నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, February 1, 2011

కలెక్షన్లు నిల్లు - లాభాలు ఫుల్లు


ఒక సినిమా హిట్టవ్వాలంటే ముందుగా కావలసింది ప్రేక్షకులకి నచ్చడం. అది ఉంటేనే విమర్శకుల ప్రశంసలు మిగతావన్నీ. జనం మెచ్చకుండా క్రిటిక్స్‌కి నచ్చినా నిర్మాతకి ఒరిగేదేమీ ఉండదు. కానీ కొన్ని సార్లు జనం చూడక పోయినా నిర్మాత డబ్బులు దండుకోవచ్చు. ఉదాహరణకి రజనీకాంత్ సినిమా బాబాని తీసుకోవచ్చు. బాషా తరువాత అదే దర్శకుడు సురేష్ కృష్ణతో బాబా సినిమా అనౌన్స్ చేయగానే పంపిణీదారులు ఎగబడి అడ్వాన్సులిచ్చి అధిక మొత్తంలో కొనుగోళ్ళు జరిపి నిర్మాతకి కాసుల పంట పండించారు. అయితే రజనీ తన మెదడులోని సంక్లిష్టనంతా అందులో నింపడంతో అది కనీవినీ ఎరుగని ఫ్లాపయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు నెత్తిన చెంగేసుకున్నారు. వారికి రజనీ డబ్బు తిరిగి ఇచ్చి, తన తరువాతి చిత్రం చంద్రముఖితో వారిని నష్టాల నుంచి బయట పడేశాడు. అది వేరే విషయం.
  
కానీ అన్ని సార్లూ ఇది సాధ్యం కాదు. ఇలా జరగాలంటే హీరోకి సూపర్ ఇమేజ్ ఉండాలి. ప్రొడ్యూసర్‌కి అదే రేంజ్ తెలివితేటలు ఉండాలి. ఇవి రెండూ పుష్కలంగా ఉన్న మరొక సినిమా ప్రజారాజ్యం పార్టీ. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి ఇమేజ్ అనితర సాధ్యం. అందుకు సమానంగా లేదా నాలుగాకులు ఎక్కువ ఆయన్ని నడిపించే అరవింద్ తెలివితేటలు. ప్రజారాజ్యాన్ని ఆ సినిమా నావికుడు అల్లు అరవింద్ అదే బాటలో నడిపిస్తున్నాడు. ఒక బిగ్ బడ్జెట్ సినిమా దారిలోనే దాన్ని నడిపిస్తున్నారు మొదటినుండి కూడా. 
 
మొదట్లో సినిమా ఎప్పుడు వస్తుందో సస్పెన్స్‌గా ఉంచారు. దానిలో నటీ నటులు సస్పెన్స్, స్టోరీ సస్పెన్స్... విడుదల కూడా అలాఇలా చేయలేదు. పెద్ద సినిమా లెవెల్లో అద్భుతమైన సెట్టింగ్ వేసి లక్షలాదిమందితో హోరెత్తించి రిలీజ్ చేశారు. రిలీజయ్యాక ప్రచారం కూడా అందరూ నోరెళ్ళబెట్టేలా సాగింది. ఈ కథా కమామీషూ చూసి కాకలు తీరిన నాయకులు కూడా ఇక కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవి అని నమ్మారు. కావాలంటే ఈ లిస్టు చూడండి. హరిరామ జోగయ్య, కోటగిరి విధ్యాధర రావు, దేవేందర్ గౌడ్, పెద్ది రెడ్డి అండ్ పార్టీ, భూమా నాగి రెడ్డి అండ్ వైఫ్...... కానీ సినిమా రిలీజయ్యాక బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. 
 
అయితేనేం. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆ ఫ్లాప్ సినిమాకే అడ్వాన్సుగా అధిక మొత్తానికి టికెట్లమ్మి కలెక్షన్లు లేకపోయినా లాభాల పంట పండించాడు. ఎన్నికలు ముగిశాక ఒకరొకరుగా తట్టా బుట్టా సర్దుకొని పార్టీని వీడి వెళ్ళిపోతుంటే మిగిలిన వారితో అయిదేళ్ళూ ఎలా లాక్కురావాలా అని మధన పడుతుంటే జగన్ రూపంలో ఒక సంక్షోభం కాంగ్రెస్‌ని చుట్టుముట్టి చిరుకి మరొక అద్భుతమయిన అవకాశాన్ని అందించింది. సినిమా వీడియో రైట్స్ అమ్మి డబ్బులు సంపాయించినట్టు ప్రజా రాజ్యం మద్ధతుతో కూడా ఎంతోకొంత మూటగట్టుకొనే అవకాశం ఉండడంతో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ పార్టీ కార్యకలాపాలలో పాల్గొనని అరవింద్ అంటోనీతో మంతనాల టైంకి వచ్చేశాడు. ఇలాంటి విషయాలు డీల్ చేయడానికి చిరుకన్నా తనే సరయిన వాడినని ఆయనకు బాగా తెలుసు మరి. 

6 comments:

Sree said...

ponee lendi krsihna garu, cong prp kalasi jagan ni addukuni 5 ellu nettuku vaste manaki elections kharchu ayinaa migulutundi. Andulonu ee madhya sakshi paper eppudoo TDP ki kartavyam gurtu testunte mallee elections perita money waste avutundani bhayam pattukundi.

Siri said...

cheru kosm ila anukovatam badhaga vunna, Krishna garu cheppindi correct. i think cheru is unfit & not suitable for politics. he is very nice person.

Anonymous said...

"elections kharchu ayinaa migulutundi"

To save election expenditure, continuing the most corrupt Govt. is stupidity.

People must get a chance to elect new government asap.

Chiru started party to get rid of corrupt YSR and corrupt Congress Party, but he ended up helping YSR and Congress. What a irony?

Anonymous said...

Thanks for showing your cast feeling.

Please change ur blog tile as shit on the face. It would be suitable to you.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Man, you are mistaken.Do you know what is my caste? If you take a look of my blog it clearly tells you some times those who are your dear and near gets some brickbats and not to take it to heart. It's all in the game.

For your kind information, I don't belong to kamma caste.

Anonymous said...

nijam chepte kulam gurostada tappulu cheseappudu kulalu gurtuku rava