లలని ఒక చోట బంధించి తమకు అవసరమైనప్పుడల్లా జలగల్లా రక్తాన్ని పీలుస్తూ ఉంటారు. "వాడు ఏదో ఒకరోజు నా తలని కత్తిరిస్తానని భయపెట్టేవాడు" అని ఆ పిల్ల వాడు అధికారులకి చెప్పాడు. 
 


Children in Uganda wearing "Pray to end child sacrifice" t-shirts  


ఇలా పిల్లలని అపహరించడం ఉగాండాలో ఒక పెద్ద వ్యాపారంలా సాగుతోంది. పిల్లల కోసం వచ్చిన వారిలా ఇద్దరు BBC విలేఖరులు ఇలాంటి వ్యాపారంలో ఉన్న ఒకడిని కలిసినప్పుడు అతను పదీ, పాతికా, యాభై, వందా ఇలా ఎంత మంది కావాలన్నా సరే తను సరఫరా చేయగలనని చెప్పాడు. ఇలాంటి నేరాలని అరికట్టడానికి ఉగాండాలో ఒక పోలీసు విభాగం ఉన్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం ఈ చిన్నారుల అక్రమ రవాణాని ఆపలేకపోతున్నారు.
  
పిల్లల్ని అపహరించడమే వృత్తిగా పెట్టుకున్న యూనస్ కాబూల్

ఆఫ్రికా నుండి వచ్చిన వాళ్ళు మూర్ఖులూ, అగ్నానులూ కాబట్టి ఈ భూత వైద్యాలు, క్షుద్ర పుజలు చేస్తున్నారని అనుకున్నా ఈ ఇరవై ఒకటో శతాబ్ధంలో ఇంగ్లాండులో ఈ పూజల్ని ప్రోత్సహించే వెధవ సన్నాసులూ, వాటికోసం అభం శుభం తెలియని చిన్నారుల రక్తాన్ని వాడే నర రూప రాక్షసులు ఉండడం ఆశ్చర్యంగా ఉంది. 

1 comment:

Sree said...

bhootaalu ante inkevaro karu, aa poojalu chese vallu, cheyinchukune vallu. So, england lo kooda unnayi bhootalu deyyalu.